గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పరిశుభ్ర నగరాలకు అవార్డులు


పారిశుధ్య కార్మికులను అత్యుత్తమంగా సంరక్షించే నగరాలకు పురస్కారాలు అందించనున్న రాష్ట్రపతి

ఈ ఏడాది 342 నగరాలకు స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్

బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ సంచులపై నిషేధాన్ని నోటిఫై చేసిన 3,000 కు పైగా యుఎల్ బిలు

మురుగు నీరు , సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల భద్రత , గౌరవం కల్పించే 'సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్'లో పాల్గొన్న 246 నగరాలు

Posted On: 18 NOV 2021 1:13PM by PIB Hyderabad

2021 నవంబర్ 20న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యుఎ) నిర్వహించే  'స్వచ్ఛ అమృత్ మహోత్సవ్'లో స్వచ్ఛ సర్వేక్షణ్ (ఎస్ ఎస్) 2021 అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గౌరవిస్తారు.  స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద చెత్త రహిత భారతదేశం అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఈ కార్యక్రమం లో చెత్త రహిత నగరాలకు స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ కింద సర్టిఫికేట్ పొందిన నగరాలకు కూడా అవార్డులు ఇస్తారు.మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు ప్రారంభించిన సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్ కింద ఉన్నత పనితీరు కనబరిచిన నగరాలను గుర్తించడం ద్వారా పారిశుధ్య కార్మికులను  ఈ కార్యక్రమం లో సత్కరిస్తారు. 2021 అక్టోబర్ 1వ తేదీన ప్రధాన మంత్రి ఎస్ బిఎమ్-యు 2.0 ను ప్రారంభించిన తరువాత  ఆ దిశగా ఇది ప్రధాన మైలురాయి.

కొన్నేళ్లుగా నగరాల సంఖ్య స్థిరంగా పెరగడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ స్థాయి నిదర్శనం. 2016 లో 73 ప్రధాన నగరాలను సర్వే చేయడం నుండి, 2021 లో 4,320 నగరాలు పాల్గొన్నాయి, స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క 6 వ ఎడిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వేగా మారింది. ఈ సంవత్సరం సర్వే విజయాన్ని గణనీయ సంఖ్యలో పాల్గొన్న ఐదు కోట్ల మంది పౌరుల అభిప్రాయాల (ఫీడ్ బ్యాక్) ద్వారా అంచనా వేయవచ్చు. గత సంవత్సరం వారి సంఖ్య 1.87 కోట్లు. కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక క్షేత్ర స్థాయిసవాళ్లు ఉన్నప్పటికీ 2021 సర్వే ను  28 రోజుల రికార్డు సమయంలో నిర్వహించడం విశేషం. మునుపటి సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రాలు , నగరాల పనితీరులో గణనీయమైన క్షేత్ర స్థాయి మెరుగుదలలు ఉన్నాయి.  ఉదాహరణకి… 

6 రాష్ట్రాలు ,6 కేంద్ర పాలిత ప్రాంతాలు గత సంవత్సరం కంటే వాటి  మొత్తం  క్షేత్ర స్థాయి పనితీరులో మొత్తం మెరుగుదల (5 - 25%) మధ్య చూపించాయి
1,100 కు పైగా అదనపు నగరాలు సోర్స్ సెగ్రిగేషన్ ప్రారంభించాయి;
దాదాపు 1,800 అదనపు యుఎల్ బిలు తమ పారిశుధ్య కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలను విస్తరించడం ప్రారంభించాయి;
1,500 కు పైగా అదనపు యుఎల్ బిలు బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ సంచుల వినియోగం, అమ్మకం , నిల్వపై నిషేధాన్ని నోటిఫై చేశాయి; మొత్తం మీద, 3,000 కు పైగా యుఎల్ బిలు ఈ నిషేధాన్ని నోటిఫై చేశాయి.

అన్ని ఈశాన్య రాష్ట్రాలు తమ పౌరుల ఫీడ్ బ్యాక్ లో గణనీయమైన మెరుగుదలను చూపించాయి - సుదూర ప్రాంతాలతో సహా ప్రతి పౌరుడికి లక్ష్యాలు ఎలా చేరుకుంటున్నాయన్నది మరొక నిదర్శనం.  

చెత్త రహిత నగరాల స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ కింద సర్టిఫికేషన్ ప్రక్రియ లో ఇదే విధమైన కఠినత కనబడుతుంది. 2018లో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యుఎ) ప్రవేశ పెట్టిన  స్మార్ట్ ఫ్రేమ్వర్క్ ద్వారా వ్యర్థాల నిర్వహణ లో నగరాల పని తీరును  సమగ్రంగా అంచనా వేశారు. 2018 లో కేవలం 56 నగరాలకు మాత్రమే కొన్ని స్టార్ రేటింగ్ పై సర్టిఫికేషన్ లభించింది. ఈ సంవత్సరం, ఈ సంఖ్య 342 నగరాలకు పెరిగింది (9 ఫైవ్ స్టార్ నగరాలు, 166 త్రీ-స్టార్ నగరాలు, మరియు 167 వన్-స్టార్ నగరాలు). అంతేగాక, ఈ సంవత్సరం సర్టిఫికేషన్ ప్రక్రియలో 2,238 నగరాలు పాల్గొన్నాయి. ఇది గార్బేజ్ ఫ్రీ ఇండియా దార్శనికత పట్ల పట్టణ భారతదేశం నిబద్ధతకు సంకేతం.

స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ అనేది స్వచ్ఛతా  ప్రయాణంలో ఫ్రంట్ లైన్ సైనికులు అయిన సఫాయిమిత్రల జీవితాలను మెరుగుపరచడానికి స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ స్థిరమైన దృష్టిని పునరుద్ఘాటిస్తుంది. మురుగు నీరు , సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల భద్రత ఆత్మగౌరవం కాపాడేందుకు,పట్టణ పారిశుధ్య నిఘంటువు నుండి ప్రమాదకరమైన శుభ్రత ముప్పును నిర్మూలించడానికి గత నవంబర్ లో ఎంఓహెచ్ యుఎ ప్రవేశపెట్టిన 'సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్' కింద ఉత్తమ ప్రదర్శన నగరాల కృషికి ఈ అవార్డు ఉత్సవం వందనం చేస్తుంది. పట్టణ భారతదేశంలో నేడు 'మ్యాన్ హోల్ టు మెషిన్ హోల్' విప్లవాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ రకమైన అంచనా ప్రక్రియలో మొత్తం 246 నగరాలు భాగంగా ఉన్నాయి, మురుగుకాలువలు , సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేటప్పుడు "సున్నా-మానవ ప్రమాదం" పైనే ఇవి ప్రధానం గాఅయన్నిచూస్తున్నాయి దృష్టి సారించాయి.

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పురి, సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రులు, మేయర్లు సహా అనేక మంది ప్రముఖులు ఈ అవార్డు ప్రదానోత్సవంలో 300 కు పైగా అవార్డులను వివిధ కేటగిరీల్లో ప్రదానం చేస్తారు. దౌత్యవేత్తలు, రాష్ట్ర , నగర నిర్వాహకులు, సీనియర్ అధికారులు, భాగస్వాములు,బ్రాండ్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు, సిఎస్ఓలతో కూడిన దాదాపు 1,200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు, భారతదేశం అంతటా ఉన్న పౌరులు ఈ ఉత్సవాన్ని వర్చువల్ గా వీక్షించవచ్చు. రాష్ట్రాలు మరియు నగరాలను సత్కరించడంతో పాటు, స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ ఎస్ బి ఎం-  యు 2.0 గొడుగు కింద ప్రారంభించాల్సిన అనేక కార్యక్రమాలను వరుసలో ఉంచింది.

గత ఏడు సంవత్సరాలుగా, మిషన్ 'ప్రజలే ముందు‘ దృష్టితో దేశం నలుమూలలా చేరుకుని అసంఖ్యాక పౌరుల జీవితాలను మారుస్తోంది. ఈ మిషన్ పట్టణ భారతదేశంలో పారిశుధ్య స్థలాన్ని ౭౦ లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా మార్చి వేసింది.  అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన పారిశుధ్య పరిష్కారాలను అందిస్తోంది. మహిళలు, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలు , దివ్యాంగుల అవసరాలకు ఎస్ బిఎమ్-యు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మిషన్ వరుసగా 3,000 నగరాలు , 950 కి పైగా నగరాలు వోడిఎఫ్+ ఒడిఎఫ్++ సర్టిఫికేట్ తో స్థిరమైన పారిశుధ్య మార్గంలో కదులుతోంది. నగరాలు కూడా వాటర్+ సర్టిఫికేషన్ దిశగా పురోగమిస్తున్నాయి, ఇది వ్యర్థ జలశుద్ధి మరియు దాని గరిష్ట పునర్వినియోగాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో వ్యర్థాల ప్రాసెసింగ్ 2014 లో 18% నుండి నేడు 70% కు నాలుగు రెట్లు పెరగడం శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పట్ల  గట్టి కృషి కి నిదర్శనం.మరీ ముఖ్యంగా, పారిశుధ్య కార్మికులు అనధికారిక పారిశుధ్య కార్మికుల జీవితాల్లో మిషన్ గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ఈ కార్యక్రమంలో 20 కోట్ల మంది పౌరులు (భారతదేశ పట్టణ జనాభాలో 50% పైగా ఉన్నారు) చురుకుగా పాల్గొనడం మిషన్ ను విజయవంతంగా ప్రజల ఉద్యమంగా మార్చింది.

2021 అక్టోబ ర్ 1న ప్రారంభించిన స్వచ్ఛ భార త్ మిష న్ -అర్బన్ 2.0, ప్రజలందరికీ పారిశుధ్య సౌకర్యాలను సంపూర్ణంగా అందించడం పై దృష్టి సారిస్తుంది. ఒక లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో పూర్తి ద్రవ వ్యర్థాల నిర్వహణ - ఎస్ బిఎమ్-అర్బన్ 2.0 కింద ప్రవేశపెట్టిన  కొత్త అంశం. ఇది వ్యర్థజలాన్ని సేకరించడం, రవాణా చేయడం శుద్ధి చేయడం ద్వారా, ఎలాంటి వ్యర్థజలం మన నీటి వనరులకు కలుషితం చేయకుండా చూస్తుంది. ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలో, మూలాల విభజన, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీల ఏర్పాటు వ్యర్థాల ప్రాసెసింగ్ సౌకర్యాల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి ఉంటుంది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తొలగించడం, నిర్మాణం ,కూల్చివేత (సి డి) వ్యర్థాల ప్రాసెసింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం ,నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్ సిఎపి) నగరాల్లో మరియు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మెకానికల్ స్వీపర్ల తరలింపుపై దృష్టి పెడతారు. నగరాలను చెత్త రహితంగా మార్చే లక్ష్యంతో అన్ని లెగసీ డంప్ సైట్ ల నివారణ ఎస్ బిఎమ్-యు 2.0 కింద మరో కీలకమైన అంశం. ఎస్ బిఎమ్-యు 2.0 పారిశుధ్యం అనధికార పారిశుధ్య  కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటెన్సివ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసి) ,ప్రవర్తన మార్పు కార్యకలాపాల ద్వారా, ఎస్ బిఎమ్-యు పర్యాయపదంగా మారిన 'జన్ ఆందోళన్' లేదా ప్రజా ఉద్యమాన్ని మిషన్ మరింత తీవ్రతరం చేస్తుంది . ఇంకా బలోపేతం చేస్తుంది.

అందువల్ల స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ స్వచ్ఛత పట్ల నగరాల అచంచల అంకితభావానికి తగిన వందనం చేయడం మాత్రమే కాదు, అందరికీ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , మరింత సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను నిర్మించే దిశగా తమ ప్రతిజ్ఞ కు  పునరంకితం కావాలని  పట్టణ భారతదేశానికి పిలుపునిస్తుంది.

***
 



(Release ID: 1772945) Visitor Counter : 159