ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 20-21 తేదీల లో లఖ్ నవూ పోలీసు ప్రధాన కేంద్రం లో జరిగే 56వ డిజిపి ల సమావేశాని కి హాజరు కానున్న ప్రధాన మంత్రి
Posted On:
18 NOV 2021 1:47PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 20-21 తేదీల లో లఖ్ నవూ లోని పోలీసుప్రధాన కేంద్రం లో జరిగే 56వ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిపి), ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్(ఐజిపి) సమావేశాని కి హాజరు కానున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాన్ని హైబ్రిడ్ ఫార్మేట్ లో నిర్వహించడంజరుగుతుంది. ఇందులో భాగం గా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలడిజిపి లు, కేంద్ర సాయుధ రక్షక భట బలగాల, కేంద్రీయ పోలీసు సంస్థ ల అధిపతులు లఖ్ నవూ లో సమావేశస్థలం లో స్వయం గా హాజరు కానుండగా, మిగిలిన ఆహ్వానితులు ఐబి/ ఎస్ఐబి ప్రధానకేంద్రం లో 37 వేరు వేరుప్రదేశాల నుంచి వర్చువల్ పద్ధతి లో పాలుపంచుకోనున్నారు. సైబర్ క్రైమ్, డేటా గవర్నెన్స్, ఉగ్రవాదాని కి వ్యతిరేకం గాచేపట్టే చర్యల లో ఎదురవుతున్న సవాళ్ళు, వామపక్ష తీవ్రవాదం, మత్తు పదార్థాల అక్రమ తరలింపు లోచోటుచేసుకొంటున్న కొత్త కొత్త ధోరణులు, జైలు సంబంధి సంస్కరణలు తదితరఅంశాలు సహా అనేక అంశాలను గురించి ఈ సమావేశం చర్చించనుంది.
ప్రధాన మంత్రి 2014వ సంవత్సరం నాటి నుంచి డిజిపి ల సమావేశం పట్ల అమితశ్రద్ధ ను తీసుకొన్నారు. ఇంతకు ముందు మాదిరి ప్రతీకాత్మక హాజరు కు భిన్నం గా,ఆయన ఈ సమావేశం తాలూకు అన్ని సదస్సుల కు హాజరవుతుండడం తో పాటు పోలీసు విభాగం తాలూకు కీలక అంశాలుమరియు దేశాన్ని ప్రభావితం చేస్తున్న ఆంతరంగిక, సామాజిక అంశాల విషయం లో ప్రధానమంత్రి కి నేరు గా పరిస్థితి ని వివరించేందుకు అగ్రశ్రేణి పోలీసు అధికారులు ఒకఅవకాశాన్ని కల్పించేటటువంటి స్వచ్ఛాయుత చర్చలను, ఇష్టాగోష్టి చర్చల ను కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు.
ప్రతి ఏటా నిర్వహించే సమావేశాల ను ఆనవాయితీ ప్రకారం దిల్లీ లో జరుపవలసిఉండగా, ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా 2014వ సంవత్సరం నుంచి- ఒక్క 2020వ సంవత్సరం లో మినహా- దిల్లీ కి వెలుపల నిర్వహించడమైంది. 2020వ సంవత్సరం లో ఈ సమావేశాన్నివర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించం జరిగింది. ఈ సమావేశాన్ని 2014వ సంవత్సరం లో గువాహాటీ లో; 2015 లో కచ్ఛ్ కు చెందిన రణ్ లోని ధోర్డో లో; 2016 లో హైదరాబాద్ లోని నేశనల్ పోలీస్ అకాడమీ లో; 2017 లో టేకన్ పుర్ లోని బిఎస్ఎప్అకాడమీ లో; 2018 లో కేవడియా లో; 2019 లో ఐఐఎస్ఇఆర్, పుణే లో నిర్వహించడమైంది.
***
(Release ID: 1772932)
Visitor Counter : 182
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam