సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రష్యన్ చిత్రనిర్మాత ఆండ్రీ కొంచలోవ్‌స్కీ హంగేరియన్ చిత్రనిర్మాత బెలాటార్‌ల చలనచిత్రాలను ప్రదర్శించేందుకు ఐఎఫ్ఎఫ్ఐలో రెట్రోస్పెక్టివ్ విభాగం ఏర్పాటయింది.
ఢిల్లీలో జరుగుతున్న 52వ ఐఎఫ్ఎఫ్ఐలో భాగంగా రెట్రోస్పెక్టివ్ (వెనకటి/పాత) సినిమాల విభాగంలో ప్రఖ్యాత హంగేరియన్ చిత్రనిర్మాత మిస్టర్ బేలా టార్ సినిమాలు ప్రదర్శిస్తారు. ఆయన సినిమాలు ఇది వరకే బెర్లిన్, కేన్స్ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందాయి. తనదైన దృశ్య శైలిని సృష్టించుకున్న రచయిత, చిత్రనిర్మాత. ఈ విభాగం రష్యన్ చిత్రనిర్మాత రంగస్థల దర్శకుడు ఆండ్రీ కొంచలోవ్స్కీ కృషిని కూడా గుర్తిస్తుంది. ఆయన సినిమాలు కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ స్పెషల్ డు జ్యూరీ, ఫిప్రెస్కీ అవార్డు, రెండు సిల్వర్ లయన్స్, మూడు గోల్డెన్ ఈగిల్ అవార్డులు, ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుతో సహా అనేక పురస్కారాలను గెలుచుకున్నాయి.
ఆండ్రీ సెర్జీవిచ్ కొంచలోవ్స్కీ (20 ఆగస్టు 1937, మాస్కో) ప్రసిద్ధ రచయితలు సెర్గీ మిఖల్కోవ్ , నటాలియా కొంచలోవ్స్కాయ కుటుంబంలో జన్మించారు. సెంట్రల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి సంగీతాన్ని అభ్యసించారు. తరువాత వీజీఐకే నుండి దర్శకత్వం నేర్చుకున్నారు. 1965లో, అకిరా కురోసావా ప్రేరణతో ది ఫస్ట్ టీచర్‌ను చిత్రీకరించాడు. ది స్టోరీ ఆఫ్ అస్యక్లియాచినా హూ లవ్డ్ బట్ డిడ్ నాట్ మ్యారీ (1966) అంకుల్ వన్య (1970) వంటి ఇతర ప్రముఖ చిత్రాలు విడుదలయ్యాయి. విమర్శకుల ప్రశంసలు పొందాయి.
52వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించే మిస్టర్ కొంచలోవ్‌స్కీ చిత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఫస్ట్ టీచర్
1965 | రష్యన్ | రష్యా
సారాంశం: ఇదే పేరుతో చింగిజ్ ఐత్మాటోవ్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సోవియట్ శకం తొలినాళ్లలో, అంతర్యుద్ధం ముగిసిన చాలా కాలం తర్వాత కిర్గిజిస్థాన్ జరిగిన ఘటనలను చూపిస్తుంది. దుయిషెన్ రెడ్ ఆర్మీ మాజీ సైనికుడు. స్థానిక పిల్లలకు విద్య బోధించడానికి కొమ్సోమోల్ అనే చిన్న గ్రామానికి వెళ్తాడు. దేశభక్తిని, పురోగతిని తీసుకురావాలనే ఆత్రుత శతాబ్దాల తరబడి మూలాలున్న జీవన విధానంతో పోటీ పడాలని అతను త్వరలోనే కనుగొంటాడు.
వన్యా అంకుల్
1970 | రష్యన్ | రష్యా
సారాంశం: ఈ చిత్రం అంటోన్ చెకోవ్ నాటకం ఆధారంగా తయారయింది. కథ రష్యన్ ప్రావిన్స్‌లో జరుగుతుంది. ఇక్కడ జన జీవితం మందకొడిగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు వృధాగా అనిపిస్తాయి. తన ప్రియురాలి కారణంగా వన్య జీవితం నాశనమవుతుంది. ప్రావిన్షియల్ ఎస్టేట్‌కు ఆస్తిని తీసుకువచ్చిన స్త్రీ పట్ల తనకున్న అవ్యక్త ప్రేమ కారణంగా వన్యా నిరాశలో కూరుకుపోతాడు.
రన్అవే ట్రెయిన్
1985 | ఆంగ్లం
సారాంశం: అలాస్కాలో నేపథ్యంగా చిత్రం సాగుతుంది. మానీ అనే ప్రమాదకరమైన రెసిడివిస్ట్ (జాన్ వోయిట్), ఆయన తోటిఖైదీ బక్ (ఎరిక్ రాబర్ట్స్) మంచుతో నిండిన అరణ్యంలోని జైలు నుండి తప్పించుకుంటాడు. స్వాతంత్ర్యం కోసం పారిపోయిన వారు సరుకు రవాణా రైలులో ఎక్కుతారు. అయితే, రైలు డ్రైవర్ గుండెపోటుతో చనిపోతాడు. అతి వేగంతో దూసుకెళ్తున్న రైలులో చిక్కుకుంటారు.
పోస్ట్‌మ్యాన్స్ వైట్ నైట్స్
2014 | రష్యన్ | రష్యా
సారాంశం: తమ మారుమూల గ్రామాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానించడానికి కేవలం పడవ మాత్రమే వారికి దిక్కు. కెనోజెరో సరస్సు నివాసులు బయటి ప్రపంచానికి దూరమవుతారు. శతాబ్దాలుగా వారి పూర్వీకుల మాదిరే జీవిస్తుంటారు: వాళ్ల సంఘం చిన్నది, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ తెలుసు. వాళ్లు చేసే పనులూ తెలుసు. మనుగడకు అవసరమైనవి మాత్రమే తయారు చేసుకుంటారు. గ్రామ పోస్ట్‌మ్యాన్ (అలెక్సీ ట్రయాప్టిసిన్) మాత్రమే వారికి పరిచయం ఉన్న బయటి ప్రపంచపు మనిషి. ఆయమే వారి ఏకైక సంబంధం. రెండు నాగరికతల మధ్య వంతెన వేయడానికి ఆయన మోటర్‌బోట్‌పై ఆధారపడతారు. కానీ ఆయన పడవ మోటారు చోరీ అయినప్పుడు, అతను ఇష్టపడే స్త్రీ నగరానికి పారిపోయినప్పుడు, పోస్ట్‌మ్యాన్ కొత్త జీవితం కోసం తహతహలాడుతాడు. దుస్సాహసం చేస్తాడు.
పారడైజ్
2016 | రష్యన్, జర్మన్, ఫ్రెంచ్ | రష్యా
సారాంశం: పారడైజ్.. ఓల్గా, జూల్స్ హెల్ముట్ అనే ముగ్గురు వ్యక్తుల హృదయ విదారక కథను చెబుతుంది, యుద్ధం, వినాశనం మధ్య వారి మార్గాలు మారుతాయి. ఓల్గా ఒక రష్యన్ కులీన వలసదారు. ఫ్రెంచ్ రెసిస్టెన్స్ సభ్యుడు కూడా. ఒక ఆకస్మిక దాడిలో యూదు పిల్లలను దాచిపెట్టినందుకు నాజీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమెకు శిక్ష విధించి జైలుకు పంపిస్తారు. ఆమె కేసును పరిశోధించడానికి నియమితుడైన ఫ్రెంచ్-నాజీ సహకారి జూల్స్‌ను కలుస్తుంది. జూల్స్ ఓల్గాపై అభిమానాన్ని పెంచుకుంటాడు. తన కోరిక తీరిస్తే ఆమెకు విధించిన శిక్ష తీవ్రతను తగ్గిస్తానని ఆశచూపుతాడు. ఓల్గా కఠినమైన హింసను నివారించడానికి ఏమైనా చేయాలని అనుకుంటుంది. అధికారి ప్రతిపాదనకు ఒప్పుకుంటుంది. అయితే అనుకోని సంఘటనలు ఊహించని మలుపు తీసుకుంటాయి. స్వేచ్ఛ కోసం ఆమె పడే ఆశ మసకబారుతుంది.
బెలా టార్ జూలై 21, 1955న హంగేరీలోని పెక్స్‌లో జన్మించాడు. ఆయన బుడాపెస్ట్‌లోని అకాడమీ ఆఫ్ థియేటర్ అండ్ ఫిల్మ్‌లో విద్యార్థి. 16 సంవత్సరాల వయస్సులో ఔత్సాహిక చిత్రనిర్మాతగా తన వృత్తిని ప్రారంభించాడు. అతను బలాజ్స్ బెలా స్టూడియో పనిచేశాడు. అక్కడ అతను ది ఫ్యామిలీ నెస్ట్ (1977) చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆయన ప్రముఖ రచనలు డామ్నేషన్ (1988), వెర్క్‌మీస్టర్ హార్మోనీస్ (2000), ది టురిన్ హార్స్ (2011), సటాంటాంగో (1994).
52వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శితం కానున్న మిస్టర్ టార్ చిత్రాలు వివరాలివి.
ఫ్యామిలీ నెస్ట్
1977 | హంగేరియన్ | హంగేరి
సారాంశం: ఇరెన్ బుడాపెస్ట్ సెంటర్లోని తన అత్తమామలపాటు చిన్న అపార్ట్‌మెంట్‌లో తన కుమార్తెతో నివసిస్తుంది. ఆమె భర్త లాసి తన జాతీయ సేవ నుండి అప్పుడే తిరిగి వస్తాడు. ఐరెన్‌తో ఆయన సంబంధాలు క్షీణిస్తుంటాయి. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటుంది కానీ ఆమె పునరావాస అభ్యర్థన గురించి కమ్యూనిస్ట్ ప్రభుత్వ అధికారుల నుంచి నిర్ణయం రాదు.
ఔట్ సైడర్
1981 | హంగేరియన్ | హంగేరి
సారాంశం: హంగరీలోని ఒక పారిశ్రామిక పట్టవాసి..యువనర్సు ఆండ్రాస్కు సంగీతం అంటే ఇష్టం. మద్య వ్యసనం కారణంగా ఉద్యోగం పోతుంది. ఇది ఆయన జీవితంలో మరో అపజయం. అతను నగరంలో తిరుగుతున్నప్పుడు, తన సంబంధాలు, సమాజం, శృంగారం గురించి సమాలోచనలు చేస్తాడు.
డామ్నేషన్
1988 | హంగేరియన్ | హంగేరి
సారాంశం: నిర్జనమైన ప్రకృతి దృశ్యంలో, కర్రెర్ ప్రపంచానికి దూరంగా సంవత్సరాల తరబడి జీవిస్తాడు. అంతులేని వర్షంతో అదృశ్యమవుతున్న చెత్తకుప్పలను చూస్తూ గడుపుతాడు. ఆయనకు పబ్ టైటానిక్ తో మాత్రం సంబంధాలు ఉంటాయి. ప్రతి రాత్రి అక్కడికి వెళ్తాడు. తన యజమాని విల్లార్స్కీతో మాట్లాడుతుంటాడు. ఈ బార్‌లో పాడే ఒక గాయని మహిళ పట్ల ఆకర్షితుడై, ఆమె పొందు కోసం ప్రయత్నిస్తాడు.
టురిన్ హార్స్
2011 | హంగేరియన్, జర్మన్ | హంగరీ, ఫ్రాన్స్
సారాంశం: క్యారేజ్ డ్రైవర్ తన గుర్రాన్ని కొరడాతో కొట్టడం చూసిన తత్త్వవేత్త ఫ్రెడరిక్ నీషే సంఘటనా స్థలానికి పరిగెత్తుతాడు. గుర్రం చుట్టూ చేతులు వేసి కుప్పకూలిపోతాడు. -అది ఎప్పటికీ కోలుకోదు. తరువాత క్యారేజ్ డ్రైవర్, ఆయన కుటుంబం, ఆయన స్టీడ్‌కి ఏమి జరిగింది అనేదే మిగతా కథ.
*****
(Release ID: 1772772)
Visitor Counter : 146