మంత్రిమండలి

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా..ఈ అయిదు రాష్ట్రాల లోని ఆకాంక్షభరిత జిల్లాల లో మొబైల్ సేవల పరిధి లో లేనటువంటిగ్రామాల లో మొబైల్ సేవ ల ఏర్పాటు కై యుఎస్ఒఎఫ్ పథకాని కి ఆమోదం తెలిపినమంత్రిమండలి

4జి ఆధారితమైన మొబైల్ సేవల ను అయిదురాష్ట్రాల లోని 44 ఆకాంక్షభరిత జిల్లాల కు చెందిన 7,287 అన్ కవర్ డ్ విలేజెస్ అందుకోనున్నాయి; దీనికిగాను దాదాపు గా 6,466 కోట్ల రూపాయలు వ్యయం కావచ్చని అంచనా 

Posted On: 17 NOV 2021 3:38PM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా.. ఈ అయిదు రాష్ట్రాల లోని ఆకాంక్షభరిత జిల్లాల లో మొబైల్ సేవల పరిధి లో లేనటువంటి గ్రామాల లో మొబైల్ సేవల ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

 

ఈ ప్రాజెక్టు లో భాగం గా ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా.. ఈ అయిదు రాష్ట్రాల లోని 44 ఆకాంక్షభరిత జిల్లాల లో మొబైల్ సేవల పరిధి లో లేనటువంటి 7,287 అన్ కవర్ డ్ విలేజెస్ కు 4జి ఆధారితమైన మొబైల్ సేవల ను సమకూర్చడం జరుగుతుంది. దీనికి గాను నిర్వహణ ఖర్చు లు కూడా కలుపుకొని సుమారు గా 6,466 కోట్ల రూపాయల మేరకు వ్యయం కావచ్చని అంచనా వేయడమైంది. ఈ ప్రాజెక్టు కు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేశన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ను ఒప్పంద పత్రం పై సంతకాలు అయిన తరువాత 18 నెలల లోపల అంటే నవంబర్ 23 కల్లా పూర్తి చేయడం జరుగుతుంది.

 

ఏ గ్రామాలలో అయితే ఈ తరహా సేవలు అందుబుటలో లేవో, అటువంటి గుర్తించిన గ్రామాల లో 4జి మొబైల్ సర్వీసుల ను సమకూర్చడానికి సంబంధించిన పని ని ఎటువంటి ఆంక్షలు ఉండని స్పర్ధాత్మక వేలం ప్రక్రియ ద్వారా అప్పగించడం జరుగుతుంది.ఈ ప్రక్రియ ను యుఎస్ఒఎఫ్ ప్రస్తుత విధానాల ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది.

 

ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా.. ఈ అయిదు రాష్ట్రాల లోని ఆకాంక్షభరిత జిల్లాల లో మొబైల్ సర్వీసుల పరిధి లో లేనటువంటి మారుమూల ప్రాంతాలు మరియు దుర్గమ క్షేత్రాల లో మొబైల్ సర్వీసుల లభ్యత కై ఉద్దేశించిన ప్రస్తుత ప్రతిపాదన డిజిటల్ కనెక్టివిటీ ని ప్రోత్సహించనుంది. ఫలితం గా ఆత్మనిర్భరత, నేర్చుకొనేందుకు సదుపాయాలు, స్వయం సమృద్ధి సాధన దిశ లో వృద్ధి, సమాచారాని కి, ప్రసారాని కి, జ్ఞాన వ్యాప్తి కి, నైపుణ్యాల ను పెంచుకోవడాని కి, విపత్తుల నిర్వహణ కు, ఇ-గవర్నెన్స్ సంబంధి కార్యక్రమాల కు, వాణిజ్య సంస్థల స్థాపన కు, ఇ-కామర్స్ సదుపాయాల స్థాపన కు, జ్ఞానార్జన సంబంధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ సంస్థల కు తగినంత సాయాన్ని అందించడాని కి, స్వదేశీ ఉత్పత్తి ని పెంచడానికి ‘ఆత్మనిర్భర్ భారత్’ వగైరా ఆశయాల కు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి సంబంధించి, ‘డిజిటల్ ఇండియా’ ఆవిష్కారం తాలూకు దార్శనికత ఆచరణాత్మకం కాగలుగుతుంది.

 

***

 (Release ID: 1772738) Visitor Counter : 72