ప్రధాన మంత్రి కార్యాలయం

నవంబర్ 18న ఔషధ నిర్మాణ సంబంధి రంగపు తొలి గ్లోబల్ ఇనొవేశన్ సమిట్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 16 NOV 2021 4:58PM by PIB Hyderabad

ఔషధ నిర్మాణ సంబంధి రంగం యొక్క ఒకటో గ్లోబల్ ఇనొవేశన్ సమిట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 18న సాయంత్రం 4 గంటల కువీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

భారతదేశం లో ఔషధ నిర్మాణ సంబంధి పరిశ్రమ లో నూతన ఆవిష్కరణల తాలూకు ఒక ఉత్కృష్టమైనటువంటి ఇకోసిస్టమ్ ను ప్రోత్సహించడం కోసం విభిన్న ప్రాధాన్యాలపై చర్చల ను జరపడం కోసం, అలాగే వ్యూహాత్మక ప్రాథమ్యాల ను రూపొందించడం కోసం ప్రభుత్వం లోని, పారిశ్రామిక జగత్తు లోని ప్రముఖ భారతీయ స్టేక్ హోల్డర్స్ తో పాటు విదేశాల కు చెందిన స్టేక్ హోల్డర్స్ ను, విద్య రంగ నిపుణుల ను, పెట్టుబడిదారుల ను, పరిశోధకుల ను ఒక చోటు కు తీసుకు రావడం ఈ విశిష్ట కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం గా ఉంది. భారతదేశ ఔషధ పరిశ్రమ లో గల భారీ వృద్ధిఅవకాశాల ను గురించి సైతం ఈ శిఖర స్మమేళనం కొనసాగే క్రమం లో ప్రముఖం గా ప్రస్తావించడం జరుగుతుంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖర సమ్మేళనం లో 12 సదస్సులు భాగం గా ఉంటాయి. 40 మంది కి పైగా జాతీయ వక్తల తో పాటు, అంతర్జాతీయ వక్తలు నియంత్రణ సంబంధి వాతావరణం, నూతన ఆవిష్కరణ ల కోసం ఆర్థిక సహాయాన్ని గాని లేదా నిధుల వ్యవస్థ ను గాని ఏర్పాటు చేయడం గురించి, పరిశ్రమ పరంగాను, విద్య రంగం పరంగాను సహకారాన్ని అందించడం గురించి, ఇంకా నూతన ఆవిష్కరణల కు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన సహాఅనేక విషయాల పైన చర్చోపచర్చల ను జరుపుతారు.

ఈ శిఖర సమ్మేళనం లో దేశ విదేశాల ఫార్మా లేదా మందుల పరిశ్రమలకు చెందిన ప్రముఖ సభ్యులు, అధికారులు, పెట్టుబడిదారులు, మెసాచుసెట్ స్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జాన్ హాప్ కిన్స్ ఇన్స్ టిట్యూట్, ఐఐఎమ్ అహమదాబాద్, ఇంకా ఇతర ప్రసిద్ధ సంస్థల కు చెందిన పరిశోధకులు పాలుపంచుకోనున్నారు.

ఈ సందర్భం లో కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ కూడా హాజరు అవుతారు.

 

 

 

***



(Release ID: 1772696) Visitor Counter : 127