ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీకాలకు అర్హమైన జనాభాలో పూర్తిగా టీకాలు వేయించుకున్నవారే పాక్షికంగా వేయించుకున్నవారికంటే అధికం: డాక్టర్ మన్ సుఖ్ మాండవ్యా
“ప్రభుత్వపు జన భాగీదారీ, హర్ ఘర్ దస్తక్ ప్రచారం పట్ల ప్రజల నమ్మకం, విశ్వాసమే ఈ సాధనను సుసాధ్యం చేసింది”
దేశంలో టీకా డోసుల కొరతలేదని స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి, రెండో దశకు ముందుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి
Posted On:
17 NOV 2021 1:42PM by PIB Hyderabad
“దేశంలో మొదటిసారిగా పాక్షికంగా టీకాలు వేసుకున్నవారి సంఖ్యాకంటే పూర్తిగా టీకాలు వేసుకున్నవారిసంఖ్య దాటిపోయింది. “గౌరవ ప్రధాని దార్శనికతకు చిహ్నాలైన జన్-భాగీదారీ, సంపూర్ణ ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల నమ్మకం, విశ్వాసాలే దీన్ని సాధించటానికి దోహదం చేశాయి. దీంతోబాటుగా ప్రస్తుతం సాగుతున్న హర్ ఘర్ దస్తక్ కూడా దేశం నలు మూలల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది” అని ఈరోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవ్యా అన్నారు.
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో ఒక చెప్పుకోదగిన మైలురాయిగా మొదటి సారిగా కోవిడ టీకాలు వేసుకున్నవారిలో ఒక విడత వారికంటే రెండూ డోసులూ తీసుకున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు నమోదయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 113.68 కోట్లకు పైగా (1,13,68,79,685) డోసులు టీకా డోసుల పంపిణీ జరిగినట్టు ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తూ ఉండగా గత 24 గంటలలో వేసిన టీకా డోసులు 67,82,042. ఇది 1,16,73,459 సెషన్ల లో పూర్తయింది. వీటిలో 75,57,24,081డోసులు మొదటి డోసుగా అందించగా 38,11,55,604 డోసులు రెండో డోసుగా ఇచ్చారు. దీంతో పూర్తిగా రెండూ డోసులూ తీసుకున్నవారి సంఖ్య (38,11,55,604) ఒక డోసుమాత్రమే తీసుకున్నవారి సంఖ్య (37,45,68,477) ను మించిపోయింది.
ఈ సాధనలో దేశం ఉమ్మడిగా ప్రదర్శించిన స్ఫూర్తిని కేంద్ర ఆరోగ్యమంత్రి అభినందించారు. అర్హులైన పౌరులందరూ టీకా వేయించుకోవాలని ఒక ట్వీట్ ద్వారా పిలుపునిస్తూ “అందరం కలసి కోవిడ్ మీద పోరులో గెలుద్దాం” అన్నారు.
నెలరోజుల పాటు సాగే “హర్ ఘర్ దస్తక్ ప్రచారోద్యమం ముగిసే సమయానికల్లా దేశంలో అర్హులైన వారందరికీ టీకాలు ఇవ్వటం పూర్తికాగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్-19 కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుణ్ణీ కాపాడాలన్న లక్ష్యంతో రాజకీయ అంకితభావం ఉన్న భారత ప్రభుత్వం 2021 జనవరి 16 న ప్రారంభమైన ఈ కార్యక్రమం అనేక విజయాలు సాధించటానికి కారణమైంది. దేశం 2021 అక్టోబర్ 21 న 100 కోట్ల టీకాల డోసుల మైలురాయి దాటింది. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ అంత్యోదయస్ఫూర్తితో నవంబర్ 3 న ఇచ్చిన హర్ ఘర్ దస్తక్ పిలుపుతో ప్రతి ఇంటి తలుపుతట్టి ప్రతి పౌరుడికీ టీకా ఇవ్వాలనే లక్ష్యం విధించుకున్నారు.
నెలరోజులపాటు సాగే ఈ టీకాల ప్రచారోద్యమం వలన వయోజనులందరికీ మొదటి డోస్ టీకా ఇవ్వటం పూర్తి కావాల్సి ఉంది. అదే విధంగా రెండో డోస్ కు సమయం వచ్చిన వారందరూ సకాలంలో టీకా వేయించుకోవాలి, ఇందుకోసం ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తారు. మరీ ముఖ్యంగా అర్హులైన జనాభాలో కనీసం 50% కూడా పూర్తికాని చోట్ల ప్రత్యేక దృష్టి సారిస్తారు.
దేశంలో కోవిడ్ టీకా డోసుల పంపిణీకి ఏ మాత్రం కొరత లేదని ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేసారు. ప్రజలు ముందుకొచ్చి సకాలంలో రెండో డోస్ కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
****
(Release ID: 1772667)
Visitor Counter : 169