రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ గా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ పేరు మార్పు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రక్షణ శాఖ మంత్రి


2016 ఉగ్రవాద నిరోధక దాడులు, 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' పథకం అమలులో సమయంలో దివంగత రక్షణ మంత్రి ఆలోచనాత్మక నాయకత్వ లక్షణాలను గుర్తు చేసుకున్న రక్షణ శాఖ మంత్రి

జాతి నిర్మాణం కోసం పరిశోధన, విధాన రంగాలలో నూతన ఆలోచనలతో పనిచేయాలని ఎంపీ-ఐడీఎస్ఎ కి సూచించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 15 NOV 2021 1:15PM by PIB Hyderabad

రక్షణమంత్రి ఉపన్యాసంలో ముఖ్య అంశాలు: 

* స్వదేశీకరణకు, రాజకీయ-సైనిక సమ్మేళన అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పారికర్ అమూల్యమైన సేవలు అందించారు. 

* రక్షణ, జాతీయ భద్రత,  అంతర్జాతీయ సంబంధాల రంగంలో  ఎంపీ-ఐడీఎస్ఎ అత్యుతమ ఆలోచనలకు వేదికగా ఉంది. 

* కోవిడ్-19లాంటి ముప్పు, మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం లాంటి అంశాలతో మరింత అప్రమత్తత అవసరం 

* దేశ రక్షణ,భద్రతా రంగాలలో సంస్థ పాత్ర కీలకం 

    ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ పేరును మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ గా మార్చినట్లు రక్షణ శాఖ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. సంస్థ పేరును మారుస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి 2001 నవంబర్ 15న ఆవిష్కరించారు. ఏకాభిప్రాయంతో ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ పేరును మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసెస్ గా మార్చినట్లు శ్రీ  రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సంస్థ చైర్మన్ గా రక్షణ శాఖ మంత్రి వ్యవహరిస్తున్నారు. రక్షణ రంగానికి దివంగత పారికర్ చేసిన సేవలకు గుర్తింపుగా సంస్థకు ఆయన పేరు పెట్టాలని సంస్థ జనరల్ బాడీ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సంస్థ 57వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నిర్ణయాన్ని అమలులోకి తేవడం జరిగింది. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా దివంగత మనోహర్ పారికర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రక్షణ మంత్రిగా మనోహర్ పారికర్ సంస్థ అభివృద్ధికి కృషి చేసారని అన్నారు. మనోహర్ పారికర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రక్షణ రంగం పట్ల పూర్తి అవగాహనతో ఆయన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.  స్వదేశీకరణకు, రాజకీయ-సైనిక సమ్మేళన అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పారికర్ అమూల్యమైన సేవలు అందించారని అన్నారు. " సాయుధ దళాలకు పారికర్  ఆలోచనాత్మక నాయకత్వాన్ని అందించారు.  ఉరీ ఘటన తర్వాత 2016లో జరిగిన ఉగ్రవాద నిరోధక దాడుల్లో ఆయన నాయకత్వ లక్షణాలు కనబరిచారుసాయుధ బలగాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్నిర్ణయం తీసుకున్నారు. ఆయన సేవలు  చిరకాలం గుర్తుండిపోతాయి' అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ-ఐడీఎస్ఎకి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ఆరు దశాబ్దాలలో రక్షణ, భద్రత, అంతర్జాతీయ సంబంధాలు సంస్థ అత్యుత్తమంగా నిలిచించిందని అన్నారు.  అనేక దేశాలకు విద్యావంతులు, ప్రతిభావంతులను ఒక వేదిక మీదకు తెచ్చిన  ఒక ప్రత్యేకమైన సంస్థగా ఎంపీ-ఐడీఎస్ఎ గుర్తింపు పొందిందని  ఆయన అన్నారు.' సంస్థ నిర్వహించిన మేధోమధన సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు 21వ శతాబ్ద సవాళ్ళను ఎదుర్కోవడానికి సహకరించే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించాయి. తన ప్రచురణల ద్వారా సంస్థ అనేక మందికి చేరువ అయ్యింది.  లక్ష్యాలను సాధించి మరింత అభివృద్ధి సాధించడానికి సంస్థ నిరంతరం కృషి చేస్తోంది' అని రక్షణ మంత్రి అన్నారు. 

వేగంగా మారుతున్న అంతర్జాతీయ భద్రతా రంగ అంశాలు, కోవిడ్-19 లాంటి కనిపించని శత్రువు రూపంలో ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా ఉండాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ రక్షణ, భద్రత అంశాలలో ఎంపీ-ఐడీఎస్ఎ నూతన ఆలోచనలతో ముందుకు వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మీరందరూ సాంప్రదాయ యుద్ధం కళల నుంచి మానవ అవసరం లేని  నాన్-కాంటాక్ట్ , హైబ్రిడ్ యుద్ధ కళలను అభ్యసిస్తున్నారు. వీటితో పాటు  సమగ్ర జాతీయ భద్రతతో పాటు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం,తో విభిన్న నైపుణ్యం కలిగిన నిపుణులను సిద్ధం చేయడానికి దేశం ఆర్థికంగా బలపడడానికి కృషి చేయాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.

దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండే భద్రతకు సంబంధించిన అంశాలపై మరింత లోతుగా ఆలోచించాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారుపటిష్టమైన  సామర్థ్యం గల దేశ నిర్మాణానికి దోహదపడే పరిశోధన, విధాన నిర్ణయాల రంగాలలో నూతన వినూత్న ఆలోచనలపై దృష్టి సారించాలని ఆయన సంస్థ పరిశోధకులకు సూచించారు. ప్రభుత్వ పరంగా దీనికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా గ్రిడ్ తో అనుసంధానించిన 100 కేడబ్ల్యు సోలార్ పవర్ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ భవనాల  భవనాలపై సోలార్ రూఫ్-టాప్ ప్లాంట్‌లను ప్రోత్సహించడానికి నూతన  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ రూపొందించిన  పథకం కింద దీనిని నెలకొల్పారు. సోలార్ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి 1,41,540 యూనిట్లను  ఆదా చేసిందిదీని ఫలితంగా సంవత్సరానికి14 లక్షల రూపాయలకు పైగా ఆదా అవుతుంది. ఇంధన భద్రత కోసం సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించిన మంత్రి  ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ నిబద్ధతకు సోలార్ ప్లాంట్ నిదర్శనమని అన్నారు.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సంస్థ లో ఓపెన్ ఎయిర్ జిమ్‌ను కూడా ప్రారంభించారు.  దీనిని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా పేర్కొన్న మంత్రి  మహమ్మారి సమయంలో ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని  చెప్పారు. “ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో  టీకాలు తీసుకున్న  వారి సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే,  ప్రజలు తమ  ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉంటే కోవిడ్ -19 ను కలిసి ఎదుర్కొని విజయం సాధించడానికి వీలవుతుంది.  ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం  పూర్తిగా కట్టుబడి ఉంది' అని  ఆయన చెప్పారు. ఎటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా  ఎంపీ-ఐడీఎస్ఎ   స్థానిక ఆర్మీ స్టేషన్‌ల మధ్య  సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ రూపొందిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.

దేశ రక్షణభద్రతవిదేశాంగ విధానం మరియు వ్యూహాత్మక ఆవశ్యకత కి సంబంధించిన సంస్థ నిపుణులు  రచించిన పుస్తకాలను కూడా మంత్రి ఆవిష్కరించారు. 

తన స్వాగత ఉపన్యాసంలో ఎంపీ-ఐడీఎస్ఎ డైరెక్టర్ జనరల్ సుజన్ ఆర్ చినోయ్ రక్షణభద్రత మరియు అంతర్జాతీయ సంబంధాలు రంగంలో సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. సంస్థ అభివృద్ధికి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దార్శనికత కలిగిన నాయకుడిగా దేశానికి పారికర్‌ చేసిన అపారమైన కృషికి గుర్తింపుగానివాళిగా  ఇన్‌స్టిట్యూట్‌ కు ఆయన పేరు పెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  సంస్థ   సీనియర్ అధికారులుపరిశోధకులు, సిబ్బంది  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 1772017) Visitor Counter : 186