ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

112.01 కోట్లు పైబడ్డ భారత టీకా డోసుల సంఖ్య గత 24 గంటలలో 57.43 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ

కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 98.26%

గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 11,271

దేశంలో చికిత్సలో ఉన్నవారు 1,35,918 మంది; 522 రోజుల అత్యల్పం
వారపు పాజిటివిటీ 1.01%, 51 రోజులుగా 2% లోపు

Posted On: 14 NOV 2021 9:34AM by PIB Hyderabad

గత 24 గంటలలో 57,43,840  మందికి టీకాలివ్వటంతో దేశంలో మొత్తం ఈ ఉదయం 7 గంటల దాకా  పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య   112.01 కోట్లు దాటి  1,12,01,03,225 కు చేరింది.  మొత్తం 1,14,65,001 శిబిరాల ద్వారా దీన్ని సాధించగలిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,80,417

రెండో డోస్

93,25,756

 

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,83,74,014

రెండో డోస్

1,61,64,449

 

18-44 వయోవర్గం

మొదటి డోస్

43,18,70,709

రెండో డోస్

16,89,98,058

 

45-59 వయోవర్గం

మొదటి డోస్

17,81,06,875

రెండో డోస్

10,44,39,125

 

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

11,16,13,882

రెండో డోస్

7,08,29,940

మొత్తం

1,12,01,03,225

 

గత 24 గంటలలో 11,376 మంది బాధితులు కోలుకోగా మొత్తం ఇప్పటిదాకా కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 3,38,37,859 కి చేరింది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 98.26% అయింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న చర్యల ఫలితంగా గత 140 రోజులుగా రోజువారీ కొత్త కేసులు 50 వేలలోపే ఉంటున్నాయి. గత 24 గంటలలో 11,271 కొత్త కేసులు వచ్చాయి.

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్  బాధితుల సంఖ్య 1,35,918 కాగా ఇది గత 522 రోజుల అత్యల్పం. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు మొత్తం పాజిటివ్ కేసులలో 0.39% మాత్రమే. ఇది 2020 మార్చి తరువాత అత్యల్పం.

పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటలలో 12,55,904 పరీక్షలు జరపగా, దేశ వ్యాప్తంగా అయిప్పటిదాకా జరిపిన పరీక్షలు 62.37 కోట్లకు పైగా  (62,37,51,344) కు చేరాయి. ఆ విధంగా అపరీక్షల సామర్థ్యం పెరగటంతో వారపు పాజిటివిటీ 1.01% కు చేరి గత 51 రోజులుగా 2% లోపే నమోదవుతూ వస్తోంది.  రోజువారీ పాజిటివిటీ 0.90% కాగా ఇది 41 రోజులుగా 2% లోపే. 76 రోజులుగా 3% లోపే ఉంటోంది.

 

 

****


(Release ID: 1771750) Visitor Counter : 160