సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎంపి కప్ పోలో ఛాంపియన్‌షిప్ - సర్ ప్రతాప్ సింగ్ కప్ 2021ని నిర్వహిస్తున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
14 గోల్ ఫైనల్ మ్యాచ్‌ను నవంబర్ 14, 2021న ప్రారంభించనున్న సాంస్కృతిక, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి
Posted On:
13 NOV 2021 4:50PM by PIB Hyderabad
ఆజాదీ కా మహోత్సవ్ ద్వారా 75 సంవత్సరాల స్వాతంత్ర్యం, భారతదేశ సాంస్కృతిక చరిత్ర వైభవాన్ని సంస్మరించుకోవడంలో భాగంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం.పి. కప్ పోలో చాంపియన్‌షిప్ - సర్ ప్రతాప్ సింగ్ కప్ 2021 నిర్వహించనుంది. సాంస్కృతిక వ్యవహారాల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మీనాక్షీ లేఖీ నవంబర్ 14, 2021న ఫైనల్ 14 గోల్ (GOAL ) మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మక జైపూర్ పోలో గ్రౌండ్స్‌లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ పోలో అసోసియేషన్ ఆద్వర్యంలో, టైమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తోడ్పాటుతో నిర్వహిస్తున్నారు. సర్ ప్రతాప్ సింగ్ కప్ భారతదేశపు అత్యంత చారిత్రాత్మక, ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లలో ఒకటి. దీనిని 1921లో ప్రారంభించారు.
సర్ ప్రతాప్ సింగ్ కప్ 2021 అంతిమ మ్యాచ్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నారావనే, ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరితో పాటుగా సైనిక, నావికాదళ, వైమానికదళానికి చెందిన పలువురు విశిష్ట అధికారులు వీక్షించనున్నారు.
భారతదేశానికి రాయబారులను కూడా ఈ కార్యక్రమంలో హాజరుకావలసిందిగా ఆహ్వానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకునేందుకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహరాల శాఖ కలిసి పని చేయడానికి ఈ కార్యక్రమం సాక్షిగా ఉంటుంది.
ఈ కార్యక్రమానికి రాజధాని నుంచి అనేకమంది పోలో ఔత్సాహికులు, ప్రముఖ అతిథులు హాజరుకానున్నారు. ఈ క్రీడ చరిత్ర భారతదేశంలో 1892లో ఇండియన్ పోలో అసోసియేషన్ (ఐపిఎ)ను ఏర్పాటు చేసిన కాలానికి వెడుతుంది.
జోధ్‌పూర్ మహారాజు సర్ ప్రతాప్ సింగ్ ఈ కప్పును 1921లో హిజ్ రాయల్ హైనెస్ డ్యూక్ ఆఫ్ కన్నాట్ భారతదేశ పర్యటన జ్ఞాపకార్ధం అందించారు. ఇది 14 గోల్ ట్రోఫీ. దీనిని 1921లో ఢిల్లీలో ఆడారు, అందులో పాటియాలా టీమ్ విజయం సాధించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా కోసం ఇచ్చిన స్పష్టమైన పిలుపుకు అనుగుణంగా ఉండటమే కాక, శ్రేష్టత కోసం క్రీడలు (స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్)ను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తూ, ఫిట్‌నెస్‌ను మన జీవితాలలో అంతర్భాగంగా మార్చడంపై దృష్టి పెట్టడానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.
పోలో సహా అనేక క్రీడా సంప్రదాయాలతో భారత్‌కు సుసంపన్నమైన చారిత్రిక సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఈ క్రడను పరిరక్షిస్తూ, సాధన చేసే అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. పోలోను భారతదేశపు వారసత్వ క్రీడగా కూడా పేర్కొంటారు. ఆజాదీ కాఅమృత్ మహోత్సవ్ భారతదేశ వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడమే కాదు మన క్రీడల సాంస్కృతిక వారతసత్వాన్ని సంపుటీకరిస్తుంది.
***
(Release ID: 1771538)
Visitor Counter : 105