సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
'రేపటి సృజనాత్మక ప్రతిభావంతులు' 75 మందిని ఎంపిక చేసే గ్రాండ్ జ్యూరీ మరియు సెలక్షన్ జ్యూరీ పేర్ల ప్రకటన
మనోజ్ బాజ్‌పేయి, రెసూల్ పుకుట్టి, శంకర్ మహదేవన్ వంటి సినీ రంగం దిగ్గజాలు గ్రాండ్ జ్యూరీలో సభ్యులు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో దేశంలోని యువ సృజనాత్మక వ్యక్తుల వర్ధమాన ప్రతిభను ప్రోత్సహించే, గుర్తించే ప్రయత్నంతో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యువ చిత్ర నిర్మాతల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది, వీరిలో 75 మంది సృజనాత్మక ప్రతిభావంతులను 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరయ్యేందుకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన '75 సృజనాత్మక ప్రతిభావంతులు'ని 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, గోవా 2021కి హాజరు కావడానికి, అన్ని మాస్టర్‌క్లాస్‌లు/ఇన్-కన్వర్సేషన్ సెషన్‌లలో పాల్గొడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే ఇండస్ట్రీ లీడర్‌లతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వీలుంటుంది. ఈ ఉత్సవాలకు ఎంపికైన ప్రతి అభ్యర్థికి ప్రయాణ, వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తారు.
కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ గ్రాండ్ జ్యూరీ, సెలక్షన్ జ్యూరీ వివరాలను ప్రకటించింది.
గ్రాండ్ జ్యూరీ
- ప్రసూన్ జోషి, ప్రముఖ గీత రచయిత, సీబిఎఫ్సి చైర్మన్
- కేతన్ మెహతా - ప్రముఖ దర్శకుడు
- శంకర్ మహదేవన్ - ప్రముఖ సంగీత కారుడు, గాయకుడు
- మనోజ్ బాజ్పాయి - ప్రముఖ నటుడు
- రసూల్ పూకట్టి - సౌండ్ రికార్డింగ్ లో ఆస్కార్ విజేత
- విపుల్ అమృత్ లాల్ షా - ప్రముఖ నిర్మాత/దర్శకుడు
సెలక్షన్ జ్యూరీ
- వాణి త్రిపాఠి టికూ - నిర్మాత, నటుడు, సీబీఎఫ్సి సభ్యుడు
- అనంత్ విజయ్ - సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత
- యతీంద్ర - ప్రముఖ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత
- సంజయ్ పూరన్ సింగ్ - చిత్ర నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత
- సచిన్ ఖేడేకర్ - నటుడు, దర్శకుడు
కొత్తగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అక్టోబర్ 22న ప్రకటించారు. ఐఎఫ్ఎఫ్ఐ 52వ ఎడిషన్ భారతదేశంలోని యువ వర్ధమాన ప్రతిభావంతులకు ప్రధాన స్రవంతి సినిమా నిర్మాతలు మరియు పరిశ్రమతో కనెక్ట్ అవ్వడానికి ఒక వేదికను కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ఈ యువకులు దేశవ్యాప్తంగా ఉన్న యువ చిత్రనిర్మాతలుగా ఎంపిక కావడం కోసం జరుగుతున్న పోటీ ఇది. 75 మంది యువ చిత్రనిర్మాతలు, నటీనటులు, గాయకులు, స్క్రిప్ట్ రైటర్లు మరియు ఇతరులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈవెంట్‌లో తమ ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను అందించడం ఈ పోటీ లక్ష్యం.
***
(Release ID: 1771372)
Visitor Counter : 170