సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గోవాలోని 52వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో అంతర్జాతీయ పోటీకి 15 సినిమాలు బరిలోఉన్నాయి
అంతర్జాతీయ పోటీలో భారతీయ ఎంట్రీలు-గోదావరి, మీ వసంతరావు మరియు సెమ్‌ఖోర్
Posted On:
11 NOV 2021 3:32PM by PIB Hyderabad
52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవం సందర్భంగా పోటీ కోసం అంతర్జాతీయ సినిమాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫీచర్ లెంగ్త్ ఫిక్షన్ ఫిల్మ్‌లలో అత్యుత్తమమైనవి విభాగంలో పోటీకి ఎంపిక చేయబడ్డాయి. ఇది సంవత్సరంలోని కొన్ని ఉత్తమ చిత్రాలను ప్రదర్శించే ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు ఈ 15 చిత్రాలు గోల్డెన్ పీకాక్ మరియు ఇతర అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి.
లైనప్‌లో భాగమైన సినిమాలు:
1. ఎనీ డే నౌ | దర్శకత్వం : హమీ రమేజాన్ | ఫిన్లాండ్
2. షార్లెట్ | దర్శకత్వం : సైమన్ ఫ్రాంకో | పరాగ్వే
3. గోదావరి | దర్శకత్వం: నిఖిల్ మహాజన్ | మరాఠీ, భారతదేశం
4. ఇంటర్‌గాల్డ్ | దర్శకత్వం : రాడు ముంటీన్ |రొమేనియా
5. లాండ్ ఆఫ్ డ్రీమ్స్ | దర్శకత్వం : షిరిన్ నేషత్ & షోజా అజారి | న్యూ మెక్సికో, యూఎస్‌ఏ
6. లీడర్ | దర్శకత్వం :కాటియా ప్రివీజెన్‌క్యూ| పోలాండ్
7. మీ వసంతరావు | దర్శకత్వం: నిపున్ అవినాష్ ధర్మాధికారి | మరాఠీ, భారతదేశం
8. మాస్కో డజ్‌నాట్ హ్యాపెండ్ | దర్శకత్వం : డిమిత్రి ఫెడోరోవ్ | రష్యా
9. నో గ్రౌండ్ బినీత్ ద ఫీట్| దర్శకత్వం : మొహమ్మద్ రబీ మృధా | బంగ్లాదేశ్
10. వన్స్ వి వర్ గుడ్ ఫర్ యు| దర్శకత్వం : బ్రాంకో ష్మిత్ | క్రొయేషియా, బోస్నియా మరియు హెర్జెగోవినా
11. రింగ్ వాండరింగ్ | దర్శకత్వం : మసకాజు కనేకో | జపాన్
12. సేవింగ్ వన్ హూ వజ్ డెడ్| దర్శకత్వం : వాక్లావ్ కడ్ర్ంకా | చెక్ రిపబ్లిక్
13. సేమ్ఖోర్ | దర్శకత్వం: ఐమీ బారుహ్ | డిమాసా, భారతదేశం
14. ద డోర్మ్ | దర్శకత్వం : రోమన్ వాస్యనోవ్ | రష్యా
15. ది ఫస్ట్ ఫాలెన్ | దర్శకత్వం : రోడ్రిగో డి ఒలివేరా |బ్రెజిల్
ఈ చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డుల కోసం పోటీపడతాయి, అవి:
1. ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్) - ఈ అవార్డు రూ.40,00,000/- నగదు బహుమతిని కలిగి ఉంటుంది. దర్శకుడు మరియు నిర్మాత మధ్య సమానంగా పంచుకోవాలి. క్యాష్ కాంపోనెంట్‌తో పాటు డైరెక్టర్ గోల్డెన్ పీకాక్ మరియు సర్టిఫికేట్ అందుకుంటారు. క్యాష్ కాంపోనెంట్‌తో పాటు ప్రొడ్యూసర్ సర్టిఫికేట్ అందుకుంటారు.
2. ఉత్తమ దర్శకుడు: వెండి నెమలి, సర్టిఫికెట్ మరియు నగదు బహుమతి రూ.15,00,000/-
3. ఉత్తమ నటుడు (పురుషుడు): వెండి నెమలి, సర్టిఫికేట్ మరియు నగదు బహుమతి రూ.10,00,000/-
4. ఉత్తమ నటి (మహిళ): వెండి నెమలి, సర్టిఫికెట్ మరియు నగదు బహుమతి రూ.10,00,000/-
5. ప్రత్యేక జ్యూరీ అవార్డు: రజత నెమలి, సర్టిఫికేట్ మరియు రూ. 15,00,000/- నగదు బహుమతి ఒక చిత్రానికి (జ్యూరీ అవార్డు/గుర్తింపు ఇవ్వాలనుకునే సినిమాలోని ఏదైనా అంశానికి) లేదా ఒక వ్యక్తికి (అతని/ఆమె కళాత్మక సహకారం అందించినందుకు) ఒక చలనచచిత్రం). ఒక సినిమాకి అవార్డు ఇస్తే ఆ సినిమా దర్శకుడికి ఇవ్వబడుతుంది.
****
(Release ID: 1771073)
Visitor Counter : 193