రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత్, అమెరికా 11వ రక్షణ సాంకేతిక, వర్తకానికి చొరవ చూపే గ్రూప్ సమావేశం వర్చ్యువల్ గా నిర్వహణ

Posted On: 10 NOV 2021 11:03AM by PIB Hyderabad

ప్రధాన అంశాలు:

  • రక్షణ సాంకేతిక సహకారంపై చర్చలను బలోపేతం చేయడానికి ఉద్దేశించి సవరించిన ప్రకటనపై సహ-అధ్యక్షులు అంగీకారం 
  • జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎయిర్ సిస్టమ్స్ కింద ఆవిష్కృతమైన మానవరహిత వైమానిక వాహనం కోసం మొదటి ప్రాజెక్ట్ ఒప్పందం గత సమావేశంలో సంతకం అయింది 
  • డిఫెన్స్ ఇండస్ట్రీ సహకార ఫోరమ్ వర్చువల్ ఎక్స్‌పో సముచిత సాంకేతికతల అభివృద్ధిని మరింత ప్రోత్సహించడానికి నిర్వహించారు 
  • రక్షణ పరికరాల సహ-ఉత్పత్తి, అభివృద్ధికి అవకాశాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న డిటిటిఐ గ్రూప్

భారత్, అమెరికా మధ్య 11వ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డిటిటిఐ) గ్రూప్ సమావేశం వర్చ్యువల్ గా ఈ నెల 9న జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సెక్రటరీ (రక్షణ ఉత్పత్తి) శ్రీ రాజ్ కుమార్, యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండర్ సెక్రటరీ ఆఫ్ అక్విజిషన్ అండ్ సస్టైన్‌మెంట్ గ్రెగొరీ కౌస్నర్ అధ్యక్షత వహించారు.  

డిటిటిఐ గ్రూప్ సమావేశాలు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి, భారతదేశం, అమెరికా ఒక్కక్కరు ఒక్కో సారి నిర్వహిస్తారు. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సమావేశం వీడియో టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా వరుసగా రెండవసారి జరిగింది.

డిటిటిఐ గ్రూప్ లక్ష్యం ద్వైపాక్షిక రక్షణ వాణిజ్య సంబంధాల అంశాలను నిరంతర నాయకత్వ దృష్టిని తీసుకురావడం, అలాగే రక్షణ పరికరాల సహ-ఉత్పత్తి మరియు సహ-అభివృద్ధి కోసం అవకాశాలను సృష్టించడం. భూమి, నావికా, వాయు మరియు విమాన వాహక సాంకేతికతలపై దృష్టి సారించిన నాలుగు జాయింట్ వర్కింగ్ గ్రూపులు తమ డొమైన్‌లలో పరస్పరం అంగీకరించిన ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి  డిటిటిఐ కింద స్థాపించారు. 

డిటిటిఐ విజయానికి ఉన్న నిబద్ధతకు సాక్ష్యంగా, సహ-అధ్యక్షులు సవరించిన స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్ఓఐ)కి అంగీకరించారు, ఇది అనేక విషయాలపై "వివరమైన ప్రణాళికను అనుసరించడం మరియు పురోగతిని సాధించడం ద్వారా రక్షణ సాంకేతిక సహకారంపై మా సంభాషణను బలోపేతం చేయడం" అనే ఉద్దేశాన్ని ప్రకటించింది. సెప్టెంబరు 2020లో జరిగిన చివరి  డిటిటిఐ గ్రూప్ సమావేశం నుండి, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎయిర్ సిస్టమ్స్ క్రింద ఆవిష్కృతమైన మానవరహిత వైమానిక వాహనం కోసం మొదటి ప్రాజెక్ట్ అగ్రిమెంట్ సంతకం అయింది. ఇది  డిటిటిఐ కి ఒక పెద్ద సాఫల్యమని ఆనందాన్ని వ్యక్తం చేసారు. 

 

*****


(Release ID: 1770842) Visitor Counter : 418