నీతి ఆయోగ్
సీఓపీ-26 వద్ద ఈవీలపై ఈ-అమృత్ పోర్టల్‌ను ప్రారంభించిన భారత్
- అన్ని ఈవీ-సంబంధితాలకు సంబంధించిన సమాచారం అంతా ఒకేచోట
Posted On:
10 NOV 2021 6:31PM by PIB Hyderabad
గ్రేట్ బిటన్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ-26 సమావేశంలో భారతదేశం ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీలకు) సంబంధించి
ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ‘ఈ-అమృత్‘ పేరుతో దీనిని భారత్ ఆవిష్కరించింది. ఈ-అమృత్ విద్యుత్ వాహనాలకు సంబంధించిన సమస్త సమాచారానికి సంబంధించి ఒకే గమ్యస్థానం. ఈవీ విధానాల స్వీకరణ, ఈవీల కొనుగోలు, పెట్టుబడి అవకాశాలు, విధానాలు, రాయితీలు మొదలైన వాటికి సంబంధించిన అపోహలను ఛేదిస్తుంది. గ్రేట్ బ్రిటన్ ప్రభుత్వంతో సహకార విజ్ఞాన మార్పిడి కార్యక్రమం కింద నీతీ ఆయోగ్ ద్వారా ఈ పోర్టల్ అభివృద్ధి చేయబడింది. ఇదే ఉద్దేశంలో ఈ పోర్టన్ హోస్ట్ చేయబడింది. బ్రిటన్-ఇండియా జాయింట్ రోడ్‌మ్యాప్ 2030లో భాగంగా రెండు దేశాల ప్రధానమంత్రులు సంతకం చేశారు.
ఈవీలపై అవగాహన పెంపొందించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల కలిగే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడంపై ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ- అమృత్ పోర్టల్ ఉద్దేశ్యం. ఇటీవలి కాలంలో, దేశంలో రవాణా మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడాన్ని వేగవంతం చేయడానికి భారతదేశం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈవీలను ముందస్తుగా స్వీకరించడానికి పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో ఎఫ్ఏఎంఈ మరియు పీఎల్ఐ వంటి పథకాలు చాలా ముఖ్యమైనవి.
నీతీ ఆయోగ్ పోర్టల్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మరియు వినియోగదారు-స్నేహపూర్వకంగా చేయడానికి మరిన్ని ఫీచర్‌లను జోడించాలని, వినూత్న సాధనాలను పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి గ్రేట్ బ్రిటన్ హై-లెవల్ క్లైమేట్ యాక్షన్ ఛాంపియన్ నిగెల్ టాపింగ్ మరియు నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు జ్యోతి సిన్హా హాజరయ్యారు.
***
(Release ID: 1770837)
Visitor Counter : 279