వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కేఎంఎస్ 2021-22లో వరి సేకరణ ద్వారా దాదాపు 11.57 లక్షల మంది రైతులు లబ్ది
- రైతులకు కనీస మద్దతు ధర రూపంలో రూ.41,066.80 కోట్ల సొమ్ము చేరిక
- 14 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో సజావుగా సాగుతున్నవరి సేకరణ
Posted On:
09 NOV 2021 2:02PM by PIB Hyderabad
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) - 2021-22లో 08.11.2021వ తేదీ వరకు 209.52 ఎల్ఎంటీల వరిని సేకరించింది. వరి పండించే రాష్ట్రాలైన ఛండీగఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు/యుటీలలో ఈ వరి సేకరణ జరిగింది. దీని ఫలితంగా దాదాపు 11.57 లక్షల మంది రైతులు కనీస మద్దతు ధర విలువతో రూ. 41,066.80 కోట్ల మేర లబ్ధిపొందారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2021-22లో రైతుల నుండి MSP వద్ద వరి సేకరణ సజావుగా సాగుతోంది, ఇది మునుపటి సంవత్సరాలలో జరిగింది.
***
(Release ID: 1770335)
Visitor Counter : 178