ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 09 NOV 2021 9:09AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 109.08 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 10,126 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.25% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 11,982 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,37,75,086 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.41% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,40,638. ఇది 263 రోజుల కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.93%) గత 36 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (1.25%) గత 46 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 61.72 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1770258) Visitor Counter : 160