ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వివిధజాతీయ రహదారి మరియు రహదారి పథకాల కుశంకుస్థాపనచేసిన ప్రధాన మంత్రి;మరికొన్ని పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు


శ్రీసంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్, శ్రీ సంత్తుకారామ్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ ల కీలక సెక్శన్ ల ను నాలుగు దోవ లు కలిగి ఉండేవిగా నిర్మించే పనుల కు  శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

పంఢర్పుర్ కు రాకపోకల ను పెంచడం కోసం ఉద్దేశించిన అనేక రహదారి పథకాల ను కూడా ప్రధానమంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు

‘‘ఈ యాత్ర ప్రపంచం లో కెల్లా అతిప్రాచీనమైనటువంటి ప్రజా యాత్రల లో ఒకటి గా ఉంది;  దీనిని పెద్ద సంఖ్య లోప్రజలు యాత్ర గా తరలి వెళ్లే కార్యక్రమం గా పరిగణించడం జరుగుతున్నది; ఇది భారతదేశంయొక్క శాశ్వత జ్ఞానాని కి ఒక ప్రతీక గా ఉంది;  ఆ శాశ్వత జ్ఞానం మన ధర్మాన్నిబందీ ని చేయదు గాని అంతకన్నా విముక్తం చేస్తుంది’’

‘‘భగవాన్విఠలుని దర్బారు లోకి ప్రతి ఒక్కరు ఎలాంటి వివక్ష లేకుండా ప్రవేశించవచ్చును.  సబ్ కా సాథ్-సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ లోసైతం ఇదే భావన ఉంది’’

‘‘వేరు వేరు ప్రాంతాల లో ఎప్పటికప్పుడుమహానుభావులు జన్మిస్తూ, దేశాని కి దిశ ను చూపుతున్నారు’’

‘‘ ‘పంఢరీ కి వారీ’ సమానఅవకాశాల కు ఒక సంకేతం గా ఉంది.  వార్ కరీ ఉద్యమం అనేది విచక్షణ నుచూపడాన్ని అమంగళకరం గా ఎంచుతుంది;

Posted On: 08 NOV 2021 4:43PM by PIB Hyderabad

వివిధ జాతీయ రహదారులు మరియు రహదారి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటు ఇంకా కొన్ని పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి తో పాటు మహారాష్ట్ర గవర్నరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లు కూడా పాల్గొన్నారు.

 సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రోజు న ఇక్కడ ‘‘ శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ కు, శ్రీ సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ కు శంకుస్థాపన చేయడమైందన్నారు. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ నిర్మాణాన్ని అయిదు దశల లో, సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీమార్గ్ నిర్మాణాన్ని మూడు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. పథకాలు ఆయా ప్రాంతాల లో మెరుగైన రాకపోకల కు తోడ్పడుతాయని ఆయన చెప్తూ, పథకాల కై భగవాన్ విఠల్ తో పాటు సాధువుల, భక్తుల ఆశీర్వాదాలు కావాలి అని కోరుకొంటూ వారికి నమస్కరించారు. చరిత్ర ఒడుదొడుకుల కు లోనైనప్పటికీ కూడాను భగవాన్ విఠలుని పట్ల విశ్వాసం అచంచలం గా ఉంటూ వచ్చింది, మరి ‘‘ రోజు కు కూడాను ఈ యాత్ర ప్రపంచం లో అతి ప్రాచీనమైనటువంటి ప్రజా యాత్రల లో ఒకటి గా ఉంది, అంతేకాక దీని ని పెద్ద సంఖ్య లో ప్రజలంతా కలిసికట్టు గా తరలివెళ్లేటటువంటి ఒక ప్రజా ఉద్యమం గా పరిగణిస్తున్నారు. దారులు వేరు వేరు కావచ్చు, పద్ధతులు, అభిప్రాయాలు విభిన్నం గా ఉంటే ఉండవచ్చు కానీ మనం లక్ష్యం ఒకటే అని యాత్ర మనకు బోధిస్తోంది. ఆఖరు కు అన్ని పంథ్ లు భాగవత్ పంథ్ లే అవుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు, ఇది భారతదేశం యొక్క శాశ్వత జ్ఞానాని కి ప్రతీకగా ఉంది, శాశ్వత జ్ఞానం మన ధర్మాన్ని బంధించదు, అది విముక్తం చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భగవాన్ విఠలుని దర్బారు ప్రతి ఒక్కరి కోసం సమానమైన విధం గా తెరచి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మరి నేను ఎప్పుడైతే సబ్ కా సాథ్- సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ అని అంటానో, అలా అన్నప్పుడు దాని వెనుక ఉండే భావన కూడా ఇదే అని ఆయన చెప్పారు. ఇదే భావన దేశాన్ని అభివృద్ధి పరచడానికి మనల ను ప్రేరితుల ను చేస్తుంది, అందరి ని కలుపుకొని పోతూ అందరి అభివృద్ధి లక్ష్య సాధన కై స్ఫూర్తి ని అందిస్తుంది అని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సమృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పంఢర్ పుర్ కు సేవ చేయడం అంటే అది ఆ శ్రీ నారాయణ హరి కి చేసే సేవే అవుతుందన్నారు. ఈ నేల భగవానుడు భక్తజనం కోసం ఈ నాటికి కూడాను ప్రత్యక్షం గా కొలువుదీరి ఉన్నటువంటి నేల అని ఆయన అన్నారు. ఈ జగత్తు ఆవిర్భవించక ముందు నుంచి పంఢర్ పుర్ ఉనికి లో ఉంది అని సంత్ నామ్ దేవ్ జీ మహారాజ్ పేర్కొన్న ప్రదేశం ఇది అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం యొక్క విశిష్టత ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, దేశాని కి దిశ ను చూపడం కోసం ఎప్పటికప్పుడు వేరు వేరు ప్రాంతాల లో మహనీయులు ఆవిర్భవిస్తూ వచ్చారన్నారు. దక్షిణ దేశం లో శ్రీయుతులు మధ్వాచార్య, నిమ్బార్కాచార్య, వల్లభాచార్య, రామానుజాచార్య ల వంటి వారు, పశ్చిమాన శ్రీయుతులు నర్ సీ మెహతా, ధీరో భగత్, భోజా భగత్, ప్రీతమ్ లు, ఇంకా మీరా బాయి ల వంటి వారు జన్మించారు అని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశం లో శ్రీయుతులు రామానంద, కబీర్ దాస్, గోస్వామి తులసీదాస్, సూర్ దాస్, గురు నానక్ దేవ్, సంత్ రై దాస్ లు వచ్చారన్నారు. దేశ తూర్పు ప్రాంతం లో చైతన్య మహాప్రభు, ఇంకా శంకర్ దేవ్ ల వంటి సాధువుల దార్శనికత దేశాన్ని సంపన్నం చేసిందన్నారు.

వార్ కరీ ఉద్యమాని కి ఉన్న సామాజిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, పురుషుల తో పాటు మహిళ లు అడుగులో అడుగు వేస్తూ సమధికోత్సాహం తో పాలుపంచుకోవడం అనేది వార్ కరీ ఉద్యమం తాలూకు మరొక ప్రత్యేకత అన్నారు. ఇది దేశం లో స్త్రీశక్తి కి అద్దం పడుతోందన్నారు. పంఢరీ కీ వారీఅనేది సమాన అవకాశాల కు ఒక చిహ్నం గా ఉంది అని ఆయన అన్నారు. వార్ కరీ ఉద్యమం భేద భావన ను అమంగళకరమైందిగా చూస్తుంది, మరి ఇదే ఈ ఉద్యమం తాలూకు విశిష్ట ధర్మ సూత్రం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

వార్ కరీ లో పాలుపంచుకొనే సోదరీమణులు మరియు సోదరుల విషయం లో ప్రధాన మంత్రి వారి ఆశీర్వాదాల రూపం లో మూడు విషయాల ను గురించి అపేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కి తన పట్ల ఉన్న అపార స్నేహం ఉండింది అని ఆయన అన్నారు. పాల్ ఖీ మార్గ్ లో మొక్కల ను నాటవలసింది గా భక్తుల ను ఆయన కోరారు. ఈ నడక దారి పొడవు ని తాగునీటి కి తగిన ఏర్పాటుల ను చేయాలని, ఈ మార్గాల లో చాలా చోట్ల తాగునీటి కడవల ను అందుబాటు లో ఉంచాలని ఆయన అభ్యర్థించారు. రాబోయే కాలం లో భారతదేశం లో అత్యంత స్వచ్ఛమైనటువంటి తీర్థయాత్ర స్థలాల లో ఒక తీర్థయాత్రస్థలం గా పంఢర్ పుర్ ను చూడాలని ఉందని ఆయన అభిలషించారు. ప్రజల భాగస్వామ్యం తో ఈ కార్యాన్ని సాధించవచ్చు, ఎప్పుడైతే స్థానికులు స్వచ్ఛత ఉద్యమం తాలూకు పగ్గాల ను వారి చేతుల లోకి తీసుకొంటారో అప్పుడు మనం ఈ కల ను పండించుకోగలుగుతాం అని ఆయన అన్నారు.

వార్ కరీల లో చాలా మంది రైతు సముదాయాని కి చెందిన వారే అయి ఉంటారు. ఈ భూమి పుత్రులుభారతదేశం సాంప్రదాయాన్ని, సంస్కృతి ని చైతన్యవంతం గా ఉంచారని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక నిజమైన అన్నదాతసంఘాన్ని జోడిస్తాడు. మరి అతడు సమాజాని కి ప్రాణం పోస్తాడు.. సమాజం కోసం జీవిస్తాడు. మీతోనే సమాజం ప్రగతి చెందుతుంది, మరి మీరే సమాజం ప్రగతి కి ప్రతిబింబం కూడా’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ లోని దివే ఘాట్ మొదలుకొని మొహోల్ వరకు ఉన్నటువంటి సుమారు 221 కిలో మీటర్ల భాగాన్ని, సంత్ తుకారాం మహారాజ్ పాల్ ఖీ మార్గ్ లోని ఫతస్ మొదలుకొని టోందలే-బోందలే వరకు ఉన్నటువంటి దాదాపు 130 కిలో మీటర్ల పొడవైన భాగాన్ని నాలుగు దోవ లు కలిగి ఉండే విధం గా నిర్మించడం జరుగుతుంది. ఈ రెండు మార్గాల కు ఇరు పక్కల ‘పాల్ ఖీ’ కోసమే ప్రత్యేకించినటువంటి నడక దారులు ఉంటాయి. వాటి అంచనా వ్యయం వరస గా 6,690 కోట్ల రూపాయలకు పైచిలుకు గాను మరియు దాదాపు గా 4,400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

పంఢర్ పుర్ నుంచి రాక పోకల ను పెంచడం కోసం వివిధ జాతీయ రహదారుల లో 223 కి.మీ. కి పైగా నిర్మాణం పూర్తి అయినటువంటి మరియు ఉన్నతీకరించినటువంటి గల రహదారి పథకాల ను ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ పథకాల అంచనా వ్యయం 1,180 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ప్రాజెక్టుల లో మ్హస్వాద్-పీలివ్-పంఢర్ పుర్ (ఎన్‌ హెచ్‌-548ఇ), కుర్దువాడీ-పంఢర్ పుర్ (ఎన్‌ హెచ్‌-965సి); పంఢర్ పుర్- సంగోలా (ఎన్‌ హెచ్‌-965సి); ఎన్ హెచ్ 561 ఎ లోని తెమ్భుర్ నీ-పంఢర్ పుర్ సెక్శన్ తో పాటు ఎన్‌ హెచ్‌-561ఎ లోని పంఢర్ పుర్- మంగళ్ వేధా-ఉమాదీ సెక్శన్‌ లు కూడా ఉన్నాయి.

 

 

**************

 

DS/AK


(Release ID: 1770250) Visitor Counter : 227