ప్రధాన మంత్రి కార్యాలయం
గ్లాస్ గో లో సిఒపి26 శిఖర సమ్మేళనం లో భాగం గా ‘ఎక్సెలరేటింగ్క్లీన్ టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ డిప్లాయ్ మెంట్’ అంశం పైజరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
02 NOV 2021 11:45PM by PIB Hyderabad
ఎక్స్ లన్సిజ్,
నమస్కారం.
ఈ రోజు న ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ప్రారంభ సందర్భం లో మీకు అందరి కి ఇదే స్వాగతం. నేను ఎన్నో సంవత్సరాలు గా ఆలోచిస్తూ వచ్చిన ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఎ) తో పాటు యుకె యొక్క గ్రీన్ గ్రిడ్ ఇనిశియేటివ్ ల వంటి కార్యక్రమం తో ఈ రోజు న ఒక నిర్దిష్టమైనటువంటి రూపు లభించింది. ఎక్స్ లన్సిజ్, పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాలు దన్ను గా నిలచాయి. శిలాజ ఇంధనాల ను ఉపయోగించుకొని అనేక దేశాలు సమృద్ధం అయ్యాయి కానీ, మన భూమి, మన పర్యావరణం పేదవి అయిపోయాయి. శిలాజ ఇంధనాల కోసం ఆరాటపడడం తో భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తత లు దాపురించాయి. కానీ ఈ రోజు న సాంకేతిక విజ్ఞానం మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది.
ఎక్స్ లన్సిజ్,
వేల కొద్దీ సంవత్సరాల కు పూర్వం సూర్యోపనిషద్ లో
‘ సూర్యాద్ భవంతీ భూతాని,
సూర్యేణ పాలితాని తు॥ ’
అని పేర్కొనడం జరిగింది. ఈ మాటల కు.. ప్రతిదీ సూర్యుని నుంచే ఉత్పన్నం అయింది. అన్ని శక్తుల మూల వనరు సూర్య గ్రహమే. మరి, సూర్య శక్తి ద్వారానే ప్రతి ఒక్కటీ మనుగడ సాగిస్తోంది.. అని భావం. భూమి మీద జీవం అంకురించిన అప్పటి నుంచి చూస్తే అన్ని ప్రాణుల జీవిత చక్రం, మరి వాటి దిన చర్య లు సూర్యోదయం తో, సూర్యాస్తమయం తో పెనవేసుకొన్నాయి. ఈ ప్రాకృతిక బంధం కొనసాగుతూ ఉన్నంత కాలం మన భూగ్రహం ఆరోగ్యం గా ఉంటూ వచ్చింది. కానీ, ఆధునిక యుగం లో మనిషి సూర్య ఆధారిత చక్రభ్రమణాన్ని అధిగమించడం కోసం ప్రయత్నాన్ని మొదలు పెట్టి, ఆ ఆరాటం లో పాకృతిక సమతుల్యత ను చెల్లాచెదరు చేశాడు; మరి తన చుట్టూరా ఉన్న పర్యావరణాని కి ఎక్కడ లేని చేటు ను తెచ్చిపెట్టాడు. మనం మళ్లీ ప్రకృతి తో కలసి సంతులిత జీవనాన్ని స్థాపించాలి అంటే అందుకు దోహదపడేది కూడా మన సౌర గ్రహమే. మానవ జాతి భవిష్యత్తు ను కాపాడుకోవడం కోసం మనం తిరిగి సూర్య గ్రహం తో పాటు నడవవలసిఉంటుంది.
ఎక్స్ లన్సిజ్,
ఒక సంవత్సర కాలం లో యావత్తు మానవాళి వినియోగించే శక్తి తాలూకు పరిమాణం తో సమానమైనటువంటి శక్తి ని సౌర గ్రహం ఒక గంట సేపట్లో ధరణి కి ప్రసాదిస్తుంది. మరి, ఈ అనంతమైన శక్తి పూర్తి గా స్వచ్ఛమూ, స్థిరమూ ను. ఎదురవుతున్న సవాలల్లా సౌర శక్తి అనేది పగటి పూటే లభిస్తుంది. అంతేకాక అది వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ ఈ సవాలు కు ఒక పరిష్కారం అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్త గ్రిడ్ నుంచి స్వచ్ఛ శక్తి అన్ని చోట్లా ఎల్లవేళ లా దొరకగలుగుతుంది. దీనితో నిలవ చేసుకొనే అవసరం తగ్గుతుంది, అలాగే సోలర్ ప్రాజెక్ట్ స్ యొక్క లాభదాయకత పెరుగుతుంది. ఈ సృజనాత్మక కార్యక్రమం ద్వారా కర్బన పాద ముద్ర ను, శక్తి తాలూకు వ్యయాన్ని తగ్గించగలగడం ఒక్కటే కాకుండా విభిన్న ప్రాంతాల మధ్య, విభిన్న దేశాల మధ్య సహకారానికి ఒక కొత్త మార్గం కూడా తెరచుకొంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది.. ‘వన్ సన్: వన్ వరల్డ్: వన్ గ్రిడ్’ మరియు ‘గ్రీన్ – గ్రిడ్ ఇనిశియేటివ్ ల కలయిక తో ఒక సంయుక్తమైనటువంటి, సుదృఢమైనటువంటి గ్లోబల్ గ్రిడ్ యొక్క వికాసం సాధ్యపడుతుంది.. అని.
మా అంతరిక్ష సంస్థ ఇస్ రో ప్రపంచానికి ఒక సోలర్ కేలిక్యులేటర్ ఏప్లికేశన్ ను అందించనుందనే విషయాన్ని కూడా నేను ఈ రోజు న తెలియజేయదలచుకొన్నాను. ఈ కేలిక్యులేటర్ తో, ఉపగ్రహ సమాచారం ఆధారం గా ప్రపంచం లోని ఏ ప్రదేశం లో అయినా సరే సౌర విద్యుత్తు సామర్ధ్యాన్ని కొలవవచ్చును. ఈ ఏప్లికేశన్ సోలర్ ప్రాజెక్ట్ స్ యొక్క స్థానాన్ని నిర్ణయించడం లో ఉపయోగకరంగా ఉంటుంది, అంతేకాక దీనితో ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు కూడా బలం లభిస్తుంది.
ఎక్స్ లన్సిజ్,
మరోసారి, నేను ఐఎస్ఎ ను అభినందిస్తున్నాను. మరి నా మిత్రుడు శ్రీ బోరిస్ జాన్ సన్ కు ఆయన అందించిన సహకారానికి గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇతర దేశాలన్నింటి నేత లు ఇక్కడ కు విచ్చేసినందుకు కూడాను వారికి నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.
మీకు అందరికి ధన్యవాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***
(Release ID: 1769550)
Visitor Counter : 215
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam