ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

జమ్ము కశ్మీర్‌ లోని నౌశెరా జిల్లాలో భారత సాయుధ బలగాలసైనికులతో కలసి దీపావళి వేడుకలను జరుపుకొన్న ప్రధాన మంత్రి


నౌశెరా వీరులు బ్రిగేడియర్‌ ఉస్మాన్‌.. నాయక్ జదునాథ్సింహ్, లెఫ్టినెంట్‌ ఆర్‌.ఆర్‌.రాణే తదితరులకు శ్రద్ధాంజలి ని సమర్పించారు

“నేను మీ కోసం 130 కోట్ల భారతీయుల శుభకామనల ను తీసుకువచ్చాను”

“స్వాతంత్ర్యం తాలూకు ‘అమృత కాలం’లో నేటిభారతదేశం తన సామర్థ్యాలు మరియువనరుల విషయం లో అప్రమత్తం గా ఉంది”

“లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు మరియు జైసల్ మేర్‌నుంచి అండమాన్‌-నికోబార్‌ వరకు; సరిహద్దు ను ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన తో పాటు అవసరమైన కనెక్టివిటీ ని ఏర్పరచడంజరిగింది, దీనితో మౌలిక సదుపాయాలు మరియు జవానుల కోసం సౌకర్యాల లో ఇదివరకు ఎరుగని మెరుగుదలచోటు చేసుకొంది”

“దేశం యొక్క రక్షణ లో మహిళ ల భాగస్వామ్యం సరికొత్త శిఖరాల నుఅందుకొంటున్నది”

‘‘భారత సాయుధ దళాలు ప్రపంచం లోని అగ్రగామిసాయుధ బలగాల తో సమానం గా కార్యకుశలతను కలిగివున్నాయి, కానీ, దీని మానవీయ విలువలు దీనిని విశిష్టం గాను, అసాధారణం గానునిలబెడుతున్నాయి”

“మేం ఈ దేశాన్ని ఒక ప్రభుత్వం లాగానో, అధికారం లాగానో లేదాసామ్రాజ్యం లాగానో భావించడం లేదు; మాకయితే ఇది సజీవంగా ఉంది, మన వర్తమాన ఆత్మ ఇది, దీనినిరక్షించడం

Posted On: 04 NOV 2021 1:46PM by PIB Hyderabad

రాజ్యాంగ హోదా లో ఉంటూ మునుపటి అన్ని సంవత్సరాల తరహా లోనే, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏడాది లో కూడా దీపావళి ని సాయుధ బలగాల తో కలసి జరుపుకొన్నారు. ఆయన ఈ రోజు న జమ్ము- కశ్మీర్‌ లోని నౌశెరా జిల్లా లో భారత సాయుధ దళాల తో మమేకమయ్యారు.

 

ప్రధాన మంత్రి ఈ సందర్భం లో సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తాను సాయుధ బలగాల తో కలసి తన కుటుంబం తో దీపావళి ని జరుపుకొంటున్నానన్న భావన తోనే ఈ పండుగ ను జరుపుకొంటానన్నారు. రాజ్యాంగ పదవిని చేపట్టిన తరువాత తాను తన అన్ని దీపావళి పర్వదినాలను దేశ సరిహద్దుల లో గల సాయుధ బలగాల తో కలసి జరుపుకొన్నానని ఆయన అన్నారు. తాను ఒక్కడినే రాలేదని, యావత్తు 130 కోట్ల భారతీయుల శుభకామనల ను తన వెంట తీసుకు వచ్చానని ఆయన అన్నారు. నేటి సాయంత్రం పూట, భారతదేశం లోని ప్రతి ఒక్కరు దేశ శూర సైనికుల కు వారి వారి శుభాకాంక్షలను తెలియజేయడం కోసం తలా ఒక దివ్వె ను వెలిగిస్తారని ఆయన అన్నారు. సైనికులు దేశాని కి సజీవ సురక్ష కవచం తో సమానం అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ వీరపుత్రులు, వీర పుత్రిక ల ద్వారా దేశ సేవ జరుగుతూ ఉన్నదని, ఇది ఒక సౌభాగ్యం అని, ఇది ప్రతి ఒక్కరి కి దొరకదు అని ఆయన అన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ నౌశెరా నుంచి దేశప్రజల కు దీపావళి తో పాటు రాబోయే అన్ని పండుగల కు.. ఉదాహరణ కు గోవర్ధన పూజ, భయ్యా దూజ్‌, ఛఠ్ ల శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ఆయన గుజరాత్ ప్రజల కు వారి నూతన సంవత్సరం తాలూకు శుభాకాంక్షలను కూడా తెలిపారు.

 

నౌశెరా చరిత్ర భారతదేశం యొక్క పరాక్రమానికి సాక్షిగా నిలచిందని, దీని వర్తమానం జవానుల వీరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక ప్రతీక గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్షేత్రం ఎల్లప్పటికి దండెత్తివచ్చే విరి మరియు అతిక్రమణదారులకు వ్యతిరేకం గా బలం గా నిలబడింది. మాతృభూమి యొక్క రక్షణ లో ప్రాణత్యాగం చేసినటువంటి నౌశెరా యొక్క వీరులు బ్రిగేడియర్‌ ఉస్మాన్ మరియు నాయక్‌ జదునాథ్‌ సింహ్ లకు శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. పరాక్రమానికి, దేశభక్తి కి అపూర్వ నిదర్శనాన్ని అందించిన లెఫ్టినెంట్ ఆర్‌.ఆర్‌. రాణే తదితర వీరుల కు ఆయన వందనాన్ని ఆచరించారు. సాయుధ దళాల కు దృఢమైన మద్దతు ను అందించినటువంటి శ్రీ బల్‌ దేవ్‌ సింహ్, శ్రీ బసంత్‌ సింహ్ ల ఆశీర్వాదాలను అందుకోవడం కోసం ప్రధాన మంత్రి తన యొక్క మనోభావాల ను వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రయిక్ లో ప్రముఖ పాత్ర ను పోషించినందుకు అక్కడ కర్తవ్య నిర్వహణ లో నిమగ్నం అయినటువంటి వాహిని ని ఆయన ప్రశంసించారు. వీర సైనికులందరు సర్జికల్ స్ట్రయిక్ నుంచి తిరిగి వచ్చినప్పటి ఉపశమనకారి క్షణాల ను కూడా ఆయన స్మరించారు.

 

దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించే బాధ్యత అందరిదీనూ అని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్ర్యం తాలూకు ‘అమృత కాలం’ లో ఇవాళ భారతదేశం తన సామర్థ్యాలను, వనరులను చూసుకొని పూర్తి స్థాయి లో జాగరూకత తో ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. రక్షణ ఉపకరణాల కోసం విదేశాల పై ఆధారపడుతూ వచ్చిన ఇదివరకటి కాలానికి భిన్నం గా ప్రస్తుతం ఈ విషయం లో స్వయంసమృద్ధి పెరుగుతూ ఉండడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. రక్షణ బడ్జెటు లో 65 శాతం నిధుల ను దేశం లోపలే వినియోగించడం జరుగుతోందని ఆయన అన్నారు. స్వదేశం లో మాత్రమే కొనుగోలు చేసేందుకు 200 ఉత్పాదనల తో ఒక సకారాత్మకమైన లేదా స్వీకృత‌ సూచీ ని సిద్ధం చేయడమైందని, త్వరలోనే ఈ సూచీ ని విస్తరించడం జరుగుతుందని ఆయన అన్నారు. విజయ దశమి నాడు ప్రారంభించిన 7 కొత్త రక్షణ కంపెనీల ను గురించి కూడా ప్రస్తావించారు. ఎందుకంటే పాత ఆయుధ కర్మాగారాలు ప్రస్తుతం విశేష రంగానికి చెందిన విశిష్ట ఉపకరణాల ను, మందుగుండు సామగ్రి ని తయారు చేస్తాయన్నారు. వీటితో పాటు డిఫెన్స్ కారిడార్ లను కూడా నిర్మించడం జరుగుతోందన్నారు. భారతదేశం లో యువత రక్షణ సంబంధి స్టార్ట్- అప్స్ తో జతపడినట్లు ఆయన తెలిపారు. వీటన్నిటి ఫలితం గా రక్షణ రంగానికి సంబంధించి ఎగుమతి దారు గా భారతదేశం స్థానం మరింత గా బలోపేతం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

 

ప్రపంచవ్యాప్తం గా మారుతున్న అవసరాల కు తగినట్లు గా భారత సైనిక శక్తి విస్తరణ, దీనిలో భారీ మార్పు ను తీసుకురావలసిన అవసరం ఎంతయినా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన రంగ ముఖ చిత్రం వేగం గా మారడం అవశ్యం అయిపోయింది, అందుకని ఏకీకృత సైనిక నాయకత్వం లో సమన్వయాన్ని సాధించడం అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యం లో సైనిక వ్యవహారాల శాఖ, సీడీఎస్‌ సమష్టి గా కృషిచేస్తున్నట్లు తెలిపారు. అదేవిధం గా అత్యాధునిక సరిహద్దు మౌలిక సదుపాయాలు దేశ సైనికబలాన్ని ఇనుమడింపజేస్తాయని ఆయన చెప్పారు. లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ దాకా... జైసల్ మేర్‌ నుంచి అండమాన్-నికోబార్ వరకూ సరిహద్దు ప్రాంతాల లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన తో పాటు కనెక్టివిటీ ని ఏర్పరచడం జరిగింది; దీని తో సౌనికుల కోసం సౌకర్యాల లో అపూర్వమైనటువంటి మెరుగుదల చోటు చేసుకొంది, అంతే కాక సైనికుల కు సదుపాయాలు కూడా ను బాగా పెరిగాయి అని ఆయన అన్నారు.

 

దేశ రక్షణ లో మహిళ ల భాగస్వామ్యం సరికొత్త శిఖరాల ను అందుకొంటూ ఉండటం పట్ల ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. నౌకాదళం లో, వాయుసేన లో ముందువరుస శ్రేణిలో మహిళల పాత్ర విస్తరిస్తుండగా, త్వరలోనే సైన్యంలోనూ చేపట్టబోతున్నట్లు తెలిపారు. మహిళా అభ్యర్థులకు ‘శాశ్వత కమీశన్‌, ఎన్‌డిఎ, నేశనల్‌ మిలిటరీ స్కూల్‌, నేశనల్‌ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌’ తదితరాలతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం లో తన ప్రకటన మేరకు బాలిక ల కోసం సైనిక పాఠశాల లు కూడా ప్రారంభం కావడం గురించి ఆయన వివరించారు.

 

సాయుధ బలగాల లో అపరిమిత సామర్థ్యాలను మాత్రమేగాక అచంచల సేవా స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని, సాటి లేనటువంటి చైతన్యాన్ని కూడా తాను చూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు. అందుకే ప్రపంచంలో భారత సాయుధ దళాలు విశిష్టమైనవి అని పేర్కొన్నారు. ఆ మేరకు వృత్తి నైపుణ్యం లో ప్రపంచ అగ్ర శ్రేణి దళాలకు భారత సాయుధ దళాలు తీసిపోవని, కానీ, దాన్ని విభిన్నం.. అసాధారణం చేస్తున్నది దాని మానవ విలువలే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. “ఇది మీకు కేవలం జీతం కోసం చేసే ఉద్యోగం కాదు… మీకిది ప్రత్యేక కర్తవ్యం.. ఆరాధన.. ఈ ఆరాధన ఎలాంటిది అంటే- మీరు 130 కోట్ల మంది ప్రజల స్ఫూర్తి ని చూడగల ఆరాధన” అని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే “సామ్రాజ్యాలు వస్తాయి… పోతాయి… కానీ, భారతదేశం వేల సంవత్సరాల కిందటి నుంచి శాశ్వతం గా కొనసాగుతోంది. నేటికీ అలాగే ఉంది… మరికొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఈ శాశ్వతత్వం నిలచి ఉంటుంది. మేము ఈ దేశాన్ని ఒక ప్రభుత్వం గా.. అధికారం గా లేదా సామ్రాజ్యం గా భావించడం లేదు; మా వరకూ మాకు అది సజీవం.. వర్తమాన ఆత్మ.. దీని రక్షణ కేవలం భౌగోళిక సరిహద్దుల కు పరిమితం కాదు; మా దృష్టి లో దేశ రక్షణ అంటే- సజీవ జాతీయ చైతన్యాన్ని.. ఏకత ను.. సమగ్రత ను రక్షించుకోవడమే” అని ఆయన విస్పష్టం గా చాటారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ- “పరాక్రమం లో మన సైనిక బలగాలకు ఆకాశమే హద్దు కాగా.. మానవ సహజ దయాగుణం లో వారి హృదయాలు సముద్రం అంత లోతైనటువంటివి. అందుకే మన సాయుధ దళాలు సరిహద్దుల ను రక్షించడమే కాకుండా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయం లోనూ అమూల్య సేవలను అందించేందుకు సదా సిద్ధం గా ఉంటాయి. దీనివల్ల భారతదేశం లో ప్రతి ఒక్కరి హృదయం లో వారిపై దృఢ విశ్వాసం చిరస్థాయి గా నిలచిపోతుంది. భారతదేశం ఏకత, అఖండత లు సహా ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌’ భావన కు సంరక్షకులు, పరిరక్షకులు మీరే. మీ ధైర్యం మీ సాహసాలే ప్రేరణ గా మేం భారతదేశాన్ని ప్రగతి తాలూకు శిఖరానికి తీసుకుపోతామని నేను సంపూర్ణ విశ్వాసం తో ఉన్నాను” అన్నారు.

https://youtu.be/J5LmXCEmGDM

 

***(Release ID: 1769496) Visitor Counter : 74