బొగ్గు మంత్రిత్వ శాఖ
డంపర్‌లలో డీజిల్‌ను ఎల్‌ఎన్‌జితో భర్తీ చేయడానికి ఎమిషన్-పైలట్ ప్రాజెక్ట్‌ను మరింత తగ్గించడానికి కోల్ ఇండియా ప్రయత్నం
డీజిల్ వినియోగాన్ని 40 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది; తద్వారా ఇంధనంపై సంవత్సరానికి రూ.500 కోట్ల వరకూ ఆదా
Posted On:
02 NOV 2021 1:27PM by PIB Hyderabad
కార్బన్ ఉద్గారాలను మరింత తగ్గించడానికి, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవలే డంపర్‌లలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) కిట్‌లను తిరిగి అమర్చే ప్రక్రియను ప్రారంభించింది. గనులలో బొగ్గు రవాణాకు ఉపయోగించి పెద్ద ట్రక్కుల్లో వీటిని ఉపయోగిస్తారు. సిఐఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ. ఇది రూ.3500 కోట్లకు పైగా ఖర్చుతో సంవత్సరానికి 4 లక్షల కిలోలీటర్ల డీజిల్‌ను ఉపయోగిస్తుంది.
గెయిల్ (ఇండియా) లిమిటెడ్ మరియు బిఈఎంఎల్ లిమిటెడ్‌తో కలిసి కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్)లో పనిచేస్తున్న దాని రెండు 100 టన్నుల డంపర్‌లలో ఎల్‌ఎన్‌జి కిట్‌లను రీట్రోఫిట్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఎన్‌ఎన్‌జి కిట్ విజయవంతంగా రీట్రోఫిట్ చేయబడి మరియు పరీక్షించబడిన తర్వాత ఈ డంపర్‌లు డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్‌తో పని చేయగలవు మరియు ఎన్‌ఎన్‌జీ వినియోగంతో వాటి కార్యకలాపాలు గణనీయంగా చౌకగా మరియు శుభ్రంగా ఉంటాయి.
ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులలో సిఐఎల్‌కు 2500 కంటే ఎక్కువ డంపర్‌లు ఉన్నాయి. సిఐఎల్ ఉపయోగించే మొత్తం డీజిల్‌లో 65 నుండి 75 శాతం వరకు రవాణాకు వినియోగిస్తున్నాయి. ఎల్‌ఎన్‌జి డీజిల్ వినియోగాన్ని 30 నుండి 40 శాతం భర్తీ చేస్తుంది మరియు డంపర్‌లతో సహా అన్ని హెవీ ఎర్త్ మూవింగ్ మెషీన్‌లను ఎల్‌ఎన్‌జి కిట్‌లతో రీట్రోఫిట్ చేస్తే ఏటా రూ. 500 కోట్ల పొదుపుకు మార్గం సుగమం చేస్తుంది మరియు ఇంధన ధరను దాదాపు 15 శాతం తగ్గించవచ్చు.
పైలట్ ప్రాజెక్ట్ మరియు డంపర్ల పనితీరుపై సాంకేతిక అధ్యయనం పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ యొక్క వ్యయ ఆర్థిక శాస్త్రం మూల్యాంకనం చేయబడుతుంది. పైలట్ ప్రాజెక్టు ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ ఫలితాల ఆధారంగా సిఐఎల్ తన హెచ్‌ఈఎంఎంలలో ముఖ్యంగా డంపర్‌లలో ఎల్‌ఎన్‌జి యొక్క బల్క్ వినియోగం గురించి నిర్ణయిస్తుంది. ప్రాజెక్ట్ విజయవంతమైతే కేవలం ఎన్‌ఎన్‌జి ఇంజిన్‌లతో మాత్రమే హెచ్‌ఈఎంఎంలను కొనుగోలు చేయాలని సిఐఎల్ యోచిస్తోంది. తద్వారా ఆ సంస్థ కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించడంతో పాటు స్థిరమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అధిక సామర్థ్యం గల మైనింగ్ డంప్ ట్రక్కులలో ఎన్‌ఎన్‌జీ హైబ్రిడ్ ఆపరేషన్ యూఎస్, కెనడా, మెక్సికో, రష్యా మరియు ఘనా దేశాల్లో అమలు చేయబడుతోంది.
****
(Release ID: 1768935)
Visitor Counter : 159