ప్రధాన మంత్రి కార్యాలయం

జి20 శిఖరసమ్మేళనం లో రెండో సదస్సు అయిన ‘క్లయిమేట్ చేంజ్ ఎండ్ ఎన్ వైరన్ మెంట్’ లోప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 31 OCT 2021 11:50PM by PIB Hyderabad

ఎక్స్ లన్సిజ్,

ఈ రోజు న, క్లయిమేట్ ఏక్శన్ అంశాన్ని గురించి జి-20 దేశాల తో నేను మాట్లాడే సందర్భం లో, నాకు ఉన్నటువంటి రెండు ప్రధాన బాధ్యత ల పట్ల పెద్ద బాధ్యతల పట్ల పూర్తి సంవేదనశీలత తో నా అభిప్రాయాల ను వెల్లడి చేయదలచాను. మొదటి బాధ్యతల్లా క్లయిమేట్ మిటిగేశన్ ను గురించినటువంటిది. ఇది భారతదేశం తాలూకు వేల సంవత్సరాల పాతది అయిన సంప్రదాయం నుంచి ప్రేరణ ను పొందింది. మేం ఈ అంశం లో మహత్వాకాంక్ష కలిగిన లక్ష్యాల తో ముందుకు కదులుతున్నాం. పారిస్ లో మనం మన ఉద్దేశ్యాల ను ప్రకటించినప్పుడు 175 గీగా వాట్ మేర నవీకరణ యోగ్య శక్తి వంటి పని ని భారతదేశం పూర్తి చేయగలుగుతుందా? అని చాలా మంది అన్నారు. కానీ భారతదేశం ఈ లక్ష్యాల ను శరవేగం గా సాధిస్తుండడమే కాక మరింత ఉన్నతమైన లక్ష్యాల ను నెరవేర్చే దిశ లో పయనిస్తున్నది. తన పారిస్ వాగ్దానాల కంటే ముందుకు పోతూ, భారతదేశం 26 మిలియన్ హెక్టేర్ స్ బంజరు భూముల ను పునరుద్ధరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకొంది; ప్రతి ఏడాది లో సగటున 8 బిలియన్ యాత్రికుల కు సేవల ను అందిస్తున్నటువంటి, ప్రపంచం లో కెల్లా అన్నిటికంటే పెద్ద సంఖ్య లో ప్రయాణికుల ను చేరవేస్తున్నటువంటి సంస్థ అయిన భారతీయ రైల్ వే లు ‘2030వ సంవత్సరం కల్లా నెట్ జీరో ను సాధించాలని సంకల్పించుకొన్నది. తన ఈ నిర్ణయం ద్వారా భారతీయ రైల్ వే లు ప్రతి ఏడాది 60 మిలియన్ టన్ను ల కర్బన ఉద్గారాన్ని తగ్గించనుంది. మేం 2025 సంవత్సరాని కల్లా పెట్రోల్ లో 20 శాతం ఇథెనాల్ ను కలపాలనే లక్ష్యాన్ని చేరుకొనే పని లో నిమగ్నమయ్యాం. ఆసియా సింహాలు, పులులు, ఖడ్గ మృగాలు, డాల్ఫిన్ ల సంఖ్య ను వృద్ధి చేసి భారతదేశం పర్యావరణ రక్ష తాలూకు మా వాగ్దానం కేవలం శక్తి చర్చ కే పరిమితం కాదు అని నిరూపించింది. మిటిగేశన్ తాలూకు బాధ్యత నుంచి భారతదేశం ఇదివరకు ఎన్నడూ వెనుదీయలేదు, అలాగని ఈ విషయం లో ఎప్పటికీ వెనుక కు తగ్గే ప్రసక్తే ఉండబోదు కూడాను. గడచిన సంవత్సరాల లో జరిగిన ప్రయాసల కారణం గా ప్రస్తుతం భారతదేశం నవీకరణ యోగ్య శక్తి సామర్ధ్యం పరం గా చూసినప్పుడు ప్రపంచం లో అగ్రగామి అయిదు దేశాల లో ఒక దేశం గా ఉంది. భారతదేశం చేజిక్కించుకొన్న ఈ సఫలత ను ప్రపంచం సైతం గుర్తిస్తున్నది. యుఎస్ఎ, ఫ్రాన్స్, యుకె, స్వీడన్ ల వంటి దేశాలు మా ఐఎస్ఎ మరియు సిడిఆర్ఐ ల వంటి మా యొక్క అనేక కార్యక్రమాల లో మా భాగస్తులు గా కూడా ఉన్నాయి.

ఎక్స్ లన్సిజ్,

నేను క్లయిమేట్ జస్టిస్ తాలూకు నా రెండో బాధ్యత ను గురించి ఆలోచిస్తూ ఉంటే, నా గుండె లో ఓ బాధ కూడా ఉంది. క్లయిమేట్ జస్టిస్ ను గురించి మరచిపోయి మనం అభివృద్ధి చెందుతున్న దేశాల కు అన్యాయం చేయడం మాత్రమే కాక యావత్తు మానవ జాతి ని మోసం చేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల పక్షాన ఎలుగెత్తి మాట్లాడేటటువంటి దేశం గా భారతదేశం క్లయిమేట్ ఫైనాన్స్ విషయం లో అభివృద్ధి చెందిన దేశాలు అలక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని చిన్నచూపు చూడ జాలదు. క్లయిమేట్ ఫినాన్స్ విషయం లో నిర్దిష్ట ప్రగతి కి తావు లేనిదే, అభివృద్ధి చెందుతున్న దేశాల క్లయిమేట్ యాక్షన్ పరం గా పై ఒత్తిడి ని తీసుకు రావడం అనేది న్యాయం అనిపించుకోదు. నేను చేసే సూచన ఏమిటి అంటే- అది అభివృద్ధి చెందిన దేశాలు వాటి యొక్క జిడిపి లో కనీసం ఒక శాతం నిధుల ను అభివృద్ధి చెందుతున్న దేశాల లో హరిత పథకాల కు ఆర్థిక సహాయం చేయడానికై తప్పక అందించాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి అనేదే.


ఎక్స్ లన్సిజ్,

మూడు ఆచరణీయ అంశాల ను మూడిటి ని గురించి నేను జి-20 భాగస్వామ్య దేశాల సమక్షం లో వల్లించదలచాను. ఒకటోది ఏమిటి అంటే జి-20 దేశాలు ఒక స్వచ్ఛ శక్తి పథకాల నిధినంటూ ఒక దానిని ఏర్పాటు చేయాలి. ఈ నిధి ని చరమ స్థాయి ని అందుకోవడం ఇంకా జరుగని దేశాల లో వినియోగించవచ్చును. ఈ నిధి ఐఎస్ఎ వంటి ఇతర సంస్థల కు కూడా అండదండల ను అందించగలదు. రెండోది.. మనం జి-20 సభ్యత్వ దేశాల లో స్వచ్ఛ శక్తి సాధన కోసం కృషి చేసే పరిశోధన సంస్థ ల తో ఓ నెట్ వర్క్ ను జరూరు గా ఏర్పాటు చేయాలి. అది స్వచ్ఛ శక్తి తాలూకు కొత్త కొత్త సాంకేతికతల తో పాటు వాటి మోహరింపు సంబంధి ఉత్తమ అభ్యాసాల రూపకల్పన పైన కూడా పని చేయాలి. మూడోది.. జి-20 సభ్యత్వ దేశాలు గ్రీన్ హైడ్రోజన్ రంగం లో ప్రపంచ ప్రమాణాల ను ఏర్పరచడం కోసం ఒక సంస్థ ను తప్పక స్థాపించాలి. తద్ద్వారా దీని ఉత్పత్తి ని, ఉపయోగాన్ని ప్రోత్సహించడం వీలుపడుతుంది. ఈ ప్రయాసలు అన్నిటి కి భారతదేశం సైతం తన వంతు గా పూర్తి తోడ్పాటు ను అందిస్తుంది.

మీకు అందరికీ ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

**



(Release ID: 1768932) Visitor Counter : 123