ఉక్కు మంత్రిత్వ శాఖ
అన్ని రంగాలలోని ప్రజలకు శిక్షణ ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీరామ్ చంద్ర ప్రసాద్ సింగ్
Posted On:
01 NOV 2021 10:55AM by PIB Hyderabad
గౌరవ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్ , నాగపూర్ లోని ప్రత్యక్ష పన్నుల జాతీయ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డైరక్టర్ జనరల్ ( శిక్షణ) శ్రీమతి రుబి శ్రీవాత్సవ , అకాడమీకి చెందిన ఇతర ఫాకల్టీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.
2021 అక్టోబర్ 31న ఆయన ఎన్.ఎ.డి.టిని సందర్శించారు. అక్కడ ఆయనను ఎన్.ఎ.డి.టి క్యాంపస్ లో పరిపాలనా భవనంలో గల ఆర్కైవ్ సెక్షన్ ను చూపించారు. ఈ ఆర్కైవ్స్ లో ఆదాయపన్ను శాఖ శిక్షణకు సంబంధించిన చరిత్ర ను ప్రతిబింబించేవి ఉన్నాయి. అనతంరం ఆయన అకాడమీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర ప్రసాద్ సింగ్ ఫ్యాకల్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీసుకున్న చర్యలను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్ఎడిటి అందిస్తున్న శిక్షణ వాతావరణంపై పై మౌలిక సదుపాయాల ప్రభావాన్ని ప్రస్తావించారు. శిక్షణార్ధులకు, అన్ని రంగాలలోని ప్రజలకు శిక్షణ ప్రాధాన్యతను శ్రీ సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. శిక్షణు సంబంధించిన వివిధ అంశాలను, అత్యుత్తమ విధానాలను గురించి ఆయన మాట్లాడారు. చట్టానికి సంబంధించిన తాజా సమాచారం, దృక్పథానికి సంబంధించి శిక్షణ, ముఖాముఖి శిక్షణ వంటి వాటి గురించి ప్రస్తావించారు . శిక్షణ అందించేవారు ప్రేరకులుగా శారీరక మానసిక వికాసానికి పాటుపడాలని, ఇందులో వారి పాత్ర ను ఆయన నొక్కి చెప్పారు.
శ్రీ సింగ్ 1984 బ్యాచ్ యుపి కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. వివిధ హోదాలలో ఆయన 25 సంవత్సరాలు పనిచేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆయన వివిధ హోదాలలో పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ లోని రామ్‌పూర్ , బారాబంకి, హమీర్‌పూర్, ఫతేపూర్ లలో జిల్లా మేజిస్ట్రేట్ గా నాలుగేళ్లు పనిచేశారు. అలాగే యుపి హ్యాండ్‌లూమ్ కార్పొరేషన్ కు జి.ఎంగా , ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా అథారిటీ అదనపు సిఇఒ గా 2001 నుంచి 2005 మధ్య పనిచేశారు.
ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారిగా ఆయన నియమితులు కావడానికి ముందు, ఆయన ఇండియన్ రెవిన్యూ సర్వీసుకు నియమితులయ్యారు. దీనితో ఆయన 1982 ఇండియన్ రెవిన్యూ సర్వీసు బ్యాచ్ వారితో నాగపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ లో శిక్షణ తీసుకున్నారు. 2010 వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తరువాత ఆయన క్రియాశీల రాజకీయాలలో చేరారు. 2010 జూన్ లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన జాతీయ స్థాయిలో విధాన నిర్ణయాలలో , పార్లమెంటుకు చెందిన వివిధ ప్రతిష్ఠాత్మక కమిటీలలో చెప్పుకోదగిన పాత్ర వహిస్తూ వస్తున్నారు. రైల్వేలు, డిఒపిటి, హోమ్ స్థాయీ సంఘం సభ్యుడిగా, విదేశీ వ్యవహారాలు, హోం శాఖల సలహా సంప్రతింపుల సంఘం శ్రీరామ్ చంద్ర ప్రసాద్ సింగ్ పనిచేశారు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు శ్రీ సింగ్ పరిశ్రమలపై కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించారు.
(Release ID: 1768856)
Visitor Counter : 190