విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ వినియోగ స్థాయిని సమీక్షించిన కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి


విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ వినియోగంపై 2021 అక్టోబర్ 8 న సవరించిన
మార్గదర్శకాలు జారీ

9,30,000 టన్నుల బయో మాస్ గుళికల సేకరణకు ఎన్టీపీసీ చర్యలు

ఇంధన వినియోగం కోసం 13,01,000 టన్నుల బయో మాస్ గుళికలు సమీకరించనున్న
హర్యానా,పంజాబ్, ఉత్తరప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు

థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ వినియోగ అంశంపై అవగాహన
కల్పించడానికి శిక్షణా తరగతుల నిర్వహణ

Posted On: 31 OCT 2021 9:05AM by PIB Hyderabad

 

థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ వినియోగ స్థాయిని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ సమీక్షించారు. 2021 అక్టోబర్ 28న జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ,, ఎన్‌టిపిసి సీఎండీ, పంజాబ్,హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న కేంద్రాల ప్రతినిధులు, నేషన్ బయో మిషన్ డైరెక్టర్, ఇంధన శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. బయో మాస్ వినియోగం కోసం ఇంధన మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బయో మాస్ ను సేకరించి వినియోగించడానికి ఎన్‌టిపిసి కార్యాచరణ
కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది.

 

(i) 8,65,000 టన్నుల  బయో మాస్ గుళికల కోసం ఎన్‌టిపిసి ఆర్డర్ చేసింది. వీటి సరఫరా ప్రారంభం అయ్యింది. అక్టోబర్ లో మరో 65,000 టన్నుల గుళికల కోసం ఎన్‌టిపిసి ఆర్డర్ ఇచ్చింది. 25,00,000 బయో మాస్ గుళికల సరఫరా కోసం ఎన్‌టిపిసి ధరఖాస్తులు ఆహ్వానించింది. 2021 నవంబర్ ఒకటవ తేదీ నాటికి సరఫరాదారులు తమ ధరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది.
 

(ii) తమ రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలలో సహ ఇంధనంగా వినియోగించడానికి హర్యానా,పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు 13,01,000 బయో మాస్ గుళికలు సేకరించనున్నాయి. వీటి సరఫరాపై నవంబర్ నెలలో తుది నిర్ణయం
తీసుకుంటారు.

 

బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గుతో పాటు బయో మాస్ ను వినియోగించి ఉత్పత్తి సాగించే అంశానికి సంబంధించి విద్యుత్ మంత్రిత్వ శాఖ 2017 నవంబర్ 17 వ తేదీన విధానాన్ని ప్రకటించింది. బాల్,ట్యూబ్ మిల్
విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలు మినహా మిగిలిన అన్ని విద్యుత్ కేంద్రాలు తమ ఇంధన వనరుల్లో 5 నుంచి 10 శాతం వరకు బయో మాస్ ను వినియోగించాలని పేర్కొనడం జరిగింది. సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేసి భద్రతా పరమైన విశ్లేషణ జరిపిన తరువాత  బొగ్గుతో పాటు బయో మాస్ ను వినియోగించవలసి ఉంటుంది.

 

ఇంధన వినియోగంలో మార్పులు తీసుకు వచ్చి కాలుష్య రహిత ఇంధన వనరుల వినియోగాన్ని ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో విధానంలో అవసరమైన మార్పులు చేసి 8.10.2021న తుది ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం చేసిన సవరణల వల్ల బయో మాస్ వినియోగంలో లక్ష్యాలను సాధించడానికి అవకాశం కలుగుతుంది. ' బొగ్గును వినియోగించి విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ వినియోగానికి సంబంధించి జారీ అయిన మార్గదర్శకాలు ఈ విధంగా
ఉన్నాయి :-
(i) వ్యవసాయ కార్యకలాపాల తరువాత వెలువడే అవశేషాలతో తయారు చేయబడిన బయోమాస్ గుళికలను తమ ఇంధన అవసరాలలో కనీసం 5% ఉండేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మార్గదర్శకాలు అమలు లోకి వచ్చిన ఏడాది కాలం వరకు ఈ నిబంధన అమలు జరుగుతుంది. ఆ తరువాత దీనిని 7% పెంచవలసి ఉంటుంది. ( బాల్ అండ్ ట్యూబ్ మిల్ లలో మాత్రం ఇది 5%గానే ఉంటుంది). ఈ నిబంధన ఉత్తర్వులు వెలువడిన రెండు సంవత్సరాల తరువాత అమలులోకి వస్తాయి.

 

(ii) బయో మాస్ గుళికల సరఫరాలో జాప్యం లేకుండా చూడడానికి వీటి సరఫరా ఒప్పందాన్ని ఏడు సంవత్సరాల కాలానికి కుదుర్చుకోవలసి ఉంటుంది. ఏడాదికోసారి ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే  అంశంలో సమయాలు లేకుండా చూడడానికి, బయో మాస్ గుళికలు నిల్వ ఉండేలా చూడడానికి ఈ నిబంధనను రూపొందించారు.
 

(iii) టారిఫ్ నిర్ణయం మరియు షెడ్యూలింగ్‌కు సంబంధించిన నిబంధనలు క్రింద ఇవ్వబడిన విధంగా ఉండాలి
ఏ. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 62 కింద ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ల కోసం, బయోమాస్ గుళికల సహ-ఫైరింగ్ కారణంగా ఖర్చులో పెరుగుదల ఎనర్జీ ఛార్జ్ రేట్  ద్వారా ఆమోదించబడుతుంది. . బి. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 63 కింద ఏర్పాటైన ప్రాజెక్ట్‌ల కోసం, బయోమాస్ కో-ఫైరింగ్ కారణంగా ఎనర్జీ ఛార్జ్ రేట్ పెరుగుదల చట్ట
నిబంధనలలో మార్పు కింద తిరిగి  చేయవచ్చు. సి. పవర్ ప్లాంట్  మెరిట్ ఆర్డర్ డెస్పాచ్ ని నిర్ణయించడంలో ఎనర్జీ ఛార్జ్ రేట్ అదనపు ప్రభావం పరిగణనలోకి తీసుకోవడం జరగదు. డి. డిస్కామ్ లాంటి బాధ్యతాయుత సంస్థలు కో ఫైరింగ్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ను కొనుగోలు చేసి తమ కొనుగోలు ఒప్పందాలను పునరుద్ధరించుకోవాలసి ఉంటుంది.

సవరించిన పాలసీ కాపీని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్  ఈ క్రింది వెబ్‌లింక్‌లో అందుబాటులో ఉంది:

https://powermin.gov.in/sites/default/files/Revised_Biomass_Policy_dtd_08102021.pdf.
బొగ్గు ఆధారంగా పనిచేస్తున్న థర్మల్  విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ ఇంధన వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ జాతీయ మిషన్ ను నెలకొల్పింది. వ్యవసాయ అవశేషాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యం, థర్మల్ విద్యుత్ కేంద్రాల కర్బన ఉద్గారాలను తగ్గించడం లాంటి అంశాలను ఈ మిషన్ పర్యవేక్షించి సమస్యలు లేకుండా దేశ ఇంధన రంగంలో మార్పు తీసుకుని రావడానికి సహకరిస్తుంది. దీని ద్వారా కాలుష్య రహిత ఇంధన వనరులను ఉపయోగంలోకి తీసుకుని రావడానికి నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది.
ఈ మిషన్ పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బయో మాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ దీనికి అవసరమైన సహకారాన్ని మిషన్ అందిస్తోంది బయో మాస్ సరఫరా వ్యవస్థ మెరుగుపడేలా చూడడానికి కూడా మిషన్ చర్యలను అమలు చేస్తున్నది. దీనికోసం పారిశ్రామిక వేత్తలను గుర్తించడం జరిగింది. బయో మాస ఉత్పత్తి రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి శిక్షణ, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.  ఫరీదాబాద్,హర్యానా, నంగల్, రోపర్ లో ఈ కార్యక్రమాలను సంస్థ ఈ నెలలో నిర్వహించింది.

 

ఈ కార్యక్రమాల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు, వ్యవసాయ అవశేషాలను పొలాల్లో కాల్చడం వల్ల కలిగే నష్టాన్ని, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వాటిని సరఫరా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను  వివరించడం జరిగింది. రైతుల నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయో మాస్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

విద్యుత్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యల వల్ల అక్టోబర్  నెలలో సుమారు 1400 టన్నుల బయోమాస్ తొలగించబడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో  ఇప్పటివరకు మొత్తం 53000 టన్నుల బయోమాస్ గ్రీన్ ఇంధనంగా
ఉపయోగించబడింది. పంజాబ్, హర్యానా, యుపి, ఢిల్లీ, రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి అత్యంత ప్రభావితమైన ఆరు రాష్ట్రాల్లో 2020లో ఇదే కాలంతో పోలిస్తే 2021లో వ్యవసాయ అవశేషాల దగ్ధం  58.3% తగ్గింది. ఇంధన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమం వల్ల ఉత్తర భారతదేశంలో వాతావరణ కాలుష్యం తగ్గి, భూసారం పెరుగుతుందని ఆశిస్తున్నారు. వ్యవసాయ అవశేషాలను బయో మాస్ అవసరాలకు సరఫరా చేయడం ద్వారా రైతులు, సరఫరాదారులు, ఉత్పత్తిదారుల ఆదాయం పెరిగి ఆర్ధిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది.

***



(Release ID: 1768206) Visitor Counter : 132