ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినందుకు సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి


బాధితులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఎక్స్ గ్రేషియా ను ఆమోదించిన - ప్రధానమంత్రి

Posted On: 31 OCT 2021 3:26PM by PIB Hyderabad

ఉత్త‌రాఖండ్‌ లోని చ‌క్ర‌తాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన‌ సంఘటన ప‌ట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్) నుండి ఎక్స్‌గ్రేషియాను కూడా శ్రీ మోదీ ఆమోదించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, 

‘‘ఉత్తరాఖండ్‌ లోని చక్రతాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం.  ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం సహాయ, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.  ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.  అదే విధంగా, ఈ సంఘటనలో, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను : ప్రధానమంత్రి మోదీ. 

ఉత్తరాఖండ్‌ లోని చక్రతాలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున చెల్లిస్తారు : PM @narendramodi" అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలియజేసింది. 

 

*****



(Release ID: 1768194) Visitor Counter : 182