ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
31 OCT 2021 9:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 106.14 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 12,830 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీ రేటు 98.20% కు చేరింది.
గత 24 గంటల్లో 14,667 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,36,55,842 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.46% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,59,272. ఇది 247 రోజుల కనిష్ట స్థాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.13%) గత 27 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (1.18%) గత 37 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 60.83 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1768186)
Visitor Counter : 132