ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
“ ఏఐ ఫర్ డేట్ డ్రైవెన్ గవర్నెన్స్” అనే ఇతివృత్తంపై ఎంఈఐటీవై శాఖ చర్చా కార్యక్రమం
Posted On:
28 OCT 2021 10:42AM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలోని నేషనల్ ఈ గవర్నెన్స్ విభాగం (ఎన్ఈజీడీ) 2021 అక్టోబర్ 28న “AI ఫర్ డేట్ డ్రైవెన్ గవర్నెన్స్” అనే ఇతివృత్తంపై మరో ఏఐ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐలో ఉత్తమ విధానాలతో పాటు, డేటా ఆధారిత మరియు ఏఐ- ఎనేబుల్డ్ గవర్నెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెయజేప్పడం ఈ సెషన్ లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా, దేశీయ నాయకులు, పరిశోధకులు మరియు విద్యావేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయమై తమతమ అభిప్రాయాలను, సంబంధిత కేస్ స్టడీస్‌ను పంచుకోవడం, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసుల గురించి వారి అభిప్రాయాలు & అనుభవాలను పంచుకునేలా ఇక్కడ ప్యానెల్ చర్చను నిర్వహించునున్నారు. ఏఐలో వివిధ పురోగతి ఆవిష్కరణలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి కూడా వీటిలో చర్చించనున్నారు. ఆయా అంశాలపై తగిన చర్చ జరిపేందుకుగాను ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ చొరవ తీసుకో ఏఐపే చర్చ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ప్రభుత్వ మరియు పరిశ్రమల వర్గాల వారి నుండి వారి అనుభవవాల్ని కూడా సేకరించి వాటిని చర్చకుంచనున్నారు. ‘ఏఐ ఫర్ డేటా డ్రైవెన్ గవర్నెన్స్’ అనే సెషన్‌లో ప్రభుత్వ రంగ, రక్షణ రంగం, భద్రత, పోస్టల్ సర్వీసులు మరియు ఫ్యూచర్ సిటీస్ కోసం ఏఐని ఉపయోగించడం గురించి నిపుణులు ప్రసంగించనున్నారు. కోవిడ్-19 మహమ్మారి కష్ట సమయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఏఐ- ఆధారిత పరిష్కారాలపై కూడా ప్రదర్శన ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను మరియు వాటి విధానపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించుకునే దిశగా భారత ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాల్ని
చేపట్టే దిశగా ఇది ఒక ముందడుగు. ఈవెంట్‌ను వీక్షించడానికి, https://bit.ly/3mGSmehలో నమోదు చేసుకోండి. దీనికి తోడు ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం లింక్‌లు ఈ కిందన ఇవ్వబడినాయి.
https://youtu.be/bNcd0quKAyU
https://fb.me/e/2yVdaSZHp
*********
(Release ID: 1767369)
Visitor Counter : 192