సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎస్ఎంఈ) కోసం కేంద్ర మంత్రి నారాయణ్ రాణే “సంభవ్” జాతీయస్థాయి అవగాహన కార్యక్రమం,2021ను ప్రారంభించారు

Posted On: 27 OCT 2021 2:08PM by PIB Hyderabad

దేశ ఆర్థికాభివృద్ధికి దారితీసే వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో యువత నిమగ్నమవ్వాలని కేంద్ర  సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ  మంత్రి  నారాయణ్ రాణే పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం-"సంభవ్" 2021 ను బుధవారం న్యూ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వర్ధమాన పారిశ్రామికవేత్తలు సృష్టించిన కొత్త ఉత్పత్తులు మరియు సేవలు సంబంధిత వ్యాపారాలు లేదా రంగాలను ఉత్తేజపరిచేందుకు ఊతమివ్వగలవని అయన పేర్కొన్నారు.  మంత్రితో పాటు సహాయ మంత్రి  భాను ప్రతాప్ సింగ్ వర్మ మరియు ఎంఎస్ఎంఈ కార్యదర్శి  బిబి స్వైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ మాట్లాడుతూ.. స్థూల జాతీయోత్పత్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 50 శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. అలా సూక్ష్మ, చిన్న  మరియు మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పనను 11 కోట్ల నుంచి 15 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర సూక్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అవగాహన కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కళాశాలలు, ఐటీఐల నుంచి వచ్చే విద్యార్థులను 130 ఫీల్డ్ ఆఫీసుల ద్వారా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలోభాగంగానే కేంద్ర సూక్మ, చిన్న మరియు మధ్యతరహా మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న  వివిధ పథకాల గురించి ఆడియో/వీడియో ఫిల్మ్ ప్రెజెంటేషన్ల ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

దేశవ్యాప్తంగా 1,300 కళాశాలల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు, ఇందులో 1,50,000 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది.

 

***



(Release ID: 1767366) Visitor Counter : 274