రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇండో-పసిఫిక్ రీజినల్ డైలాగ్ 2021ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేసిన రక్షణ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్


సముద్ర సవాళ్లను ఎదుర్కోవడానికి సహకార ప్రతిస్పందనతో పనిచేయాలని పిలుపు

Posted On: 27 OCT 2021 1:04PM by PIB Hyderabad

రక్షణ మంత్రి ప్రసంగంలో ముఖ్య అంశాలు:

  •  1982 సముద్రాల చట్టంపై యుఎన్ సదస్సు ఆదేశాలకు మద్దతిస్తూనే, తన సముద్ర ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత్ కృత నిశ్చయంతో ఉంది 
  • వస్తువుల రవాణాకు, ఆలోచనల మార్పిడికి, ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరచడానికి, ప్రపంచాన్ని చేరువ చేయడానికి సముద్రాలు ముఖ్యమైనవి
  • శ్రేయస్సుకు స్థిరమైన మార్గం కోసం ఇండో-పసిఫిక్ సముద్ర సామర్థ్యాన్ని సమర్ధవంతంగా మరియు సహకారంతో ఉపయోగించుకోవడం అవసరం
  •  ఉగ్రవాదం, పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వాతావరణ మార్పు వంటి సవాళ్లకు సహకార ప్రతిస్పందన అవసరం  

1982లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్ (యుఎన్సిఎల్ఓసి) ప్రకారం, నియమాల ఆధారిత సముద్ర వ్యవస్థల నిర్వహణకు మద్దతిస్తూనే, భారతదేశం తన సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి కృతనిశ్చయంతో ఉందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజినల్ డైలాగ్ (ఐపిఆర్డి) 2021లో కేంద్ర మంత్రి  ప్రధాన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 27-29, 2021 వరకు వర్చ్యువల్ గా నిర్వహిస్తున్నారు.  “సముద్రాల చట్టంపై యుఎన్ కన్వెన్షన్ ( యుఎన్సిఎల్ఓసి)లో పేర్కొన్న అన్ని దేశాల హక్కులను గౌరవించడానికి భారతదేశం కట్టుబడి ఉంది.   యుఎన్సిఎల్ఓసి, 1982 ప్రకారం నిర్దేశించిన నియమ-ఆధారిత సముద్ర వ్యవస్థల నిర్వహణకు మద్దతు ఇస్తూనే, మా ప్రాదేశిక జలాలు మరియు ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించి మా దేశ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము పూర్తిగా నిశ్చయించుకున్నాము," అని ఆయన చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండో-పసిఫిక్ ఒక సహజ ప్రాంతంగా వర్ణించడాన్ని ప్రస్తావిస్తూ, వస్తువుల రవాణా, ఆలోచనల మార్పిడి, ఆవిష్కరణలు మరియు ఉత్ప్రేరకాలను సులభతరం చేయడానికి సముద్రాలు ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ అనుసంధానం అని అన్నారు. ప్రపంచాన్ని మరింత దగ్గరగా తీసుకురావడానికి దోహదం చేస్తుంది. "ఇండో-పసిఫిక్ వైవిధ్యంతో వర్గీకరించబడినప్పటికీ, అనేక సంస్కృతులు, జాతులు, ఆర్థిక నమూనాలు, పాలనా వ్యవస్థలు మరియు వైవిధ్యమైన ఆకాంక్షలతో గుర్తించబడినప్పటికీ, మహాసముద్రాలు ఒక ఉమ్మడి బంధంగా ఉన్నాయి" అని ఆయన చెప్పారు. శ్రేయస్సు కోసం స్థిరమైన మార్గాన్ని కొనసాగించడానికి ఈ ప్రాంత సముద్ర సామర్థ్యాన్ని సమర్ధవంతమైన, సహకార వినియోగం అవసరాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నొక్కి చెప్పారు.

సముద్రాలు మానవాళికి జీవనోపాధి మరియు అభివృద్ధికి విస్తారమైన అవకాశాలను అందిస్తుండగా, అవి ఉగ్రవాదం, పైరసీ, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు వాతావరణ మార్పు వంటి సవాళ్లను విసురుతున్నాయని రక్షణ మంత్రి సూచించారు. ఈ సవాళ్లకు సహకార ప్రతిస్పందన కోసం పిలుపునిచ్చారు, ఇది గణనీయమైన ట్రాన్స్-నేషనల్ చిక్కులను కలిగి ఉందని అన్నారు. .

ఐపిఆర్డి 2021 విస్తృత ఇతివృత్తంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, '21వ శతాబ్దపు సముద్రతీర వ్యూహంలో పరిణామం: ఆవశ్యకాలు, సవాళ్లు, ముందున్న మార్గం' అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు, 

మొదటిసారిగా 2018లో నిర్వహించిన ఐపిఆర్డి అనేది భారత నావికాదళం అత్యున్నత అంతర్జాతీయ వార్షిక సమావేశం. నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ ఈ వార్షిక ఈవెంట్ ప్రతి ఎడిషన్‌కు నేవీ నాలెడ్జ్ పార్టనర్ మరియు చీఫ్ ఆర్గనైజర్. ఇండో-పసిఫిక్‌లో తలెత్తే అవకాశాలు మరియు సవాళ్లు రెండింటినీ సమీక్షించడం ఎడిషన్ లక్ష్యం.

నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, నావికాదళ మాజీ చీఫ్, నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ చైర్మన్ అడ్మిరల్ సునీల్ లంబా (రిటైర్డ్), వివిధ దేశాల నిపుణులు, విధాన రూపకర్తలు ప్రారంభ సెషన్‌లో వర్చ్యువల్ గా  హాజరయ్యారు.

 

***



(Release ID: 1767066) Visitor Counter : 186