ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో రూపకల్పన, అభివృద్ధి చెంది ఉత్పత్తి అయిన వస్తువులలో హాని కల్గించే అంశాల నిర్ధారణ చేయడానికి అధీకృత సీవీఈ నంబరింగ్ అథారిటీగా సీఈఆర్ టీ-ఇన్ నియామకం
Posted On:
27 OCT 2021 12:17PM by PIB Hyderabad
' మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులలో హాని కలిగించే పదార్థాలు వాటి వల్ల కలిగే ప్రభావాలను గుర్తించి, నిర్ధారించే భాద్యతను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీంకు ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులపై నమ్మకాన్ని పెంపొందించడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. తన దృష్టికి వస్తున్న వస్తువుల లోపాలు, వాటి వల్ల కలిగే ప్రభావాలను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం గుర్తించి వాటిపై నివేదికలను అందిస్తూ వస్తోంది. స్వదేశీ వస్తువులపై నమ్మకాన్ని కల్గించడానికి వస్తువులలో ఉండే హాని కలిగించే పదార్ధాలపై పరిశోధన సాగించి పరిష్కార మార్గాలను సూచించడానికి ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం కృషి చేస్తుంది. దీనికోసం వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ కార్యక్రమం కింద ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం అధీకృత సంస్థగా గుర్తింపు పొందింది. దేశంలో రూపకల్పన, అభివృద్ధి జరిగి ఉత్పత్తి అవుతున్న అన్ని వస్తువులు ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం పరిధిలోకి వస్తాయి.
వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ కార్యక్రమం అంతర్జాతీయంగా అమలు జరుగుతున్న కార్యక్రమంగా గుర్తింపు పొందింది. వస్తువుల్లో ఉండే హాని కలిగించే పదార్ధాలను ప్రజల సహకారంతో గుర్తించడానికి ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. వస్తువుల్లో ఉండే హాని కలిగించే పదార్ధాలు వాటి వల్ల కలిగే ప్రభావాలను గుర్తించి వాటిని వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ జాబితాలో చేర్చడం జరుగుతుంది. వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ రికార్డులను ఆధారంగా చేసుకుని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్ నిపుణులు మరింత లోతుగా పరిశోధన, విశ్లేషణ జరిపి వస్తువుల వల్ల కలిగే హాని, దాని ప్రభావాలపై తుది నిర్ధారణకు రావడం జరుగుతుంది.
బహిరంగ సైబర్ సెక్యూరిటీ లోపాలను గుర్తించి, విచారించి వాటి జాబితాను రూపొందించడానికి వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ కార్యక్రమం అమలు జరుగుతుంది. హానికర అంశాలను ప్రజల సహకారంతో గుర్తించడానికి ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాపితంగా అమలులో ఉంది. హాని కలిగించే అవకాశం ఉన్న అంశాలను ప్రపంచం వివిధ దేశాలలో పనిచేస్తున్న సంస్థలు తమకు చెందిన అంశాలను బహిర్గతం చేయడం జరుగుతుంది. వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ లో కలిసి పనిచేస్తున్న అన్ని సంస్థలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించుకున్నాయి.
వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ రికార్డులను పరిశీలించి తాజా జాబితాలను ప్రకటించే భాధ్యతను సిఎన్ఏ సంస్థలు నిర్వర్తిస్తాయి. వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ జాబితాను వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ అధీకృత సంస్థలు సిద్ధం చేస్తాయి. వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్ జాబితాలో చేర్చే ప్రతి అంశానికి సిఎన్ఏ సంస్థ ఆమోదం ఉంటుంది. దీని ఆధ్హారంగా తమ వ్యవస్థలు సైబర్ దాడులకు గురి కాకుండా చూసుకోవడానికి సంబంధిత సంస్థలకు అవకాశం కలుగుతుంది. ప్రతి సిఎన్ఏ సంస్థ ప్రత్యేక భాధ్యతను కలిగి ఉంటుంది.
హాని కలిగించే బహిర్గతం చేయడానికి లేదా బాధ్యతాయుతమైన బహిర్గతం ప్రక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి, ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం వెబ్‌సైట్ @ https://www.cert-in.org.in/RVDCP.jspని చూడవచ్చు.
***
(Release ID: 1766966)
Visitor Counter : 207