వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్‌ని శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు


ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా స్థాపించబడే లాభాపేక్షలేని సంస్థ

ఓఎన్డీసి స్కేల్ అప్ మరియు వేగంగా అమలు చేయబడుతుంది

Posted On: 26 OCT 2021 2:16PM by PIB Hyderabad

 

డిపిఐఐటి యొక్క ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒఎన్‌డిసి) కార్యక్రమంపై కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు & ఆహారం & ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. ఈ సమావేశంలో డిపిఐఐటి కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ మరియు ఒఎన్‌డిసి సలహా మండలి సభ్యులు శ్రీ ఆర్.ఎస్. శర్మ, ఎన్ హెచ్ఎ, సిఈఓ , శ్రీ ఆదిల్ జైనుల్భాయ్, క్యూసిఐ, ఛైర్మన్, శ్రీ దిలీప్అస్బే, ఎండి అండ్ సిఈఓ, ఎన్పీసిఐ, శ్రీ సురేష్ సేథి, ఎండీ&సీఈఓ,  ఎన్ఎస్డీఎల్-ఈ గవర్నమెంట్ శ్రీ కుమార్ రాజగోపాలన్, సిఈఓ, ఆర్ఏఐ, శ్రీ అరవింద్ గుప్తా, మై గవ్ వ్యవస్థాపకులు మరియు అవానా క్యాపిటల్ కు ఎంఎస్ అంజలి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రాజెక్టులోని గణనీయమైన పురోగతిని మంత్రికి వివరించారు. ప్రాజెక్ట్‌ను మిషన్ మోడ్‌లో అమలు చేయడానికి క్యూసీఐ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఒఎన్‌డిసి బృందాన్ని పూర్తి చేయడానికి అనేక చిన్న మరియు మధ్యతరహా సంస్థలు వాలంటీర్లుగా ఆన్-బోర్డ్ చేయబడ్డాయి. ఒఎన్‌డిసి గేట్‌వే కూడా ఏర్పాటు చేయబడింది. అన్ని నెట్‌వర్క్ భాగాలను కవర్ చేసే దాదాపు 20 ఎంటిటీలు ఆన్-బోర్డింగ్ కు చెందిన వివిధ దశల్లో ఉన్నాయి. డిపిఐఐటి ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమం  కోసం సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.

ప్రైవేట్ రంగంలోని లాభాపేక్ష లేని కంపెనీని స్థాపించాలని కేంద్రమంత్రి సూచించారు. ఎంటిటీ జనాభా స్థాయి అమలు కోసం ఒక ప్రారంభ ఆలోచనను అందించాలని భావిస్తున్నారు. భవిష్యత్తును దృష్టి పెట్టుకుని నిర్వహణ, వాణిజ్యంపై లోతైన అవగాహన కలిగిన నాయకత్వం, అత్యాధునిక సాంకేతికతతో సౌలభ్యం మరియు మార్పును నడపడానికి మిషనరీ దృక్పథంతో ప్రారంభించబడింది. లాభాపేక్ష లేని కంపెనీ నిర్మాణం యజమానులు లాభాన్ని పెంచడానికి, నైతిక మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనపై దృష్టి సారించడానికి, విశ్వాసం, కఠినమైన పాలనా నియమాలు, జవాబుదారీతనం మరియు పారదర్శకత కోసం ఏదైనా ప్రోత్సాహాన్ని తొలగిస్తుంది.

ఎనేబుల్ టెక్నాలజీని అవలంబించడం మరియు నిర్మించడం ద్వారా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం మరియు ఎకో-సిస్టమ్ ప్లేయర్‌ల విస్తృత స్థాయి స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఎంటిటీ యొక్క పాత్ర. ఇది వినియోగదారుల రక్షణ, న్యాయమైన వాణిజ్యం మరియు నియంత్రణ అనుగుణ్యత సూత్రాల ఆధారంగా ప్రవర్తనా నియమావళి మరియు నెట్‌వర్క్ నియమాలను ఏర్పాటు చేయడం ద్వారా నెట్‌వర్క్ క్రమశిక్షణను నిర్ధారిస్తుంది. నెట్‌వర్క్ కోసం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కామన్ రిజిస్ట్రీ, పార్టిసిపెంట్స్ మరియు సర్టిఫైయింగ్ ఏజెన్సీల సర్టిఫికేషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మొదలైన నెట్‌వర్క్‌ను మేనేజ్ చేయడం కోసం ఎంటిటీ ఫౌండేషన్ సేవలను అందిస్తుంది. ఎంటిటీ కొనుగోలుదారులు, విక్రేతలు మరియు మార్కెట్ యాక్టివేషన్ కోసం గేట్‌వే కోసం రిఫరెన్స్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేస్తుంది మరియు నిర్వహిస్తుంది. భాగస్వామి సంస్థలతో పాటు నెట్‌వర్క్‌ను ప్రైమింగ్ చేయడం రూపొందిస్తుంది. ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లు త్వరగా నెట్‌వర్క్‌కు అనుగుణంగా మారడంలో సహాయపడటానికి రెడీమేడ్ టూల్స్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఇది ఎస్ఎంఈలకు వారి డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబర్డ్, సిడ్బి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,ఎన్ఎస్డీఎల్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్ఈ మరియు బీఎస్ఈలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో సహా పలువురు కాబోయే ప్రమోటర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

సాధించిన పురోగతి పట్ల శ్రీ గోయల్ సంతృప్తిని వ్యక్తం చేశారు.  ఈ నెట్‌వర్క్‌ను త్వరలో రియాలిటీ చేయడానికి టైమ్‌లైన్‌లను కుదించాలని కోరుకుంటున్నారు. పర్యా వరణ వ్యవస్థ నుండి విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని మరియు సంస్థ నైతిక, సహకార, ప్రజాస్వామ్య మరియు బాధ్యతాయుతమైన పద్ధతిలో నిర్వహించబడే విధంగా సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు ప్రత్యేక కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఒఎన్‌డిసి నెట్‌వర్క్‌పై నమ్మకాన్ని పెంపొందించుకోవడంతో పాటు వివాద పరిష్కారం కోసం విస్తృతమైన యంత్రాంగాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు.



 

*****


(Release ID: 1766697) Visitor Counter : 205