ప్రధాన మంత్రి కార్యాలయం
పద్దెనిమిదోఆసియాన్- భారతదేశం శిఖర సమ్మేళనం (అక్టోబర్ 28,2021) మరియుపదహారో తూర్పు ఏశియా శిఖర సమ్మేళనం (అక్టోబరు 27, 2021)
Posted On:
25 OCT 2021 7:26PM by PIB Hyderabad
2021వ సంవత్సరం అక్టోబరు 28న వర్చువల్ పద్ధతి లో నిర్వహించే పద్దెనిమిదో ఆసియాన్-భారతదేశం శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ బ్రునేయి సుల్తాన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనానికి హాజరు కానున్నారు. ఈ శిఖర సమ్మేళనాని కి ఆసియాన్ సభ్యత్వ దేశాల అధ్యక్షులు/ ప్రభుత్వాల అధినేత లు పాల్గొంటారు.
పద్దెనిమిదో ఆసియాన్-భారతదేశం శిఖర సమ్మేళనం లో ఆసియాన్-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు స్థితి ని సమీక్షించడం జరుగుతుంది. దీనితో పాటు కోవిడ్-19 మరియు ఆరోగ్యం, వ్యాపారం & వాణిజ్యం, కనెక్టివిటీ, విద్య, ఇంకా సంస్కృతి లు సహా ప్రముఖ రంగాల లో నమోదైన ప్రగతి ని కూడా పరిశీలించనున్నారు. మహమ్మారి అనంతర కాలం లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం సహా ముఖ్యమైన ప్రాంతీయ అభివృద్ధి పై, అంతర్జాతీయ అభివృద్ధి పై న కూడా ఈ సందర్భం లో చర్చించడం జరుగుతుంది. ఆసియాన్-భారతదేశం శిఖర సమ్మేళనాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది భారతదేశాని కి, ఆసియాన్ సభ్యత్వ దేశాల కు అత్యున్నత స్థాయి లో సంప్రదింపులను జరుపుకొనేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నది. ప్రధాన మంత్రి కిందటి ఏడాది లో నవంబర్ నెల లో వర్చువల్ పద్ధతి లో జరిగిన పదిహేడో ఆసియాన్-భారతదేశం శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు. పద్దెనిమిదో ఆసియాన్-భారతదేశం శిఖర సమ్మేళనం ఆయన హాజరు అయ్యే తొమ్మిదో ఆసియాన్-భారతదేశం శిఖర సమ్మేళనం కానుంది.
ఆసియాన్-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది ఉమ్మడి భౌగోళిక, చారిత్రిక మరియు సామాజిక పరమైన అభివృద్ధి బంధాల తాలూకు ఒక బలమైన పునాది మీద నిలబడి ఉంది. ఆసియాన్ మన ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ కి మరియు ఇండో-పసిఫిక్ తాలూకు మన విస్తృత దృష్టి కోణాని కి కేంద్ర స్థానం లో ఉంది. 2022వ సంవత్సరం లో ఆసియాన్-భారతదేశం సంబంధాల తాలూకు 30 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. భారతదేశం మరియు ఆసియాన్ లో అనేక సంభాషణ యంత్రాంగాలు ఏర్పాటయ్యాయి. అవి క్రమం తప్పక భేటీ అవుతున్నాయి. ఈ భేటీల లో, ఒక శిఖర సమ్మేళనం, మంత్రుల స్థాయి సమావేశాలు, సీనియర్ ఆఫీసర్స్ సమావేశాలు భాగం గా ఉన్నాయి. 2021 ఆగస్టు లో వర్చువల్ పద్ధతి లో నిర్వహించిన ఆసియాన్-భారతదేశం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశం లోను, ఇఎఎస్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం లోను డాక్టర్ ఎస్. జయ్ శంకర్ పాల్గొన్నారు. 2021 సెప్టెంబర్ లో వర్చువల్ పద్ధతి లో జరిగిన ఆసియాన్ ఆర్థిక మంత్రులు + భారతదేశం సంప్రదింపుల కు వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భం లో మంత్రులు ఆర్థిక సహకారాన్ని పటిష్ట పరచుకోవడం కోసం వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు.
ప్రధాన మంత్రి 2021 అక్టోబరు 27 న జరుగనున్న పదహారో తూర్పు ఆసియా శిఖర సమ్మేళనాని కి కూడా వర్చువల్ పద్ధతి లో హాజరు కానున్నారు. ఈస్ట్ ఏశియా సమిట్ అనేది ఇండో- పసిఫిక్ ప్రాంతం లో ఒక ప్రముఖ నేతల నాయకత్వం లోని ఒక వేదిక గా ఉన్నది. 2005 లో దీనిని స్థాపించినప్పటి నుంచి, ఇది తూర్పు ఆసియా తాలూకు వ్యూహాత్మకమైనటువంటి మరియు భూ- రాజకీయ పరిణామ క్రమం లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ను పోషించింది. పది ఆసియాన్ సభ్యత్వ దేశాల కు తోడు, ఈస్ట్ ఏశియా సమిట్ లో భారతదేశం, చైనా, జపాన్, కొరియా గణతంత్రం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకా రష్యా లు చేరి ఉన్నాయి.
ఈస్ట్ ఏశియా సమిట్ లో భారతదేశం వ్యవస్థాపక సభ్యత్వ దేశం కావడం వల్ల, ఈస్ట్ ఏశియా సమిట్ ను బలోపేతం చేయడం, సమకాలిక సవాళ్ళ ను పరిష్కరించడం కోసం దీనిని మరింత అధిక ప్రభావాన్ని చూపేది గా మలచడం కోసం కంకణం కట్టుకొంది. ఇది ఆసియాన్ అవుట్ లుక్ ఆన్ ఇండో-పసిఫిక్ ( ఎఒఐపి), ఇండో- పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్’ (ఐపిఒఐ) ల కలయికకు సంబంధించినటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఆచరణీయ సహకారాన్ని పెంపొందించడం కోసం ఒక ముఖ్యమైన వేదిక గా కూడా ఉంది. పదహారో తూర్పు ఆసియా శిఖర సమ్మేళనం లో నేత లు సముద్ర సంబంధి సురక్ష, ఉగ్రవాదం, కోవిడ్-19 నేపథ్యం లో పరస్పర సహకారం వంటి అంశాలు సహా ప్రాంతీయ ప్రాయోజనం ముడిపడిన అంశాల ను, అంతర్జాతీయ హితం తో కూడిన అంశాల ను చర్చించనున్నారు. నేత లు పర్యటన మరియు గ్రీన్ రికవరీ ల మాధ్యమం ద్వారా మానసిక ఆరోగ్యం, ఆర్థికం గా కోలుకోవడం అనే అంశాల పై భారతదేశం సహ ప్రాయోజికత్వాన్ని వహిస్తున్నప్రకటనల ను ఆమోదించగలదని ఆశించడం జరుగుతోంది.
***
(Release ID: 1766607)
Visitor Counter : 181
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia