సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డీడీ నేషనల్ చానెల్ కు భారీగా ప్రేక్షకులను పెంచిన నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
Posted On:
25 OCT 2021 4:00PM by PIB Hyderabad
అయోధ్య కి రామలీలా, రామాయణం ఆధారంగా తీసిన సినిమాలు, ఇతర నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు దూరదర్శన్ చానెల్లో భారీ విజయాన్ని సాధించాయి. వీటి కోసమే దూరదర్శన్ను చాలా మంది చూశారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల కారణంగా డీడీ నేషనల్‌లో వీక్షకుల సంఖ్య 421శాతం వరకు పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి దసరా మహోత్సవం & హారతి కార్యక్రమాలను రోజువారీగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. రామ్లీల, రామాయణ చిత్రాలు, రామ్ చరిత్ మానస్ వంటి ప్రత్యేక మతపరమైన కార్యక్రమాలు దూరదర్శన్‌లో వీక్షకుల సంఖ్యను విశేషంగా పెంచాయి. దూరదర్శన్ తో ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు ఎంత ప్రజాదరణ పొందాయో చూడండి!
ప్రేక్షకుల అంచనాలు
ప్రేక్షకుల అంచనాలలో మార్పు (శాతాల్లో)
తేదీ వ్యవధి(గంటలు) వీక్షణ రీచ్ గడిపిన సమయం
6 అక్టోబర్ 3 151శాతం 90శాతం 29శాతం
7 అక్టోబర్ 4.5 9శాతం 13శాతం 11శాతం
8 అక్టోబర్ 7.5 108శాతం 61శాతం 23శాతం
9 అక్టోబర్ 7.5 421శాతం 139శాతం 81శాతం
10 తేదీ అక్టోబర్ 7.5 120శాతం 94శాతం 34శాతం
11 అక్టోబర్ 7.5 170శాతం 86శాతం 48శాతం
12 అక్టోబర్ 7 238శాతం 113శాతం 58శాతం
13 అక్టోబర్ 7.5 162శాతం 92శాతం 41శాతం
14 అక్టోబర్ 8.5 237శాతం 136శాతం 55శాతం
15 అక్టోబర్ 6.5 123శాతం 116శాతం -7శాతం
మొత్తం 67 గంటలు
మూలం: బార్క్ ఇండియా 2+, హెచ్ఎస్ఎం. గత 12 వారాల (వారపు నిర్దిష్ట సగటు) నుండి 5 అక్టోబర్ 2021 వరకు పోలిక
నవరాత్రి సమయంలో ప్రత్యేక కార్యక్రమాల వల్ల గత వారాలతో పోలిస్తే దూరదర్శన్ వీక్షణ భారీగా పెరుగుతున్నది. కొన్ని రోజుల రీచ్ 139 శాతం వరకు ఉంది. దూరదర్శన్‌ని వీక్షించే వీక్షకుల సమయం కూడా ఈ కాలంలో ఎక్కువగానే ఉంది. పది రోజుల నవరాత్రి వేడుకల కోసం ప్రత్యేకంగా మొత్తం 67 గంటల ప్రత్యేక కార్యక్రమాలను డీడీ నేషనల్‌లో ప్రసారం చేశారు. రోజువారీగా సగటు 6.7 గంటలు.
కవరేజ్ సహా దూరదర్శన్‌తో నవరాత్రి ఉత్సవానికి మరో ముఖ్యమైన సంబంధం ఉంది. విజయవాడలోని కనక దుర్గాదేవికి కుంకుమ పూజ అలంకారం నుండి మొదలుకొని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఢిల్లీలోని ఝందేవాలన్ చత్తర్‌పూర్ మందిర్ హారతి, కోల్‌కతాలోని మహాలయ ఉత్సవాల వరకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి దూరదర్శన్‌లో నవరాత్రి కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.
(Release ID: 1766602)
Visitor Counter : 140