విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ వినియోగం ఎక్కువ చేయడానికి దేశంలో జరుగుతున్న ప్రయత్నాలకు ఊతం ఇచ్చే నిబంధనలకు రూపకల్పన
'' చట్టంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సకాలంలో ఖర్చులను తిరిగి పొందడానికి నిబంధనలు"'
"పునరుత్పాదక శక్తి వనరులు వినియోగించి ఉత్పత్తిని చేపట్టడానికి తప్పనిసరిగా నియమాలు అమలు చేయడం మరియు ఇతర అంశాల పరిష్కారానికి చర్యలకు రూపకల్పన ''
Posted On:
23 OCT 2021 10:31AM by PIB Hyderabad
పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ నియమ, నిబంధనలకు రూపకల్పన చేసింది. విద్యుత్ రంగంలో సుస్థిర అభివృద్ధిని సాధించి క్లీన్ ఎనర్జీ వినియోగం ఎక్కువ చేయడానికి తోడ్పడే విధంగా ఈ నిబంధనలను రూపొందించడం జరిగింది.
చట్టాలలో వస్తున్న మార్పులు, పునరుత్పాదక ఇంధన వినియోగం తగ్గడం లాంటి అంశాల వల్ల సకాలంలో ఖర్చులను తిరిగి పొందే అంశంలో ఎదురవుతున్న సమస్యల పట్ల పెట్టుబడిదారులు, విద్యుత్ రంగం తో సంబంధం ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించి విద్యుత్ వినియోగదారులు, సంబంధిత వర్గాల ప్రయోజనాలను రక్షించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టం 2003 కింద ఈ కింద నియమాలను ప్రకటించింది.
i) విద్యుత్ (చట్టంలో మార్పు కారణంగా సకాలంలో ఖర్చులను తిరిగి పొందడం ) నియమాలు, 2021.
ii) విద్యుత్ (తప్పనిసరిగా నిర్వహించడం మరియు ఇతర సమస్యలను పరిష్కరించడం ద్వారా పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించి ఉత్పత్తిని ప్రోత్సహించడం) నియమాలు, 2021.
విద్యుత్ రంగంలో పెట్టుబడులను భారీగా పెట్టవలసి ఉంటుంది. ఖర్చులను తిరిగి రాబట్టుకోవడం అనేది ఈ రంగంలో ప్రధాన అంశంగా మారింది. చట్టాలలో మార్పులు వచ్చినప్పుడు కూడా ఖర్చులను సకాలంలో తిరిగి పొందాలని పెట్టుబడిదారులు ఆశిస్తారు. చట్టాలలో మార్పులు వచ్చిన సమయంలో ఖర్చులను తిరిగి చెల్లించే అంశం ప్రభావితం అవుతోంది. చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం వల్ల విధ్యుత్ రంగంతో పాటు పెట్టుబడిదారులు సమస్యలను ఎదుర్కోవలసి వస్తున్నది. విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనల వల్ల సమస్యలు పరిష్కారం అయి ఈ రంగంలో పెట్టుబడులను ఎక్కువ చేస్తాయి.
ఇంధన రంగంలో ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంధన వినియోగంలో మార్పులు అమలు చేయడానికి భారతదేశంలో కూడా
ప్రయత్నాలు జరుగుతున్నాయి.పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గెగా వాట్లకు, 2030 నాటికి 450 గెగా వాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రభుత్వం రూపొందించిన నియమాలు లక్ష్యాలను చేరుకోవడానికి దోహద పడతాయి. దీని ద్వారా వినియోగదారులకు స్వచ్ఛమైన గ్రీన్ ఇంధనాన్ని సరఫరా చేయడానికి భవిష్య తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడానికి అవకాశం కలుగుతుంది.
చట్టాలలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని నెలవారీ టారిఫ్ లో చేయాల్సి ఉండే సర్దుబాట్లను మదింపు వేయడానికి ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది.
తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించవలసి ఉన్న ప్లాంట్లకు వాణిజ్య ఉపయోగాలు లేదా సరఫరా ప్రాధాన్యతల పేరిట సరఫరాను నియంత్రించడం లేదా కోత విధించడం చేయకూడదని ఈ నియమాలు పేర్కొన్నాయి. తప్పనిసరిగా పనిచేయాల్సి ఉన్న ప్లాంట్లలో ఉత్పత్తిని విద్యుత్ గ్రిడ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు లేదా భద్రతా కారణాల వల్ల మాత్రమే తగ్గించవచ్చు లేదా నియంత్రించవచ్చు. దేనికోసం ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్‌లోని నిబంధనలను అనుసరించాలి. తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ప్లాంట్లలో సరఫరా తగ్గించబడిన సందర్భంలో విద్యుత్ కొనుగోలు లేదా సరఫరా కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న ధరను ఇంధనాన్ని తీసుకోవడానికి అంగీకరించినవారు తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగిస్తూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న సంస్థలు తమ ఉత్పత్తిని మార్పిడి చేసుకుని ఖర్చును రాబట్టుకునే అధికారాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయాన్ని తిరిగి పొందడానికి ఉత్పత్తిదారునికి అవకాశం కలగడంతో పాటు గ్రిడ్ లో విధ్యుత్ లభ్యత ఉంటుంది.
పంపిణీ లైసెన్సులను పొంది ఉన్నవారి తరఫున మధ్యవర్తులు విద్యుత్తును కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఈ నియమాలు కల్పిస్తాయి. ' కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అధీకృత మధ్యవర్తిగా గుర్తింపు పొందిన సంస్థ కేంద్ర ప్రభుత్వం చట్టం లోని 63 సెక్షన్ లో పొందుపరచిన నిబంధనలకు అనుగుణంగా పారదర్శక విధానంలో వేలంలో పాల్గొని ఒకటి లేదా అంతకు మించిన పంపిణీ సంస్థలకు విద్యుత్తును కొనుగోలు చేయవచ్చును' అని నియమాలలో పేర్కొనడం జరిగింది.
***
(Release ID: 1766037)
Visitor Counter : 380