ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో 100 కోట్ల వ సంఖ్య ను చేరుకొన్న సందర్భంలో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

‘‘100 కోట్ల టీకా డోజు లు కేవలం ఒక సంఖ్య కాదు, అది దేశాని కి ఉన్న బలానికి అద్దంపడుతుంది’’

‘‘అది భారతదేశం సాధించిన విజయమే గాక, దేశం లో ప్రతి ఒక్కరి విజయం కూడాను’’

‘‘వ్యాధి ఎలాంటి వివక్ష ను చూపదు అనుకొంటే, అటువంటప్పుడు టీకా మందు ను ఇప్పించడం లో ఎలాంటి విచక్షణ ఉండ కూడదు.  అందువల్లే, టీకాకరణ కార్యక్రమం లో విఐపి లకు హక్కుఉండాలి అనే వాదాని ది పై చేయి కాకుండా చూడడమైంది’’

‘‘ప్రపంచం లో ఒక ఫార్మా హబ్ గా భారతదేశాని కి ఉన్న హోదా ను అంగీకరించే ధోరణిమరింత గా బలపడనుంది’’ 

‘‘మహమ్మారి కి వ్యతిరేకం గా దేశం జరుపుతున్న పోరాటం లో ప్రజలప్రాతినిధ్యాన్ని తొలి అంచె రక్షణ వ్యవస్థ గా ప్రభుత్వం మార్చి వేసింది’’

‘‘భారతదేశం లో టీకాకరణ కార్యక్రమమంతా కూడా విజ్ఞాన శాస్త్రం ద్వారా పుట్టి, విజ్ఞాన శాస్త్రం ద్వారా నడపబడుతూ, విజ్ఞాన శాస్త్రం ఆధారం గా సాగుతోంది’’

‘‘ప్రస్తుతం భారతదేశ కంపెనీల లోకి రికార్డు స్థాయి లో పెట్టుబడులు రావడమొక్కటేకాకుండా యువత కు కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తున్నాయి.  స్టార్ట్-అప్స్లో రికార్డు స్థాయి లో పెట్టుబడులు రావడం ద్వారా యూనికార్న్ లు ఎదుగుతూ ఉన్నాయి’’

‘‘స్వచ్ఛ్ భారత్ అభియాన్ అనేది ఒక సామూహిక ఉద్యమం గా మారిన విధం గానే, అదే తీరు లో భారతదేశం లో తయారైనవస్తువుల ను, భారతీయులు తయారు చేసిన వస్తువుల ను కొనుగోలు చేయడం, స్థానిక ఉత్పత్తుల కు మద్దతు ను ఇవ్వడంఅనే వైఖరి ని ఆచరణ లోకి తీసుకు రావలసి ఉన్నది’’

‘‘రక్షణ ఎంత బాగా ఉన్నప్పటికీ, కవచం ఎంత ఆధునికమైంది అయినప్పటికీ, కవచం పూర్తి రక్షణ తాలూకు హామీ ని ఇస్తూఉన్నప్పటికీ సమరం సాగుతూ ఉన్న వేళ ఆయుధాల ను విడువనే కూడదు.  అజాగ్రత గాఉండటానికి ఎలాంటి కారణమూ లేదు.  అతి ఎక్కువ ముందుజాగ్రతలను పాటిస్తూ మన పండుగల ను జరుపుకోండి’’

Posted On: 22 OCT 2021 11:36AM by PIB Hyderabad

వంద కోట్ల వ టీకా మందు ను ఇప్పించడాన్ని సాధించిన సందర్భం లో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

టీకామందు తాలూకు 100 కోట్ల డోజుల ను ఇప్పించేటటువంటి ఒక అసాధారణమైనటువంటి కార్యం ఎంతో కష్టమైన పని అంటూ ప్రధాన మంత్రి పొగడారు. ఈ కార్య సాధన 130 కోట్ల మంది దేశ ప్రజల సమర్పణ భావానిదే అని ఆయన పేర్కొన్నారు. ఈ సఫలత భారతదేశం సఫలత; ఇది భారతదేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సఫలత అని ఆయన అన్నారు. 100 కోట్ల టీకామందు డోజుల ను ఇప్పించడం అంటే అది కేవలం ఒక సంఖ్య కాదు, అది దేశాని కి ఉన్న బలాని కి అద్దం పడుతోంది, అంతేకాదు అది చరిత్ర లో ఒక కొత్త అధ్యాయాన్ని సృజించడం కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది కఠినమైన లక్ష్యాల ను పెట్టుకొనేటటువంటి, ఆ లక్ష్యాల ను ఏ విధం గా సాధించాలో తెలిసినటువంటి ఒక న్యూ ఇండియాయొక్క చిత్రం అని ఆయన అన్నారు.

ప్రస్తుతం భారతదేశం అమలుపరుస్తున్న టీకాకరణ కార్యక్రమాన్ని చాలా మంది ప్రపంచం లోని ఇతర దేశాల తో పోలుస్తున్నారు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం ఎంతటి వేగం తో 100 కోట్ల వ స్థానాన్ని మించిపోయిందో, ఆ విషయాన్ని సైతం ప్రశంసించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఏమైనా, ఈ విశ్లేషణ క్రమం లో ఒక విషయాన్ని మరచిపోతున్నారు. అది భారతదేశం ఈ పని ని ఎక్కడ నుంచి మొదలుపెట్టింది అనేదేనని ఆయన అన్నారు. టీకామందుల ను గురించిన పరిశోధనల ను జరపడం లో, టీకా మందుల ను అభివృద్ధి పరచడం లో అభివృద్ధి చెందిన దేశాల కు దశాబ్దాల అనుభవం ఉంది, భారతదేశం ఆ దేశాలు తయారు చేసిన టీకా మందుల పైనే ఎక్కువ గా ఆదారపడుతూ వచ్చింది అని ఆయన వివరించారు. ఒక శతాబ్ద కాలం లో అత్యంత పెద్దది అయినటువంటి మహమ్మారి తల ఎత్తినప్పుడు, ఈ కారణం గానే మరి విశ్వమారి తో పోరాడటం లో భారతదేశాని కి ఉన్న స్థోమత విషయం లో వేరు వేరు ప్రశ్నలు ఉదయించాయి అని ఆయన అన్నారు. ఇతర దేశాల నుంచి అన్ని టీకాల ను కొనడానికి అవసరమైన డబ్బు ను భారతదేశం ఎక్కడ నుంచి పోగేసుకొంటుంది ?, టీకామందు భారతదేశాని కి ఎప్పటి కి అందుతుంది ?, భారతదేశ ప్రజలకు అసలు టీకా మందు దొరుకుతుందో, దొరకదో ? మహమ్మారి ప్రబలడాన్ని అడ్డుకోవడం కోసం భారతదేశం తగినంత మంది ప్రజల కు టీకామందు ను వేయించ గలుగుతుందా ? .. ఇటువంటి ప్రశ్నల కు 100 కోట్ల డోజుల టీకామందు ను ఇప్పించినటువంటి ఈ ఘనమైన కార్యాన్ని నెరవేర్చడం ద్వారా సమాధానాన్ని ఇవ్వడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం తన పౌరుల కు 100 కోట్ల టీకామందు డోజుల ను వేయించడం ఒక్కటే కాకుండా ఎటువంటి ఖర్చు లేకుండా- ఉచితం గా- ఆ పని ని నెరవేర్చింది అని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం లో ఒక ఫార్మా హబ్ గా భారతదేశాని కి ఉన్న హోదా కు గల ఆమోద ముద్ర ఇక మీదట మరింత బలపడనుంది అని ఆయన అన్నారు.

కరోనా మహమ్మారి అడుగు పెట్టిన వేళ లో భారతదేశం వంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఈ మహమ్మారి తో పోరాడటం చాలా కష్టం అనే వ్యాకులత ప్రజల లో నెలకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంత పెద్ద ఎత్తున సంయమనాన్ని పాటించడం తో పాటు అంతటి క్రమశిక్షణ ఇక్కడ అయ్యే పనేనా ? అనేటటువంటి ప్రశ్నలు కూడా రేకెత్తాయి అని ఆయన అన్నారు. కానీ, మన విషయం లో, ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ని కలుపుకొని ముందుకు పోవడం - ‘సబ్ కా సాథ్’- అని ఆయన చెప్పారు. అందరికీ టీకామందు, ఉచితం గా టీకా మందుఅనే ఉద్యమాన్ని దేశం మొదలుపెట్టింది. పేదల కు, దళితుల కు, పల్లెవాసుల కు, పట్టణ ప్రాంతాల ప్రజల కు అందరికీ టీకామందు ను ఇవ్వడమైంది అని ఆయన వివరించారు. వ్యాధి కి వివక్ష అనేది ఏదీ లేనప్పుడు, టీకాకరణ లో కూడాను ఎలాంటి విచక్షణ ఉండ రాదు అనేదే దేశం ఎదుట నిలచిన ఒక మంత్రం గా ఉండింది అని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ కారణం గానే టీకా ను పొందేందుకు విఐపి లకు హక్కు ఉంది అనే వాదం టీకాకరణ కార్యక్రమాన్ని కమ్మివేయకుండా చూడడం జరిగింది అని ఆయన తెలిపారు.

భారతదేశం లో చాలా మంది ప్రజలు టీకా మందు ను వేయించుకోవడం కోసం వ్యాక్సీనేషన్ సెంటర్ కు వెళ్ళరు సుమా అనే తరహా ప్రశ్నలు ఉదయించాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లో అభివృద్ధి చెందిన అనేక ప్రముఖ దేశాల లో ఇవాళ్టి కి కూడా వ్యాక్సీన్ ను వేయించుకోలా, వేయించుకో వద్దా? అనేటటువంటి ఊగిసలాట కొనసాగుతోంది. అయితే భారతదేశ ప్రజలు 100 కోట్ల టీకా మందు డోజుల ను వేయించుకోవడం ద్వారా దీనికి జవాబు చెప్పారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి ప్రయాస గా ఉంది’, మరి ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు ప్రయత్నా లను జోడించామూ అంటే అప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే రీతి లో ఫలితాలు సిద్దించాయి అని ఆయన అన్నారు. మహమ్మారి కి వ్యతిరేకం గా దేశం సలుపుతున్న పోరాటం లో ప్రజలు పాలుపంచుకోవడాన్ని ఒకటో అంచె రక్షణ వ్యవస్థ వలె ప్రభుత్వం తీర్చి దిద్దింది అని ఆయన అన్నారు.

భారతదేశం లో యావత్తు టీకాకరణ కార్యక్రమం విజ్ఞాన శాస్త్రం పొత్తిళ్ళ లో ప్రాణం పోసుకొంది. అది విజ్ఞాన శాస్త్ర సంబంధి క్షేత్రాల లో ఎదిగింది. చివరకు విజ్ఞాన శాస్త్ర పరమైన పద్ధతుల ద్వారా నలు దిక్కుల కు పయనించింది అని ప్రధాన మంత్రి అన్నారు. టీకామందు తయారు కావడాని కంటే ముందు, మరి టీకా మందు ను ఇప్పించేటంత వరకు.. ఈ యావత్తు కార్యక్రమం ఒక శాస్త్రీయమైనటువంటి దృష్టి కోణం పైన ఆధారపడింది అని ఆయన అన్నారు. ఉత్పత్తి ని పెంచవలసిన అవసరం అనేది కూడా ఒక సవాలు వలె పరిణమించింది. అటు తరువాత, వేరు వేరు రాష్ట్రాల కు వ్యాక్సీన్ లను పంపిణీ చేయడం, సుదూర ప్రాంతాల కు వ్యాక్సీన్ లను సకాలం లో చేరవేయడం అనే సవాళ్ళు ఎదురయ్యాయి. అయితే, శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా, కొత్త ఆవిష్కరణ ల ద్వారా దేశం ఈ సవాళ్ళ కు పరిష్కారాల ను కనుగొంది. వనరుల ను అసాధారణమైనటువంటి వేగం తో పెంచడమైంది. లోనే రూపొందించిన కోవిన్ (Cowin) ప్లాట్ ఫార్మ్ సామాన్య ప్రజల కు సౌకర్యవంతం గా ఉండటం మాత్రమే కాకుండా మన వైద్య చికిత్స సిబ్బంది కి వారి కర్తవ్యాన్ని సులభతరం గా కూడా మార్చి వేసింది అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం ఆర్థిక వ్యవస్థ పట్ల దేశ విదేశాల కు చెందిన నిపుణులు, అనేక సంస్థ లు చాలా సకారాత్మకంగా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం లో కంపెనీల లోకి రికార్డు స్థాయి లో పెట్టుబడులు వస్తూ ఉండడం మాత్రమే కాకుండా యువతీ యువకుల కోసం కొత్త గా ఉపాధి అవకాశాలు కూడా అందివస్తున్నాయి అని ఆయన అన్నారు. స్టార్ట్-అప్స్ లో రికార్డు స్థాయి లో పెట్టుబడి రావడం వల్ల యూనికార్న్ లు ఎదుగుతున్నాయన్నారు. కొత్త ఉత్సాహం అనేది గృహ నిర్మాణ రంగం లో కూడా కనిపిస్తోంది, గత కొద్ది నెలలు గా చేపట్టిన అనేక సంస్కరణ లు, కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగం గా వృద్ధి చెందడం లో ఒక ప్రధాన పాత్ర ను పోషించగలుగుతాయి అని ఆయన అన్నారు. మహమ్మారి కాలం లో వ్యావసాయక రంగం మన ఆర్థిక వ్యవస్థ ను బలం గా ఉంచింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఆహార ధాన్యాల సేకరణ ఒక రికార్డు స్థాయి లో జరుగుతోందన్నారు. డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల లోకి చేరుతోంది అని తెలిపారు.

భారతదేశం లో తయారైనటువంటి, భారతదేశం లో నివసించే వ్యక్తుల కఠోర శ్రమ ద్వారా రూపుదిద్దుకొన్నటువంటి ప్రతి చిన్న వస్తువు ను ప్రజలు కొనుగోలు చేయాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. మరి ఇది ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తేనే సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ఒక సామూహిక ఉద్యమం గా రూపుదాల్చినట్టుగానే, భారతదేశం లో తయారైన వస్తువుల ను కొనుగోలు చేయడం, భారతీయులు తయారు చేసిన వస్తువుల ను కొనుగోలు చేయడం, స్థానికం గా తయారైన వస్తువుల కు మద్ధతు ను ఇవ్వడం (వోకల్ ఫార్ లోకల్) అనేవాటిని ఆచరణ లో పెట్టాలి అని ఆయన సూచించారు.

పెద్ద లక్ష్యాల ను ఏ విధం గా నిర్దేశించుకోవాలో, వాటిని ఎలా సాధించాలో దేశాని కి తెలుసు అని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, దీని కోసం, మనం నిరంతరం జాగ్రత్త వహించడం అవసరం అని ఆయన చెప్పారు. రక్షణ ఎంత బాగా ఉన్నప్పటికీ, కవచం ఎంత ఆధునికమైంది అయినప్పటికీ, రక్షణ కు పూర్తి హామీ ని కవచం ఇస్తూ ఉన్నప్పటికీ, అప్పుడు కూడాను సమరం సాగుతూ ఉండగా ఆయుధాల ను వదలి వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. అదే మాదిరి గా అజాగ్రత వహించడానికి ఎటువంటి కారణమూ లేనే లేదని ఆయన అన్నారు. మన పండుగల ను అత్యంత జాగ్రత తో జరుపుకోవలసింది గా ప్రజల ను ఆయన అభ్యర్ధించారు.

***

DS/AK(Release ID: 1765817) Visitor Counter : 102