ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంటర్‌నెట్ గవర్నెన్స్ కు సంబంధించిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి నవంబర్ 2021 లో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం సమావేశాలను నిర్వహిస్తారు


జాతీయ అంతర్జాతీయ ఫోరమ్‌లలో ఇంటర్నెట్ వినియోగదారుల గొంతు ప్రతిధ్వనించాలి: ఐఐజీఎఫ్ సన్నాహక కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్



ఇంటర్నెట్ దాని వాటాదారులకు బహిరంగంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా, జవాబుదారీగా ఉండాలి: రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 21 OCT 2021 4:28PM by PIB Hyderabad

ఇండియా డిజిటలైజేషన్ కోసం మార్గదర్శక ప్రణాళిక (రోడ్‌మ్యాప్‌)పై చర్చలతో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐఐజీఎఫ్) సన్నాహక కార్యక్రమం ముగిసింది.  ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐఐజీఎఫ్) సమావేశాలకు సన్నద్ధం కావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, నిక్సీ మల్టీస్టాక్హోల్డర్ గ్రూప్ సంయుక్తంగా వచ్చే నెల 8 నుంచి 11 తేదీల మధ్య నిర్వహిస్తాయి.   ఇంటర్నెట్ శక్తి ద్వారా  భారతదేశంలో డిజిటలైజేషన్ మార్గంలో ప్రగతి సాధించలిగే దిశగా చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది.   ఇండియా & ఇంటర్నెట్- ఇండియాస్ డిజిటల్ జర్నీ, గ్లోబల్ రోల్, ఈక్విటీ, యాక్సెస్ & క్వాలిటీ-, అందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్,  ఇంటర్నెట్ గవర్నెన్స్‌లో సైబర్ నార్మ్స్,  ఎథిక్స్ వంటి ముఖ్యమైన విషయాలపై మూడు సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తారు. యూఎన్- ఆధారిత ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్)  ట్యునిస్ ఎజెండాలోని ఐజీఎఫ్- పేరా 72 కి అనుగుణంగా ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం (ఐఐజీఎఫ్) ఏర్పాటు చేయడమైనది. బహిరంగంగా  సమగ్ర ప్రక్రియ ద్వారా, ఐఐజీఎఫ్ గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఎకోసిస్టమ్‌లో ప్రభుత్వం, పరిశ్రమ, పౌర సమాజం, విద్యాసంస్థలు సహా అందరినీ  ఇంటర్నెట్ గవర్నెన్స్ పై చర్చలో సమాన భాగస్వాములుగా చేస్తుంది.

 

ఈ సన్నాహక కార్యక్రమం  లక్ష్యం డిజిటలైజేషన్‌కి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చించడంతోపాటు అన్ని విషయాలనూ వివరించడం.  అంతర్జాతీయ విధాన అభివృద్ధిలో ఇంటర్నేషనల్ గవర్నెన్స్‌ పాత్ర  ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తుంది.  దీనివల్ల ప్రపంచ వేదికపై భారతదేశం ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారుతుంది.  కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్ దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  యూఏఎస్జీ చైర్మన్ డాక్టర్ అజయ్, సీడీఈపీ ప్రెసిడెంట్ డాక్టర్ జల్జిత్ భట్టాచార్య, సీసీఏఓఐ డైరెక్టర్ అమృతా చౌదరి, ఎన్ఐఎక్స్ఐ సీఈఓ డాక్టర్  అనిల్ కుమార్ జైన్ హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఇంటర్నెట్ పరిణామ చరిత్రలో కీలకమైన సమయంలో ఐఐజీఎఫ్ జరుగుతోంది. మనం కరోనా నుండి బయటపడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, పాలనల పునరుద్ధరణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిజిటలైజేషన్ రేటు విపరీతంగా పెరిగింది.  వేగవంతమైంది కూడా” అని ఆయన వివరించారు.

సాంకేతిక పరిజ్ఞానం వైపు ప్రయాణం ద్వారా అందుతున్న భారీ అవకాశాల గురించి  రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ “ప్రస్తుతం మన దగ్గర 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. భారతదేశాన్ని అతిపెద్ద అనుసంధాన దేశంగా మార్చారు. మా ప్రభుత్వం 120 కోట్ల ప్రజలకు కనెక్టివిటీ అందించడానికి కట్టుబడి ఉంది. ఇప్పటికీ   దాదాపు 40 కోట్ల మందికి నెట్వర్క్ అందుబాటులో లేదు.  ఇంటర్నెట్ శక్తి అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. మేము డిజిటల్ అంతరాలను తొలగిస్తాం " అని విశదీకరించారు.

 

ఇంటర్నెట్ గవర్నెన్స్ ను మరింత విస్తరించడంపై మాట్లాడుతూ “అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనే భావనను బలపరుస్తున్నందుకు గర్విస్తాను.  ప్రధాన మంత్రి నేతృత్వంలోని మా ప్రభుత్వం, సమ్మిళిత భాగస్వామ్యంతో నడిచే పాలనా విధానాన్ని విశ్వసిస్తుంది. ఇక్కడ అతిపెద్ద వాటాదారులు ఇంటర్నెట్ వినియోగదారులు కాబట్టి ఇంటర్నెట్ వినియోగదారుల స్వరం జాతీయ,  అంతర్జాతీయ ఫోరమ్‌లలో ప్రతిధ్వనించడం ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ప్రమాణాలు  సాంకేతికతలను ఈ పబ్లిక్ ఫోరమ్‌ నిర్ణయిస్తుంది. మాది ప్రపంచంలోని అతిపెద్ద అనుసంధాన దేశమే అయినప్పటికీ, ఇందులో మా పాత్ర తక్కువగా ఉంది”అని ఆయన అన్నారు.  ఇంటర్నెట్ వాడకందారులు తప్పనిసరిగా కలిసి ఉండాలని,  ఇంటర్నెట్ ఎలా ఉండాలో చర్చించుకోవాలని సూచించారు.  వాటాదారులు ఏం కోరుకుంటారనేదే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ ఓపెన్‌గా, సురక్షితంగా  విశ్వసనీయమైనదిగా ఉండాలని, దాని వాటాదారులకు జవాబుదారీగా ఉండాలని రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

 

ఐఐజిఎఫ్ చైర్పర్సన్  అనిల్ కుమార్ జైన్ మాట్లాడుతూ, "భారతదేశంలో అతిపెద్ద ఇంటర్నెట్ జనాభా ఉంది. అధిక  జనాభా వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి. విధాన చట్రం రూపకల్పన,  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ఆవిర్భావంలో  ప్రైవేట్ కంపెనీల పాత్ర ఉత్తేజకరమైనది. డిజిటల్ ఎకానమీ  పరిణామానికి ఇదే సమయం. ఆర్థిక వృద్ధి కోసం ఇంటర్నెట్ శక్తిని ఉపయోగించుకోవడంలో వాటాదారులందరినీ కలుపుకోవాలి. ఈ విషయంలో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఒక అడుగు ముందుంటుంది”అని అన్నారు.

 యూఏఎస్జీ చైర్మన్ డాక్టర్ అజయ్ డేతా మాట్లాడుతూ “భారతదేశంలో మనకు 19,000 మాండలికాలు, 121 భాషలు  22 అధికారిక భాషలు ఉన్నాయి. భారతీయ పౌరులకు తమకు నచ్చిన డొమైన్ పేరు దొరకాలి. సార్వత్రిక ఆమోదం కలిగిన అన్ని డొమైన్ పేర్లను అంగీకరించాలి. ప్రపంచంలో 11 శాతం ఈ–మెయిల్ సర్వర్లు మాత్రమే హిందీకి మద్దతు ఇస్తాయి. మనకు నచ్చిన భాషలో కంటెంట్‌ని వినియోగించగలగాలి. ఐఐజీఎఫ్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఇందులో  ఎక్కువ మంది ప్రజలు పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము. ఇది మేము ఇప్పుడే ప్రారంభించిన ప్రయాణం. ఇది ముగింపు కాదు.  ఇలాంటి మరిన్ని చర్చలు జరగాలని మేము ఆశిస్తున్నాం”అని ఆయన వివరించారు.

 ఐఐజీఎఫ్ గురించి

 

ఇండియా ఇంటర్నెట్ గవర్నమెంట్ ఫోరం యూఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (యూఎన్-ఐజీఎఫ్) తో ముడిపడి ఉన్న ఒక కార్యక్రమం. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్)  బహుళ-వాటాదారుల వేదిక. ఇది ఇంటర్నెట్‌కు సంబంధించిన ప్రజా విధాన సమస్యలపై చర్చించడానికి వివిధ వర్గాల నుండి ప్రతినిధులను కలిసి తీసుకువస్తుంది.

 

https://www.indiaigf.in

***


(Release ID: 1765659) Visitor Counter : 199