సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వంద కోట్ల టీకాలు వేసిన ఘనతను సాధించిన సందర్భంగా, 100 స్మారక చిహ్నాలను త్రివర్ణ శోభితంగా విద్యుత్ దీపాలతో ప్రకాశవంతం చేసిన - భారత పురావస్తు శాఖ

Posted On: 21 OCT 2021 5:27PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు :

 

*          టీకాలు వేసిన సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అనుబంధ వైద్య సిబ్బంది, సహాయక కార్మికులు, పోలీసు సిబ్బంది వంటి  కరోనా యోధుల పట్ల కృతజ్ఞతా వ్యక్తీకరణగా - స్మారక చిహ్నలను ప్రకాశవంతం చేయడం. 

*          త్రివర్ణ శోభితంగా ప్రకాశవంతం చేసిన వంద స్మారక చిహ్నాలలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగవంతంగా టీకాలు వేసే కార్యక్రమాల్లో ఒకటిగా, భారతదేశం వంద కోట్ల కోవిడ్ టీకాలు వేసిన ఘనతను సాధించిన సందర్భంగా,  కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు శాఖ, దేశవ్యాప్తంగా వంద స్మారక చిహ్నాలను త్రివర్ణ శోభితం గా విద్యుత్ దీపాలతో అలంకరిస్తోంది.  కోవిడ్ మహమ్మారి కి వ్యతిరేకంగా పోరాటంలో నిర్విరామ కృషి చేసి, సహకరించిన, కరోనా యోధుల పట్ల గౌరవం మరియు కృతజ్ఞతగా,  స్మారక చిహ్నలను ప్రకాశవంతం చేసే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 

హుమాయూన్ సమాధి

యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన - ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్ సమాధి, కుతుబ్ మినార్; ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ;  ఒడిశాలోని కోణార్క్ ఆలయం; తమిళనాడులోని మామల్లపురం రథ దేవాలయాలు; గోవాలోని సెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి చర్చి; ఖజురహో; చిత్తూరు కోటలు; రాజస్థాన్‌ లోని కుంభల్‌ గఢ్; బీహార్‌ లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం త్రవ్వకాలలో బయల్పడ్డ శిథిలాలు; ఇటీవల ప్రపంచ వారసత్వ హోదా లభించిన గుజరాత్‌ లోని ధోలవీర లతో సహా వంద స్మారక చిహ్నాలను త్రివర్ణ శోభితంగా, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. 

 

సూర్య దేవాలయం, కోణార్క్

 

 

 

ఎర్ర కోట

మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొవడంలో దేశానికి సహాయపడటానికి తమ కర్తవ్యాని కి మించి కృషి చేసిన - టీకాలు వేసిన సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అనుబంధ వైద్య సిబ్బంది, సహాయక కార్మికులు, పోలీసు సిబ్బంది వంటి  కరోనా యోధులు, మానవజాతికి  చేసిన నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికీ, అదేవిధంగా, భారతదేశం వంద కోట్ల టీకాలు వేసిన ఘనతను సాధించిన సందర్భంగా, వంద స్మారక చిహ్నాలు 2021 అక్టోబర్, 21 రాత్రి త్రివర్ణ శోభితంగా ప్రకాశిస్తూ ఉంటాయి. 

ఖజురహో

వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో, మూడవ దశ రాకుండా నిరోధించడంలో, టీకాలు వేసే కార్యక్రమం ముఖ్యమైన పాత్ర పోషించింది. అదేవిధంగా,  వంద కోట్ల కోవిడ్ టీకా మోతాదులను వేయడం ద్వారా చైనాతో పాటు బిలియన్ మోతాదులు వేసిన జాబితాలో చేరిన ఏకైక దేశం గా భారత్ అవతరించింది. 

ప్రకాశవంతంగా చేయడం కోసం గుర్తించిన వంద స్మారక చిహ్నాల జాబితాను చూడటానికి దయచేసి ఇక్కడ నొక్కండి. 

 

 

*****


(Release ID: 1765656) Visitor Counter : 191