ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


‘‘ప్రపంచవ్యాప్తం గా బౌద్ధ సమాజం యొక్క  భక్తి కికుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక నివాళి గా ఉంది’’

‘‘ఉత్తమమైన సంధానం ద్వారా, భక్తుల కుసౌకర్యాల కల్పన ద్వారా భగవాన్ బుద్ధుని తో అనుబంధం కలిగిన ప్రదేశాల ను అభివృద్ధిచేయడం పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతోంది’’

‘‘ఉడాన్ పథకం లో భాగం గా 900కు పైగా కొత్త మార్గాల కు ఆమోదం తెలపడమైంది;  350 మార్గాలు ఇప్పటికే పని చేయడంప్రారంభించాయి.  50 కి పైగా కొత్త విమానాశ్రయాల ను లేదా ఇదివరకు సేవల ను అందించకుండా ఉన్నటువంటివిమానాశ్రయాల ను పని చేయించడమైంది’’

‘‘ఉత్తర్ ప్రదేశ్ లో కుశీనగర్విమానాశ్రయం కంటే ముందుగా 8 విమానాశ్రయాలు ఈ సరికే కార్యకలాపాలు జరుపుతూ ఉన్నాయి.  లఖ్ నవూ, వారాణసీ, ఇంకా కుశీనగర్ ల తరువాత జేవర్అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కొనసాగుతూ ఉన్నాయి; అదీ కాక, అయోధ్య , అలీగఢ్, ఆజమ్ గఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రావస్తి లలో ఎయర్ పోర్ట్ ప్రాజెక్టు లపనులు జరుగుతున్నాయి’’

‘‘ఎయర్ ఇండియా పై తీసుకొన్న నిర్ణయంభారతదేశ విమానయాన రంగాని కి కొత్త శక్తి ని ఇస్తుంది’’

‘‘ఇటీవలే ప్రవేశపెట్టిన డ్రోన్ పాలిసీ -వ్యవసాయ రంగం మొదలుకొని ఆరోగ్య రంగం వరకు, వైపరీత్యాల నిర్వహణ మొదలుకొని రక్షణ రంగం వరకు.. ఈ విధం గా అనేక రంగాల లోవిశిష్టమైనటువంటి పరివర్తన ను తీసుకు రానుంది’’

Posted On: 20 OCT 2021 11:24AM by PIB Hyderabad

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నటువంటి బౌద్ధ ధర్మ సమాజాని కి కేంద్ర స్థానం లో భారతదేశం ఉందన్నారు. ఈ రోజు న ప్రారంభమైన కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం బౌద్ధ భక్తజనానికి ఒక పుష్పాంజలి వంటిది అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాంతం భగవాన్ బుద్ధుని కి జ్ఞానోదయం ప్రాప్తించిన నాటి నుంచి ఆయన మహాపరినిర్వాణం చెందినంత వరకు .. ఈ యావత్తు ప్రస్థానాని కి ఒక సాక్షి గా నిలచింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతటి ముఖ్యమైన ప్రాంతం ఈ రోజు న మిగతా ప్రపంచం తో నేరుగా జతపడింది అని ఆయన అన్నారు.

 

భగవాన్ బుద్ధుని తో అనుబంధం కలిగిన ప్రాంతాల ను అభివృద్ధి పరచే విషయం లో ఉత్తమమైనటువంటి సంధానం ద్వారా, భక్త జనుల కోసం సదుపాయాల కల్పన ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. శ్రీ లంక నుంచి వచ్చిన విమానాన్ని, ప్రతినిధివర్గాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. మహర్షి వాల్మీకి జయంతి దినం అయినటువంటి ఈ రోజు న మహర్షి వాల్మీకి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటిస్తూ, దేశం ‘సబ్ కా సాథ్’ మరియు సబ్ కా ప్రయాస్’ ల అండదండల తో ‘సబ్ కా వికాస్’ మార్గం లో పయనిస్తోందన్నారు. ‘‘కుశీనగర్ ను అభివృద్ధి పరచడం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క కీలక ప్రాథమ్యాల లో ఒకటిగా ఉంది’’ అని ఆయన అన్నారు.

 

పర్యటన రంగాని కి- దాని అన్ని రూపాల లోను- అది ధర్మం కోసం అయినా గాని, లేదా తీరిక కోసం అయినా గాని రైలు, రహదారి, వాయు మార్గాలు, జల మార్గాలు, హోటళ్ళు, ఆసుపత్రులు, ఇంటర్ నెట్ కనెక్టివిటి, పరిశుద్ధత, మురుగు నీటి నిర్వహణ మరియు నవీకరణ యోగ్య శక్తి ల వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఎంతైనా అవసరపడుతాయి అని, వాటితో ఒక స్వచ్ఛమైనటువంటి పర్యావరణానికి పూచీపడటం రంగానికి ఆవశ్యకమని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇవి అన్నీ కూడా ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. మరి వీటన్నింటిపైన ఏక కాలం లో పనిచేయడం ముఖ్యం. నేటి 21వ శతాబ్దపు భారతదేశం ఈ వైఖరి తోనే ముందుకు కదులుతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘ఉడాన్’ పథకం లో భాగం గా గత కొన్ని సంవత్సరాల లో 900 కు పైగా కొత్త మార్గాల కు ఆమోదం తెలపడం జరిగింది, వాటిలో 350 కి పైగా మార్గాల లో వాయు సేవ ఈ సరికే ఆరంభం అయింది అని ప్రధాన మంత్రి ప్రకటించారు. 50 కి పైగా కొత్త విమానాశ్రయాలు గాని, లేదా ఇదివరకు సేవలను అందించకుండా ఉండిపోయినవి గాని .. అటువంటి వాటిని పని చేయించడం జరిగింది అని ఆయన వివరించారు.

 

ఉత్తర్ ప్రదేశ్ లో విమానయాన రంగం తాలూకు అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. రాష్ట్రం లో వాయు మార్గ సంధానం నిరంతరం గా మెరుగు పడుతోందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కుశీనగర్ విమానాశ్రయం కంటే ముందుగా 8 విమానాశ్రయాలు పని చేస్తున్నాయి అని ఆయన తెలిపారు. లఖ్ నవూ, వారాణసీ, ఇంకా కుశీనగర్ ల తరువాత జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పురోగమిస్తూ ఉన్నాయన్నారు. దీనికి అదనం గా అయోధ్య, అలీగఢ్, ఆజమ్ గఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, ఇంకా శ్రావస్తి లలో ఎయర్ పోర్ట్ ప్రాజెక్టు లు అమలవుతూ ఉన్నాయని వివరించారు.

 

‘ఎయర్ ఇండియా’ పై ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ చర్య దేశ విమానయాన రంగాన్ని వృత్తిపరమైన నైపుణ్యం తో నడపడం లో, అలాగే సౌకర్యానికి, సురక్షత కు పెద్దపీట వేయడం లో సహాయకారి కాగలదన్నారు. ‘‘ఈ నిర్ణయం భారతదేశం లో విమానయాన రంగాని కి కొత్త శక్తి ని అందిస్తుంది. అటువంటి ఒక ప్రధానమైన సంస్కరణే రక్షణ సంబంధిత ఎయర్ స్పేస్ ను పౌర వినియోగాని కి అనుమతించడం అని ఆయన అన్నారు. ఈ చర్య వేరు వేరు వాయు మార్గాల లో దూరాన్ని తగ్గిస్తుంది అని ఆయన చెప్పారు. ఇటీవలే ప్రవేశపెట్టిన డ్రోన్ పాలిసి వ్యవసాయం మొదలుకొని ఆరోగ్యం వరకు, విపత్తు నిర్వహణ మొదలుకొని రక్షణ వరకు చూస్తే, వివిధ రంగాల లో పెనుమార్పుల ను తీసుకు వస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఇటీవల ప్రారంభించిన ‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్’ వల్ల పాలన ఎలాగూ మెరుగు పడుతుంది; అంతే కాకుండా రహదారి, రైలు, వాయు మార్గం ల వంటి అన్ని విధాలైన రవాణా సాధనాలు ఒకదానిని మరొకటి సమర్ధించుకొంటూ ఉండేటట్టుగా, ఒక రంగం మరొక రంగం యొక్క సామర్ధ్యాన్ని పెంచేది గా పూచీపడుతుంది కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 


(Release ID: 1765110) Visitor Counter : 186