ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

99.12 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


98.15 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 14,623 కొత్త కేసులు నమోదు

క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098; 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి

వారపు పాజిటివిటీ రేటు (1.34 శాతం) గత 117 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 20 OCT 2021 10:00AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 99.12 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 41,36,142 డోసులతో కలిపి, 99.12 కోట్ల డోసులను (99,12,82,283) టీకా కార్యక్రమం అధిగమించింది. 97,99,506 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,76,101

రెండో డోసు

90,98,715

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,62,683

రెండో డోసు

1,55,81,720

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

39,73,05,720

రెండో డోసు

11,57,29,771

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,88,22,731

రెండో డోసు

8,76,73,217

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,62,77,396

రెండో డోసు

6,20,54,229

మొత్తం

99,12,82,283

 

గత 24 గంటల్లో 19,446 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,34,78,247 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.15 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 115వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 14,623 కొత్త కేసులు నమోదయ్యాయి.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,78,098 గా ఉన్నాయి. ఇది 229 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.52 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 13,23,702 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 59.44 కోట్లకు పైగా (59,44,29,890) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. గత 117 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.10 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 51 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 134 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

 

****



(Release ID: 1765108) Visitor Counter : 156