ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఫ్యూచర్ టెక్ 2021 అన్న ఇతివృత్తంతో జరిగిన డిజిటల్ సాంకేతిక ప్రదర్శన అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌లో అగ్రగామిగా ఉండాలనే జాతీయ లక్ష్యంలో భాగంగా భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుందిః రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
19 OCT 2021 4:49PM by PIB Hyderabad
సిఐఐ నిర్వహించిన ఫ్యూచర్ టెక్ 2021 పేరి నిర్వహించిన డిజిటల్ సాంకేతికతల ప్రదర్శన, అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సెషన్‌కు ఎలక్ట్రానిక్స్ & ఐటి మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 19-27, 2021వరకు జరుగనుంది. ఈ కార్యక్రమం వ్యూహం, అభివృద్ధి, స్థితిస్థాపకత/ బలం, కలుపుకుపోవడం, విశ్వాసం అన్న 5 ఇతివృత్తాలతో కూడిన డ్రైవింగ్ టెక్నాలజీస్ ఫర్ బిల్డింగ్ ది ఫ్యూచర్, వియ్ ఆల్ కెన్ ట్రస్ట్ (భవిష్యత్తును నిర్మించేందుకు మనం విశ్వసించదగిన అత్యాధునిక సాంకేతికలు) అన్న అంశంపై కేంద్రీకృతమై జరుగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సు వివిధ వాణిజ్యవేత్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలతో కూడి ఉంటూ, డిజిటల్ సాంకేతికతల అనువర్తింపుపై చర్చకు వేదికను అందిస్తుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ మహమ్మారి ప్రభావం గురించి తన ప్రారంభోపన్యాసంలో రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. గత ఆరు సంవత్సరాలలో ఆర్ధిక వ్యవస్థను, ఆ వ్యవస్థలోని ప్రజా సేవలను డిజిటీకరించడంలో తాము గొప్పగా అడుగులు వేశామని, ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి కాలంలో అదే భారత దేశం బలంగా ఉండేందుకు తోడ్పడిందని చెప్పారు. నెలకు రెండు చొప్పున తాము విశేష సాంకేతికతలను సృష్టించడమే కాక, సాంకేతిక రంగంలో 65 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి, ఈ కాలంలో సంపూర్ణమైన ఆశయానికి ఊతమిచ్చామని మంత్రి వివరించారు.
భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, కోవిడ్ అనంతర కాలం నూతనమైన అవకాశాలను కల్పిస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ నొక్కి చెప్పారు. నేటికన్నా అత్యంత ఉత్తేజకరమైన కాలం టెక్నాలజీకి ఎన్నడూ లేదన్నారు. ఇది మన ఆశయాలను పునర్వ్యవస్థీకరించుకుని, కోవిడ్ కాలానికన్నా ముందున్న సమయానికి భిన్నంగా ఉండే భవిష్యత్తును తిరిగి ఊహించుకునే సమయం ఇది అన్నారు. భారత్‌లోని కంపెనీలకు నేడు భిన్నమైన అవకాశాల చట్రాన్ని కోవిడ్ అనంతర కాలం అందిస్తుందని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం ద్వారా అవకాశాన్ని కైవసం చేసుకునేందుకు భారత్ చూస్తోందని తెలిపారు. మీట్‌వై లో తమకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని, ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నామని, కేవలం వ్యాపారాన్ని కోరడానికి, వ్యాపార అభివృద్ధి లేదా సమర్ధన రంగాలకే కాక క్వాంటం కంప్యూటింగ్ లేదా భారత్ సమర్ధతను సృష్టించుకోవాలని కోరుకునే వ్యూహాత్మక ప్రాంతాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సెమి కండక్టర్లు తదితర భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి లో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలనుకుంటున్నామని ఆయన వివరించారు.
పారిశ్రామిక ప్రతినిధులతో ప్రధానమంత్రి దార్శనికతను పంచుకుంటూ, ప్రధానమంత్రి కొన్ని గంభీరమైన లక్ష్యాలను పెట్టారని, సాంకేతిక, అంతరిక్ష రంగంలో భారత్ ప్రముఖ
పాత్ర పోషించాలని కోరుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే తాము ఈ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సామర్ధ్యాలను సమర్ధతలను వివరిస్తూ 5 ఏళ్ళ వ్యూహాత్మక దృక్పధ ప్రణాళికను ప్రవేశపెట్టబోతున్నామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
ఈ ఏడాది ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసంలో, భారతీయ కంపెనీలకు, స్టార్టప్‌లకు, వాణిజ్యవేత్తలకు సాంకేతిక రంగం అందించనున్న అవకాశాలను పట్టిచూపేందుకు, యహీ సమయ్ హైః ఇదే సమయం అంటూ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు.
సాంకేతిక రంగంలో తమ పోటీదారులతో భారత్‌ను పోల్చడంపై మాట్లాడుతూ, మేం పోటీ చేయాలనుకుంటున్న రైలు వేగం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని భావించడం లేదు, ఇతర దేశాలకన్నా చాలా వేగంగా దూసుకువెళ్ళగల స్థితిలో మేం ఉన్నామని, రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం ప్రపంచం వేగంఆ డిజిటీకరణ చెందడం, తరువాతి తరం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ పనితీరు కోసం సెమీకండక్టర్ రంగం హార్డ్‌వేర్ ఆధారిత పని తీరు నుంచి నమూనా ఆవిష్కరణల దిశగా దూసుకుపోవడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో భారత్ లోతైన సాంకేతిక సామర్ధ్యం వంటివి కారణమన్నారు.
ఈ కార్యక్రమంలో తన ఉపన్యాసాన్ని ముగిస్తూ, ప్రభుత్వం ఒక అడుగు అదనంగా వేయడానికి సిద్ధంగా ఉండడమే కాక, టెక్నాలజీ రంగంలో భారత్ ప్రముఖ ఉనికిగా ఉద్భవించేందుకు రోడ్‌మ్యాప్‌ను తయారు చేసేందుకు అన్ని రకాల చర్చలకు సిద్ధంగా ఉందని రాజీవ్ చంద్రశేఖర్ పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1764949)
Visitor Counter : 177