భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
భారతదేశ భవిష్యత్ ప్రగతి సైన్స్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ నిర్వహించిన ఆజాదికా అమృత్ మహోత్సవ్ వారాన్ని ప్రారంభించిన మంత్రి
రాగల 25 సంవత్సరాలలో సమ్మిళిత అభివృద్ధికి సైన్స్, టెక్నాలజీయే ప్రధానాంశం కానున్నదని తెలిపిన మంత్రి
ఇండియా బ్లూ ఎకానమీలో స్వదేశీ స్టార్టప్‌లదే కీలక పాత్ర : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
18 OCT 2021 1:06PM by PIB Hyderabad
భారతదేశ ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి సైన్స్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి (స్వతంత్ర), భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) , , ప్రధానమంత్రి కార్యాలయం, ప్రజా ఫిర్యాదులు , సిబ్బంది, పెన్షన్, అణు ఇంధనం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవ్ వారపు ప్రారంభ సమావేశంలో ,నీలి ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్‌లు, పరిశోధన సాంకేతికత పాత్ర అనే అంశంపై జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇండియా 75 వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్నదని అన్నారు.భారతదేశపు సమగ్ర అభివృద్ధికి శాస్ట్ర విజ్ఞానమే కీలకం కానున్నదన్న అంశాన్ని గుర్తంచుకుంటూ రాగల 25 సంవత్సరాలకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఆయనకు గల స్థాయి, గత దశాబ్దాలలో మున్నెన్నడూ లేని విధంగా ఇండియాకు మంచి ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయని ఆయన అన్నారు. ప్రత్యేకించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సైన్స్ ఆధారిత అభివృద్ధిపై ప్రత్యేక వైఖరి ఉందని, ఇది అన్ని శాస్త్ర విజ్ఞాన కార్యక్రమాలను సామాన్యుడి జీవితానికి అనుగుణమైన రీతిలో వర్తింప చేసేవిధంగా దృష్టిపెట్టేట్టు చేసిందని ఆయన అన్నారు.
ఇండియా నీలి ఆర్ధిక వ్యవస్థ, దేశ ఆర్ధిక వ్యవస్థలో ఒక భాగంగా ఉంటూ మొత్తం సముద్ర వనరుల వ్యవస్థ, సముద్ర ఉత్పత్తులకు సంబంధించి మానవ నిర్మిత ఆర్ధిక మౌలిక సదుపాయాలు, సముద్ర రవాణా, దేశ న్యాయ పరిధికి లోబడినసముద్ర తీరప్రాంత జోన్ లు ఉన్నాయన్నారు. ఇవి ఆర్ధిక పురోభివృద్ధి, పర్యావరణ సుస్థిరత, జాతీయ భద్రతతో ముడిపడిన ఉత్పత్తుల తయారీ , సేవలకు ఉపకరిస్తాయన్నారు.
నీలి ఆర్ధిక వ్యవస్థ కోస్తా తీర ప్రాంతం కలిగిన ఇండియా వంటి దేశాలకు విస్తృల సామాజిక ఆర్ధిక అవకాశాలను కల్పించనున్నదని ఆయన అన్నారు. సముద్ర వనరులను సామాజిక ప్రగతికి బాధ్యతాయుతంగా వినియోగించేందుకు ఇది ఉపకరిస్తుందని మంత్రి తెలిపారు.
భూ విజ్ఞాన శాస్త్రం గురించి ప్రస్తావిస్తూ , మంత్రి , భూ వాతావరణాన్ని అధ్యయనం చేయడం, భూమిపైన, భూమి లోపల నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేయడం, సముద్రాలు, మహాసముద్రాలను అధ్యయనం చేయడం ఇందులో ఉన్నాయన్నారు. భారతదేశపుసముద్రజలాలు మన అపార సంపద అని డాక్టర్‌జితేంద్ర సింగ్ అన్నారు. అందువల్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన డీప్ ఓషన్ మిషన్, నీలి ఆర్ధిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేవనరులను పెంపొందించే విధంగా దృష్టిపెట్టిందన్నారు.
వివిధ వర్గాలకు చెందిన స్టేక్ హోల్డర్లను చేరుకోవలసిన అవసరాన్ని నొక్కిచెబుతూ డాక్టర్ జితేంద్ర సింగ్,
ఆజాదికా అమృత్ మహోత్సవ్ ఉద్దేశాలలో ఒకటి పరిశ్రమను అనుసంధానం చేయడమని అన్నారు. అందువల్ల దేశీయ స్టార్టప్‌లు లేదా స్వదేశీ స్టార్టప్‌లు ఈ కార్యక్రమంలో క్రియాశీలంగా పాల్గొంటున్నాయని ఆయన అన్నారు.
పెద్ద ఎత్తున శాస్త్ర విజ్ఞాన రంగ నిపుణులు, సహజ వనరులతొ భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ సామాన్య ప్రజలకు సంబంధించిన వివిధ అవసరాలను తీరుస్తున్నదని ఆయన అన్నారు. వ్యవసాయ వాతావరణ సూచనలు అందించడం, దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ఉప్పునీటిని మంచి నీటిగా మార్చడం వంటివి ఎన్నో ఈ మంత్రిత్వశాఖ చేపడుతున్నదని ఆయన చెప్పారు..
రాగల రోజులలో సముద్ర జలాల కాలుష్యం ఒక పెద్ద సవాలు కానున్నదని, కోస్తా ప్రాంతం కోతకు గురికావడం వల్ల కోస్తా భూములు కోతకు గురౌతాయని అన్నారు. భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ పాండిచ్చేరి తీరం నుంచి ఒక వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేసిందని,దీనిని ఇతర ప్రాంతాలలో కూడా బలోపేతం చేయడం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.
అంతకు ముందు, భూ విజ్ఞాన మంత్రిత్వశాఖకు నూతనంగా నియమితులైన డాక్టర్ ఎం. రవిచంద్రన్ స్వాగతోపన్యాసం చేశారు. డాక్టర్ నిలోయ్ ఖరే ఈ కార్యక్రమ థీమ్‌ని పరిచయం చేశారు.
****
(Release ID: 1764714)
Visitor Counter : 272