ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
16 OCT 2021 10:00AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 97.23 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 15,981 కొత్త కేసులు నమోదయ్యాయి; గత 8 రోజులుగా 20,000 కేసుల కంటే తక్కువ.
రికవరీ రేటు 98.08% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 17,861 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,33,99,961 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.59% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,01,632. ఇది 218 రోజుల కనిష్ట స్థాయి.
వారపు పాజిటివిటీ రేటు (1.44%) గత 113 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.73%) గత 47 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 58.98 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1764328)
Visitor Counter : 136