విద్యుత్తు మంత్రిత్వ శాఖ

1000 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ( బిఇఎస్ఎస్ ) ప్రాజెక్టు అమలులో భారత్ ముందడుగు

ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించిన ప్రభుత్వం

ఆర్ఈ అభివృద్ధికి దోహదపడే నిర్ణయం

Posted On: 14 OCT 2021 2:58PM by PIB Hyderabad

1000 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ( బిఇఎస్ఎస్   ) ను పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖవిధ్యుత్ మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి. దేశంలో ఇంధన నిల్వ సౌకర్యాలను కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. 

దేశంలో 2030 నాటికి 450 గెగా వాట్ల విద్యుత్ ను  పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయాలన్న నూతన,  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుంది. లక్ష్యాలను సాధించడానికి భారీ ఎత్తున ఇంధనాన్ని నిల్వ చేయడానికి  (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్హైడ్రో పంప్ స్టోరేజ్ ప్లాంట్లు మొదలైనవి) సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. 

 నూతన,  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్ఇసిఐ) 1000 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ( బిఇఎస్ఎస్   ) ను నెలకొల్పడానికి ఆశకి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిని ఆర్ఎఫ్ఎస్ బిడ్ పత్రాలు, బిఇఎస్ఎస్ సేకరణ, వినియోగం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలతో కలిపి విడుదల చేయడం జరుగుతుంది. 

2021 అక్టోబర్ 28 వ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు జరగనున్న  ప్రీ-బిడ్ సమావేశంలో దీనిని చర్చించి ఖరారు చేస్తారు. 

సంబంధిత వర్గాల నుంచి అందే సలహాలు, సూచనలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది ఆర్ఎఫ్ఎస్ ను రూపొందించి 2021 నవంబర్ మొదటి వారంలో విడుదల చేయడం జరుగుతుంది. బిఇఎస్ఎస్ సేకరణవినియోగంఉత్పత్తిసరఫరాపంపిణీ అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలతో కలిపి ఆర్ఎఫ్ఎస్  విడుదల చేయడం జరుగుతుంది. 

ఈ కింది తరగతుల్లో ఇంధన నిల్వ వ్యవస్థను వినియోగించాలని అనుకుంటున్నారు. 

I. శక్తి నిల్వ వ్యవస్థతో పాటు పునరుత్పాదక ఇంధన శక్తి

II. పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి, గ్రిడ్ ను పటిష్టం చేసి, భవిష్యత్తులో పంపిణీ వ్యవస్థలో పెట్టుబడులు అవసరం లేకుండా నిధులను ఆదా చేయడానికి ఇంధన నిల్వ వ్యవస్థను గ్రిడ్ గా వినియోగించడం 

III. సేవలను సక్రమంగా అందించి, నిర్వహణను మెరుగు పరచడానికి స్టోరేజి సౌకర్యంగా వినియోగించడం. దీనివల్ల  ఫ్రీక్వెన్సీ నియంత్రణ మరియు బ్యాలెన్సింగ్ సేవల కోసం లోడ్ డిస్పాచర్లు   నిల్వ వ్యవస్థను ఉపయోగించి ఉత్పత్తి లేని సమయంలో లోడ్ పై పెరిగే భారాన్ని నివారించడానికి అవకాశం కలుగుతుంది. 

IV. పంపిణీ వ్యవస్థ కోసం నిల్వ. వినియోగం ఎక్కువగా ఉండే సమయాల్లో దీనిని లోడ్ సెంటర్ ద్వారా నియంత్రణ ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చు. 

V. ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ను వాణిజ్య వస్తువుగా ఇంధన మార్కెట్ లో విక్రయించవచ్చు. 

 VI.  పైన పేర్కొన్నఅన్ని అంశాలతో కూడిన భవిష్యత్తు వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం.

 (Release ID: 1763936) Visitor Counter : 54