రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) 'ప్రత్యామ్నాయ ఇంధనాలు'
Posted On:
12 OCT 2021 4:39PM by PIB Hyderabad
దిగుమతి ప్రత్యామ్నాయం, తక్కువ ఖర్చు గలది, కాలుష్యం లేనిది మరియు స్వదేశీ అయినందువల్ల ప్రత్యామ్నాయ ఇంధనాల స్వీకరణపై దృష్టి పెట్టాలని, ఇది పెట్రోల్ లేదా డీజిల్‌పై ఆధారపడడం తగ్గిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఉద్ఘాటించారు. . ‘ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ)’ ‘ప్రత్యామ్నాయ ఇంధనం- ముందుకు వెళ్లే మార్గం’ అనే అంశంపై జరిగిన సదస్సులో శ్రీ గడ్కరీ ప్రసంగించారు. ప్రత్యామ్నాయ ఇంధనంగా బయో-ఇథనాల్ అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది చాలా తక్కువ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలతో స్వచ్ఛమైన ఇంధనం. అదనపు ఆదాయం నేరుగా రైతులకు చేరుతుంది, ఇది గ్రామీణ మరియు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది అని ఆయన అన్నారు.
ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం మరియు ఇంధనంగా స్వీకరించే సామర్థ్యాన్ని పరిశీలిస్తూ, ప్రభుత్వంఈ-20 ఇంధన కార్యక్రమాన్నిపునఃరూపకల్పన చేసి ప్రారంభించిందని, ఇది భారతదేశంలో 2025 నాటికి 20% పెట్రోల్‌తో బయో-ఇథనాల్ వినియోగాన్ని నిర్ధారిస్తుందని శ్రీ గడ్కరీ చెప్పారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ సాధించడానికి, 2025 నాటికి దేశానికి 10 బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని ప్రభుత్వం కూడా లెక్కించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో చక్కెర ఇంధన ఉత్పత్తిలో 90% ఇథనాల్ డిమాండ్‌కు దోహదం చేస్తుంది.

అందుబాటులో ఉన్న వనరులతో ఇథనాల్ ఉత్పత్తిని పెంచే మార్గాలను కనుగొనడానికి పరిశోధన చేస్తూనే ఉన్నానని, బి- హెవీ మొలాసిస్‌లో 15% నుండి 20% చక్కెరను జోడించాలన్నది అందులో ఒక ప్రతిపాదన అని శ్రీ గడ్కరీ చెప్పారు. ఇది బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది దాదాపు 45 నుండి 60 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఉపయోగించుకుంటుంది మరియు ముడి పదార్థాల మెరుగైన నాణ్యత కారణంగా ఇథనాల్ రికవరీని 30% మెరుగుపరుస్తుంది.
అదేవిధంగా, చక్కెర నుండి సి-హెవీ మొలాసిస్ ఉత్పత్తిని నిరుత్సాహపరచవచ్చని, ఇది బి-హెవీ మొలాసిస్ ఉత్పత్తిని ప్రామాణీకరిస్తుందని మరియు శాశ్వతంగా చెరకు మెట్రిక్ టన్నుకు 1.5% తక్కువ చక్కెర ఉత్పత్తికి దారితీస్తుందని మంత్రి అన్నారు.
శ్రీ గడ్కరీ ఈ చర్యలన్నీ ఇథనాల్ ఉత్పత్తిని పెంచుతాయని అన్నారు. అంతే కాకుండా ఒక రాష్ట్రంలో అధిక ఇథనాల్ లభ్యతను ఈశాన్య మరియు జమ్మూ-కాశ్మీర్ మరియు లడఖ్ వంటి ఇథనాల్ కొరత ఉన్న రాష్ట్రాలకు రవాణా చేయవచ్చని అయన తెలిపారు. బయో-ఇథనాల్ కూడా విమానయాన ప్రయోజనానికి స్థిరమైన ఇంధనం అని ఆయన అన్నారు. ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలపై 80% ఆదా చేయగలదు మరియు ఎటువంటి మార్పు లేకుండా సంప్రదాయ జెట్ ఇంధనాలతో 50% వరకు కలపవచ్చు అని తెలిపారు. దీనిని భారత వాయుసేన ఇప్పటికే పరీక్షించి ఆమోదించిందని ఆయన చెప్పారు. 100% బయో-ఇథనాల్‌పై ఫ్లెక్స్-ఫ్యూయల్స్ వాహనాలు అందుబాటులోకి రావడంతో, ఇథనాల్ డిమాండ్ 4 నుంచి 5 రెట్లు పెరుగుతుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1763457)