రక్షణ మంత్రిత్వ శాఖ
శ్రీలంక పర్యటనకు బయలుదేరిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
Posted On:
12 OCT 2021 11:13AM by PIB Hyderabad
అక్టోబర్ 12 నుంచి 16 వరకు శ్రీలంకలో పర్యటించేందుకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సిఒఎఎస్), జనరల్ ఎంఎం నారావానే బయలుదేరారు. సిఒఎఎస్‌గా శ్రీలంకకు ఇది ఆయన తొలి పర్యటన.
ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆ దేశపు సీనియర్ సైనిక, పౌర నాయకులతో సమావేశమై భారత్-శ్రీలంక మధ్య రక్షణ సంబంధాలను పెంచేందుకు మార్గాల గురించి చర్చించనున్నారు. భారత్ - శ్రీలంకల మధ్య గల అద్భుతమైన రక్షణ సహకారాన్నిముందుకు తీసుకువెళ్ళేందుకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భ్రదతా యంత్రాంగంలోని సీనియర్ అధికారులతో బహుళ సమావేశాలు జరిపి, రక్షణకు సంబంధించిన పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు. సర్వీస్ ఛీఫ్‌లతో సంభాషించడమే కాక, శ్రీలంక సైన్యం కేంద్ర కార్యాలయాన్ని, గజాబా రెజిమెంటల్ కేంద్రకార్యాలయం, శ్రీలంక మిలిటరీ అకాడెమీలను సందర్శిస్తారు.
భారత్ - శ్రీలంకల మధ్య జరుగుతున్న ఎక్సర్‌సైజ్ మిత్ర శక్తి విన్యాసాల అంతిమ ఘట్టాన్ని వీక్షించి, అనంతరం బటలాండాలోని డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో విద్యార్ధులను, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రిని కలువనున్నారు.
***
(Release ID: 1763230)
Visitor Counter : 194