విద్యుత్తు మంత్రిత్వ శాఖ
థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వల పరిస్థితిని సమీక్షించిన కేంద్ర విద్యుత్ మంత్రి
విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి
విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదు
Posted On:
10 OCT 2021 3:35PM by PIB Hyderabad
డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ప్లాంట్‌లతో సహా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వల పరిస్థితిని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ సమీక్షించారు. నిన్న ( 2021 అక్టోబర్ ) అన్ని వనరుల నుంచి (కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్, బొగ్గు గనులు, దిగుమతి చేసుకున్న బొగ్గు ) 1.99 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అయింది. దీనిలో 1.87 మిలియన్ టన్నుల బొగ్గు ను వినియోగించడం జరిగింది. దీనితో అవసరాలకు మించి బొగ్గు సరఫరా అయ్యింది. దీనితో థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు పెరుగుతున్నాయని అవగతం అవుతోంది. విద్యుత్ ప్లాంట్ల అవసరాల మేరకు బొగ్గును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా హామీ ఇచ్చాయి. దేశంలో దీనికి అవసరమైన నిల్వలు ఉన్నాయి. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అంతరాయం కలిగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ కేంద్రాలలో నాలుగు రోజుల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు రవాణాను ఎక్కువ చేయడానికి కోల్ ఇండియా లిమిటెడ్ చర్యలు ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఎక్కువ అవుతాయి.
ఢిల్లీలో పంపిణీ సంస్థలకు వాటి డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. డిస్కామ్‌ల అవసరాలను పూర్తిగా తీర్చాలని మంత్రి ఎన్‌టిపిసి మరియు డివిసిలను ఆదేశించారు. స్పాట్, ఏపీఎం, లాంటి గ్యాస్ సరఫరా సంస్థల నుంచి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని గైల్ ఇండియా లిమిటెడ్ ను మంత్రి ఆదేశించారు. సంబంధిత పిపిఏ ల నుంచి ఒప్పందం మేరకు ఢిల్లీ పంపిణీ సంస్థలకు గ్యాస్ అందేలా చూడాలని ఎన్‌టిపిసి కి మంత్రి సూచించారు. పిపిఏ ప్రకారం గ్యాస్ అందుతున్నప్పటికీ సరఫరాలను నిలిపి వేసే డిస్కామ్‌లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
2021 ఆగష్టు-సెప్టెంబర్ లలో వర్షాలు కురిసినప్పటికీ ఆర్థిక కార్యక్రమాలు పుంజుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరలు పెరిగాయి. అయితే, దేశంలో బొగ్గు కొరత ఏర్పడకుండా చూసి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూడడానికి ప్రభుత్వం అన్ని చర్యలను అమలు చేస్తున్నది. అవసరాల మేరకు డిస్కామ్‌లకు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని చర్యలను అమలు చేయడం జరుగుతుంది.
(Release ID: 1762785)
Visitor Counter : 192