ఆయుష్
azadi ka amrit mahotsav

సంప్రదాయ వైద్య వ్యవస్థలు, విద్యా పరిశోధన మరియు సామర్థ్య నిర్మాణంలో భారత్‌- క్రొయేషియా స‌హ‌కారం


- ఏఐఐఏ- జాగ్రెర్బ్‌లో క్వార్నెర్ హెల్త్ టూరిజం క్లస్టర్‌తో అవ‌గాహ‌న ఒప్పందంపై  సంతకం

Posted On: 08 OCT 2021 11:57AM by PIB Hyderabad

సంప్రదాయ వైద్య వ్యవస్థలు, విద్యా పరిశోధన మరియు సామర్థ్య నిర్మాణం  విష‌యంలో భారత్‌- క్రొయేషియాలు ప‌ర‌స్ప‌రం  స‌హ‌కారించుకోనున్నాయి. భారతదేశ సంప్రదాయ వైద్య వ్యవస్థలతో పాటు ముఖ్యంగా ఆయుర్వేద రంగంలో రెండు దేశాల మధ్య విద్యా సహకారానికి మార్గం సుగమం చేస్తూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బుధవారం క్రొయేషియాతో బుధవారం  అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది.  అఖిల భార‌త  ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) మరియు క్రొయేషియాకు చెందిన క్వార్నెర్ ఆరోగ్య‌పు ప‌ర్య‌ట‌క‌ క్లస్టర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏఐఐఏ అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ప‌ని చేసే ఒక  స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. క్రొయేషియాతో అవ‌గాహ‌న ఒప్పందం అనేది ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు విద్యా పరిశోధన, వైద్య‌ మరియు విద్యా కార్యకలాపాలు, వైద్య విద్య, శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించే దిశ‌గా ఒక ముఖ్యమైన అడుగు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి, ఆయుష్ శాఖ ప్రత్యేక కార్యదర్శి  శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్ మరియు క్రొయేషియాలో భారత రాయబారి శ్రీ రాజ్ శ్రీవాత్సవ సమక్షంలో ఏఐఐఏ తరపున ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి ఎంఓయుపై సంతకం చేశారు. క్రొయేషియన్ వైపు నుండి క్లస్టర్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్లాదిమిర్ మొజెటిక్‌తో పాటుగా క్లస్టర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ప్రెసిడెంట్ ఇరెనా పెర్సిసివాడినోవ్ మరియు మేనేజ్‌మెంట్ బోర్డ్ సభ్యులు ప్రొఫెసర్ సాండ్రా జంకోవిచ్, సాండ్రా మార్టినిచ్ మరియు అన్నా మరియా లిబ్రిక్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  ప్రత్యేక కార్యదర్శి ఆయుష్ శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈ వారం ప్రారంభంలో జరిగిన మొదటి అంతర్జాతీయ యోగా మరియు ఆయుర్వేద సదస్సులో పాల్గొనడానికి క్రొయేషియాలో ప‌ర్య‌టిస్తోంది. గుర్తించిన సంస్థల సహకారంతో రెండు వైపులా ఆయుర్వేద రంగంలో విద్యా కార్యకలాపాలు చేపడతారు. తాజాగా చేసుకున్న ఈ ఒప్పందంతో ఆధునిక వైద్యంతో ఆయుర్వేద సూత్రాలు మరియు అభ్యాసాలను ఏకీకృతం చేయడం, ఉపన్యాసాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు మరియు సమావేశాలు, ఆయుర్వేదంపై ఇతర కార్యకలాపాల కోసం అధ్యయనం రూపకల్పన మరియు అమలుతో సహా సాక్ష్యం ఆధారిత మార్గదర్శకాలను అభివృద్ధి చేయడం, పరిశోధనపై సన్నిహిత సహకారం చేసుకోవ‌డం వంటి వివిధ కార్య‌క‌లాపాల‌ను చేపట్టేందుకు వీలుప‌డుతుంది.  తుది వినియోగదారులు మరియు భాగ‌స్వాముల అవసరాలకు అనుగుణంగా రెండు వైపులా విద్యా ప్రమాణాల్ని, వివిధ‌ కోర్సులను అభివృద్ధి చేస్తారు. క్రొయేషియాలో ఆయుర్వేద విద్య కోసం ఆయుర్వేద వైద్య విద్య మార్గదర్శకాలను అభివృద్ధి చేస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి  మాట్లాడుతూ "ఈ తాజా  ఒప్పందం విద్యాప‌ర‌మైన ప‌రిశోధ‌న‌,  వైద్య‌ మరియు విద్యాప‌ర‌మై కార్య‌క‌లాపాలు, వైద్య విధ్య ,శిక్ష‌ణ‌ మరియు సామ‌ర్థ్యం పెంపును  ప్రోత్సహిస్తుంది" అని ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి అన్నారు.  "క్లస్టర్ యొక్క లక్ష్యాలలో ఒకటైన‌ ఆరోగ్య మరియు పర్యాటక ఉత్పత్తుల యొక్క మరింత సమగ్రమైన ఆఫర్ కోసం అంతర్జాతీయంగా భాగస్వాములైన  సభ్యులను కనెక్ట్ చేయడం, కానీ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించడం, భారత మంత్రిత్వ శాఖతో ఈ వ్యాపార సహకారం కొత్తద‌నానికి తెరుస్తుందని మేము నమ్ముతున్నాము. భారతదేశం నుండి సంభావ్య భాగస్వాములతో మా 32 మంది సభ్యులను కనెక్ట్ చేసే అవకాశం ఉంది. క్వార్నెర్‌లో ఆరోగ్యం మరియు టూరిజం ఆఫర్‌ని మెరుగుపరచడంతో పాటు, ఈ విధంగా మేము విద్య, శిక్షణ మరియు సామర్థ్యాలను పెంపొందించడం మరియు బలోపేతం చేయడంపై కొత్త భాగస్వాములతో కలిసి పని చేస్తాము "అని డాక్టర్ వ్లాదిమిర్ మొజెటిక్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. 

***


(Release ID: 1762214) Visitor Counter : 220