రైల్వే మంత్రిత్వ శాఖ
మిలే సుర్ మేరా తుమ్హారా గీతం నూతన వర్షన్‌ను జాతికి అంకితం చేసిన శ్రీమతి దర్షన జర్దోష్
మిలే సుర్ మేరా తుమ్హారా నూతన వర్షెన్‌ను కూర్చి, పాడిన మొత్తం రైల్వే సిబ్బంది, అధికారులు
Posted On:
08 OCT 2021 12:52PM by PIB Hyderabad
మిలే సుర్ మేరా తుమ్హారా పాట నూతన వెర్షన్‌ను శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్ర రైల్వేలు, జౌళి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్షన జర్దోష్ జాతికి అంకితం చేశారు. ఈ పాట నూతన వెర్షన్‌ను రైల్వే సిబ్బంది, అధికారులు రూపొందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, సిఇఒ సునీత్ శర్మ, సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన చొరవల్లో ఈ పాట భాగం. దీనితో పాటుగా భారతదేశ వ్యాప్తంగా భారతీయ రైల్వేల విజయాలు, అభివృద్ధి, అనుసంధానతను ప్రదర్శించడం కూడా ఈ చొరవలలో ఒకటి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, ఈ పాట భిన్నత్వంలో ఏకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీమతి దర్షన జర్దోష్ అన్నారు. ఈ పాట నూతన వర్షన్ రైల్వే సిబ్బందికే కాక మొత్తం జాతికి ప్రేరణాత్మకంగా ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఇది స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
ఈ పాట 1988 స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తొలిసారి ప్రసారం చేసిన మిలే సుర్ మేరా తుమ్హారాకు కొత్త వర్షన్. అసలు పాటలో సాహిత్యాన్ని మార్చకుండా, సంగీతాన్ని కొత్త వర్షన్‌లో కూర్చారు. అన్ని జోనల్ రైల్వేల మధ్య స్నేహభావాన్ని పెంచేందుకు ఈ పాటను 13 భిన్న భాషలలో పాడారు.
ఈ పాటను ప్రత్యేకంగా రైల్వే సిబ్బంది మాత్రమే పాడారు. ఈ వీడియోలో వివిధ రైల్వే ఉద్యోగులు, ప్రముఖ రైల్వే క్రీడాకారులు, టోక్యో ఒలింపిక్స్ మెడల్ గ్రహీతలు, ప్రముఖ వ్యక్తులు, రైల్వే అధికారులు, రైల్వే మంత్రి, రైల్వే సహాయ మంత్రి కనిపిస్తారు.
పాట వీడియో లింక్‌ను దిగువన ఇవ్వడం జరిగింది -
***
(Release ID: 1762211)
Visitor Counter : 226