వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అన్ని ప్రభుత్వ పథకాల్లో నైపుణ్యాభివృద్ధి పై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిన - శ్రీ పీయూష్ గోయల్
ఇతర దేశాలతో వాణిజ్య చర్చల సమయంలో విదేశీ విశ్వవిద్యాలయాల తో కీలక అంశాలపై ఒప్పందాలకు కృషి : శ్రీ గోయల్
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతర ప్రజా సేవలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజు శుభదినం" : శ్రీ పీయూష్ గోయల్
ప్రధానమంత్రి మోదీ "నవీన భారతావని" స్వప్నం సాకారానికి ఎన్.ఈ.పి. పునాది వేస్తుందని పేర్కొన్న - శ్రీ గోయల్
"అందరి ప్రయత్నం : సమిష్టి భాగస్వామ్యం" అనే అంశంపై వెబీనార్ ను ఉద్దేశించి ప్రసంగించిన - శ్రీ పీయూష్ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2021 6:15PM by PIB Hyderabad
అన్ని ప్రభుత్వ పథకాల్లో నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అనేక పారిశ్రామిక, టెక్స్-టైల్, ఆటోమొబైల్ పార్కులలో ప్రభుత్వం మరిన్ని వనరులను సమకూరుస్తున్నందున, అటువంటి, ప్రతి పార్కులోనూ సంబంధిత నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉండాలని, ఆయన సూచించారు.
"అందరి ప్రయత్నం : సమిష్టి భాగస్వామ్యం" అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన ఒక వెబినార్ నుద్దేశించి శ్రీ గోయల్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న నూతన విద్యా విధానం (ఎన్.ఈ.పి) ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి పై దృష్టి పెడుతోందని అన్నారు. ద్వంద్వ డిగ్రీ కార్యక్రమాలు, విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, విద్యా సంబంధమైన అంశాలతో పాటు స్వతంత్ర కళల పట్ల ఏ నూతన విద్యా విధానం ప్రోత్సాహాన్ని అందిస్తోందని, ఆయన చెప్పారు.
"ఎన్.ఈ.పి. 2015, జనవరి నుండి విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా 2.5 లక్షల పంచాయతీ ల నుండి 2 లక్షలకు పైగా సూచనలతో పాటు దాదాపు 700 జిల్లాల నుండి ప్రతిపాదనలు స్వీకరించడం జరిగింది. ఎన్.ఈ.పి. ని ఇంతవరకు ఎవ్వరూ విమర్శించలేదు. ఇది అందరి ప్రయత్నం ఫలితంగా రూపొందించబడింది,” అని ఆయన అన్నారు.
ఇతర దేశాలతో వాణిజ్య చర్చల సమయంలో విదేశీ విశ్వవిద్యాలయాల తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఉన్నత విద్యలో నాణ్యత ను పెంపొందించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని, శ్రీ గోయల్ తెలియజేశారు.
"స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టి.ఏ) మరియు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సి.ఈ.పి.ఏ) లో యు.కె., ఆస్ట్రేలియా లేదా కెనడా వంటి అనేక దేశాలతో చర్చలు జరుగుతున్న సమయంలో, మేము విద్య ను సహకారం లో ఒక కీలక రంగంగా చేర్చడానికి ప్రయత్నిస్తున్నాము. ఎన్.ఈ.పి. ని ప్రాతిపదికగా ఉంచుకుని, ఫీజులను తగ్గించాలనే లక్ష్యంతో యూనివర్సిటీల మధ్య ఒప్పందాల కోసం కృషి చేస్తున్నాము.”అని, ఆయన వివరించారు.
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతర ప్రజా సేవలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజు శుభదినం", అని, శ్రీ గోయల్ అన్నారు.
"సబ్కా ప్రయాస్' (సమిష్టి భాగస్వామ్యం) ప్రేరణ శక్తి గా మరియు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు, "సుపరిపాలన" మార్గదర్శక సూత్రంగా, మనం సమాజంలో ని అత్యంత అట్టడుగు వర్గాలకు చేరుకోగలుగుతున్నాము. సుపరిపాలన అంటే దేశాన్ని నిజాయితీగా మార్చడం, మన సంస్థ లలో నిజాయితీని ప్రవేశపెట్టడంతో పాటు, వాటిని పారదర్శకంగా చేయడం. 'అందరితో కలిసి' మరియు 'అందరి అభివృద్ధి' మన ప్రభుత్వ పథకాల వెనుక ఆదర్శం. ఇది మనకు 'అందరి విశ్వాసం' సంపాదించింది, దేశం లోని మొత్తం 135 కోట్ల జనాభాతో పాటు, దేశ భవితవ్యాన్ని మెరుగుపరచడానికి, భారతదేశానికి శ్రేయస్సు తీసుకురావడానికి, ఈ రోజు దేశం మొత్తం 'అందరి ప్రయత్నం' అనే మార్గంలో ఐక్యంగా ఉంది", అని, ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ కలలు కంటున్న "నవీన భారతావని" వాస్తవ రూపం దాల్చడానికి ఎన్.ఈ.పి. పునాది వేస్తుందని, భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి ఇది సహాయపడుతుందని, శ్రీ గోయల్ పేర్కొన్నారు. సుపరిపాలన ప్రమాణంగా, జనధన్; ఉజ్వల; ఎల్.ఈ.డి. బల్బులను ప్రోత్సహించడం; ఆయుష్మాన్ భారత్; డి.బి.టి; జె.ఏ.ఎం; ట్రినిటీ; ఒక దేశం-ఒక రేషన్ కార్డు; పి.ఎం.జి.కె.ఏ.వై. వంటి ప్రతిష్టాత్మక పథకాల అమలుతో ప్రపంచ దేశాల మధ్య భారత దేశ స్థాయి పెరుగుతోందని, ఆయన అభివర్ణించారు.
"సమిష్టి భాగస్వామ్యం (సబ్కా ప్రయాస్) ద్వారా ప్రజల భాగస్వామ్యం (జన్ భాగీదారీ), ప్రజా ఉద్యమానికి (జన్ ఆందోళన్) కి దారితీస్తుంది," అని శ్రీ గోయల్ పేర్కొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 1762007)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160