ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

92.63 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 43.09 లక్షలకుపైగా టీకాలు నిర్వహణ

97.95 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 22,431 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,44,198) 0.72 శాతం

వారపు పాజిటివిటీ రేటు ‍(1.68 శాతం) గత 104 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 07 OCT 2021 9:36AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 92.63 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 43,09,525 డోసులతో కలిపి, మొత్తంగా 92.63 కోట్ల డోసులను (92,63,68,608) టీకా కార్యక్రమం అధిగమించింది. 90,14,182 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,74,457

రెండో డోసు

89,67,785

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,56,797

రెండో డోసు

1,51,98,102

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

37,46,12,592

రెండో డోసు

9,41,31,072

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,30,05,166

రెండో డోసు

8,04,01,016

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,32,00,268

రెండో డోసు

5,81,21,353

మొత్తం

92,63,68,608

 

గత 24 గంటల్లో 24,602 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,32,00,258 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.95 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 102వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 22,431 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,44,198. ఇది 204 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 0.72 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,31,819 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.86 కోట్లకుపైగా (57,86,57,484) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. గత 104 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.57 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 38 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 121 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****



(Release ID: 1761715) Visitor Counter : 139