ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘మానసిక ఆరోగ్య అవగాహన ప్రచార వారోత్స‌వం’ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

- శారీరక ఆరోగ్యం మరియు మేటి ఆరోగ్యానికి అంత‌ర్గ‌తంగా మానసిక ఆరోగ్యం ఎంతోగానో దోహ‌దం చేస్తుంద‌ని పేర్కొన్న‌
కేంద్ర‌ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా

Posted On: 05 OCT 2021 5:36PM by PIB Hyderabad

శారీరక ఆరోగ్యం మరియు మేటి ఆరోగ్యానికి అంత‌ర్గ‌తంగా  మానసిక ఆరోగ్యం ఎంతోగానో దోహ‌దం చేస్తుంద‌ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా అన్నారు. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్య‌త‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేటి నుండి మానసిక ఆరోగ్య అవగాహన ప్రచార వారోత్సవాలను నిర్వ‌హిస్తోంది. ఈ వారోత్స‌వాలు  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముగుస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు మానసిక ఆరోగ్యానికి తోడ్పడే ప్రయత్నాలను సమీకరించేందుకు గాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీని  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వ‌హిస్తారు.  కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌ల రోజువారీ జీవితాలలో గణనీయ‌మైన మార్పులొచ్చిన
నేప‌థ్యంలో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జ‌రుపుకుంటుండ‌డం విశేషం. మ‌హ‌మ్మారి ఇటీవ‌లి కాలంలో
 ప్రజలలో వివిధ మానసిక ఆరోగ్య ఆందోళనలకు దారితీసింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మార్గదర్శకత్వంలో మానసిక రుగ్మతల చుట్టూ ఉన్న వివిధ కళంకాలను అధిగమించడానికి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మానసిక ఆరోగ్య అవగాహన ప్రచార వారోత్స‌వం నిర్వహిస్తున్నారు.  మాన‌సిక ఆరోగ్య అవ‌గాహ కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మరియు రసాయన & ఎరువుల శాఖల‌ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా యునిసెఫ్ యొక్క ప్రపంచ పిల్లల నివేదికను ఈరోజు విడుదల చేశారు. 21 వ శతాబ్దంలో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, సంరక్షకుల మానసిక ఆరోగ్యాన్ని ఈ నివేదిక సమగ్రంగా పరిశీలించింది. నివేదికలో హైలైట్ చేసినట్లుగా, మహమ్మారి పిల్లల మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. మాన‌సిక ఆరోగ్య అవ‌గాహ‌న ప్ర‌చార వారోత్స‌వాల‌లో భాగంగా
వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇతర కార్యకలాపాలలో ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌, బెంగళూరు విద్యా సంస్థలు మరియు ఇతర తగిన సంస్థల సహకారంతో వర్చువల్ అవగాహన వర్క్‌షాప్‌లు, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీలు, గ్రీన్ రిబ్బన్ ప్రచారం, ప్రాంతీయ భాషలలో షార్ట్ ఫిల్మ్‌ల‌ విడుదల, మానసిక ఆరోగ్యంపై #breakthestigma హ్యాష్‌ట్యాగ్ ప్రచారం మరియు క్విజ్/ నినాదాల పోటీలను చేప‌ట్టారు.
                                                                                         

****(Release ID: 1761273) Visitor Counter : 120