విద్యుత్తు మంత్రిత్వ శాఖ
తెహ్రి హైడ్రో డవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (టిహెచ్‌డిసిఐఎల్), నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ ఇ ఇపి సి ఒ) కార్యకలాపాలను సమీక్షించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా రెండు సిపిఎస్‌యూలకు ఆదేశం.
Posted On:
02 OCT 2021 12:58PM by PIB Hyderabad
తె హ్రి హైడ్రో డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిహెచ్‌డిసిఐఎల్), నార్త ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.ఇ.ఇ.ఇ.పి.సి.ఒ) కార్యకలాపాలను కేంద్ర విద్యుత్ , నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ సమీక్షించారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ రెండు సిపిఎస్ యులను బిడ్డింగ్ వేయాల్సిందిగా మంత్రి ఆదేశించచారు. అలాగే రెండు సంస్థలూ తమ పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందిగా మంత్రి ఆదేశించారు. మూడవ త్రైమాసికం నాటికి కాపెక్స్‌లో 90 శాతం ఖర్చు చేయాల్సిందిగా ఈ రెండు సంస్థలకూ సూచించారు.
టిహెచ్ డిసిఐఎల్ సాధించిన ప్రగతిని శ్రీ సింగ్ అభినందించారు. కార్పన్ కాప్చర్ టెక్నాలజీని ఖుర్జా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (2 X 660 MW).కోసం ఏర్పాటు చేసేందుకు తీసుకున్న చర్యలు పురోగతిలో ఉండడం పట్ల మంత్రి అభినందించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద టిహెచ్‌డిసిఐఎ్ గ్రీన్ హైడ్రోజన్ రంగంలోకి వైవిద్యీకరించే చర్యలు చేపట్టినందుకు కూడా టిహెచ్ డిసిఐఎల్‌ను మంత్రి అభినందించారు.
800 మెగావాట్ల సామర్ద్యం గల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వకు సంబంధించిన ప్రాజెక్టును వాణిజ్య ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో అభివృద్ధిచేసేందుకు నిర్ణయించడాన్ని కూడా అభినందించారు. కంపెనీలో కొత్తగా రెండు కొత్త డివిజన్లను ఒకటి థర్మల్ పవర్ ప్లాంట్ ల కోసం మరొకటి గనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచించడం జరిగింది.
నీప్ కో లో మానవ వనరులు దాని మెగావాట్ సామర్ధ్యంతో పోలిస్తే ఎక్కువగా ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.సిఇఎ నిర్దేశించిన స్థాయికి ఉండేట్టు చూసుకోవలసిందిగా మంత్రి సూచచచించారు. నీప్ కో తన కార్యకలాపాలను పునరుత్పాదక ఇంధ రంగంలో వైవిద్యీకరించుకుని తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించుకునేందుకు చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు.
(Release ID: 1760980)
Visitor Counter : 175